E-Paper
Advertisement

Keerthi bhat: విజయ్ తో బ్రేకప్.. నాకేదైనా జరిగితే వారిదే బాధ్యత.. అన్నీ రాసుకున్నా!

Keerthi bhat: విజయ్ తో బ్రేకప్.. నాకేదైనా జరిగితే వారిదే బాధ్యత.. అన్నీ రాసుకున్నా!
Advertisement

Keerthi bhat:ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎప్పుడు ప్రేమలో పడతారో తెలియదు.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో కూడా తెలియదు. అయితే అలా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న జంటలు సవ్యంగా కొనసాగిపోతాయన్న గ్యారెంటీ లేదు. అలాగే మరోవైపు ప్రేమించుకుని ఎంగేజ్మెంట్ చేసుకున్న జంటలు కూడా విడిపోయిన రోజులు ఉన్నాయి.. మరికొన్ని జంటలు విడిపోకపోయినా సరే వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు సృష్టిస్తూ వారి వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు కొంతమంది ఆకతాయిలు. ఈ నేపథ్యంలోనే ఒక నటి ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆమెను మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ పెడుతూ తనకు ఏదైనా జరిగితే? వారిదే బాధ్యత అని.. తనను హింసించిన వారందరి పేర్లు రాసి పెట్టుకున్నాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

బ్రేకప్ చెప్పుకున్న విజయ్ – కీర్తి

ఆమె ఎవరో కాదు ప్రముఖ కన్నడ నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్. తమ ఫ్యామిలీకి జరిగిన ప్రమాదంలో సర్వం కోల్పోయి.. ఆఖరికి పిల్లలను కనే శక్తిని కూడా కోల్పోవడం సంచలనంగా మారింది. అలాంటి ఆమెను వివాహం చేసుకోవడానికి ప్రముఖ దర్శకుడు కం హీరో విజయ్ కార్తీక్ (Vijay Karthik) ముందుకు రావడం అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.ఇకపోతే వీరిద్దరూ ప్రేమించుకున్నారు. మూడేళ్ల క్రితమే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. దీంతో పెళ్లెప్పుడు చేసుకుంటారు అంటూ అభిమానులు అందరూ ప్రశ్నిస్తుండగా.. స్వయంగా వీరిద్దరూ విడిపోతున్నాం అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

డబ్బు కోసం ఇంకో వ్యక్తిని చూసుకుంది..

Advertisement

దీంతో అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రేమ జంటగా పక్షుల్లా విహరించిన వీరిద్దరూ సడన్గా విడిపోతున్నాం అని చెప్పడంతో అభిమానులు, సెలబ్రిటీలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కీర్తి నిన్ను తల్లిలా చూసుకుంటాను అన్న విజయ్ కార్తీక్ కి ఎందుకు ఇంత మోసం చేశావు అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు విజయ్ పై కూడా కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేశారు.దీంతో దీనిపై స్పందించిన విజయ్ కార్తీక్.. నేను ఆమెను వదిలేయలేదు. ఆమె నన్ను వదిలేసి ఇంకొక కొత్త జీవితం ప్రారంభించింది. నా దగ్గర డబ్బు లేదని ఆమె మరో వ్యక్తిని చూసుకుంది అంటూ హాట్ బాంబ్ పేల్చారు.

ALSO READ:Gaddar: నేడు గద్దర్ 77వ జయంతి.. ఉద్యమకారుడికి అరుదైన గౌరవం!

కీర్తి పై విమర్శలు..

Advertisement

దీంతో చాలామంది కీర్తిపై విమర్శలు గుప్పిస్తున్నారు. నువ్వు తల్లివి కాలేవని తెలిసినా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చి నిన్ను బాగా చూసుకుంటున్న విజయ్ కార్తీక్ ను నువ్వు మోసం చేస్తావా? డబ్బు కోసం బంగారం లాంటి మనిషిని దూరం చేసుకోవడం ఏంటి? అంటూ ఎవరికి వచ్చినట్లు వాళ్ళు ఈమెను తిట్టిపోస్తున్నారు.

నాకు ఏదైనా జరగరానిది జరిగితే వారిదే బాధ్యత..

దీంతో ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది..అందులో” ఒకరు చెప్పిన మాటలను విని అదే కరెక్ట్ అనుకొని నన్ను నిందించడం ఏమాత్రం సరికాదు. మీరు నా గత పోస్టులు చూస్తే అందులో ఎక్కడా అవతల వారి బలహీనతలను, వ్యక్తిగత విషయాలను నేను ప్రస్తావించలేదు. ముఖ్యంగా నాపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఇంస్టాగ్రామ్ పేజీలు లేనిపోని ఊహాగానాలు కథలు అల్లుతూ ఏదేదో ప్రచారం చేస్తున్నారు. నన్ను మానసికంగా మరింత ఇబ్బంది పెడుతున్నారు. ఎవరైతే నాపై నిందలు వేస్తూ.. కించపరుస్తూ మాట్లాడుతున్నారో.. వారందరి పేర్లు నేను రాసి పెట్టుకున్నాను. నాకు ఏదైనా జరగరానిది జరిగితే అందుకు వారే బాధ్యులు అంటూ రాసుకొచ్చింది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×