E-Paper
Advertisement

Karthika Deepam 2 : మెంటలెక్కించే న్యూస్.. వంటలక్క ప్లేసులోకి మోనిత.. ఇదేం ట్విస్ట్..

Karthika Deepam 2 : మెంటలెక్కించే న్యూస్.. వంటలక్క ప్లేసులోకి మోనిత.. ఇదేం ట్విస్ట్..
Advertisement

Karthika Deepam 2 : తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ లలో ముఖ్యంగా వినిపించేది కార్తీకదీపం. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. చిన్న స్టోరీగా మొదలైన ఈ సీరియల్ ప్రేక్షకులని ఆలోచనలతో ముందుకు నడిపింది. మొదటి సీజన్లో వంటలక్క డాక్టర్ బాబు ఎప్పుడు కలుస్తారు అన్న ఉత్కంఠతో ఈ సీరియల్ స్టోరీ నడిచింది.. ఇప్పుడు వీరిద్దరి మధ్యలోకి ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారా అన్న స్టోరీ తో సీరియల్ కొనసాగుతుంది.. డాక్టర్ బాబుని వంటలు అక్కని విడగొట్టడానికి జోష్నా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ వాళ్ళని దూరం చేయదు అని జనాలు అనుకునేలా చేసింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు జనాలని మెంటలెక్కించే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ఈ సీరియల్ ద్వారా ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్న వంటలక్క ఇకమీదట కనిపించదు అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది.. అయితే ఆమె ప్లేస్ లోకి మరొకరు రాబోతున్నారు అంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. మరి వంట లెక్క ప్లేస్ లోకి ఎవరు రాబోతున్నారు అన్నది ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

వంటలక్క పాత్రకు శుభం కార్డు..

Advertisement

బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరించిన సీరియల్స్ లో ఎక్కువగా వినిపించే సీరియల్ కార్తీకదీపం.. గతంలో వచ్చిన ఈ సీరియల్ మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు దానికి సీక్వెల్ గా కార్తీకదీపం 2 సీరియల్ ప్రసారం అవుతుంది. ఈ సీరియల్ లో ఎప్పటికీ డాక్టర్ బాబు వంటలు అక్క హైలెట్ అవుతూనే ఉన్నారు. స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో టాప్ రేటింగ్ తో ఉన్న సీరియల్ ఇదే కారణం విశేషం. జనాలు ఈ సీరియల్ ని అంతగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా కేరళ కుట్టి ప్రేమీ విశ్వనాథ్ పై జనాలు అమితమైన ప్రేమను పెంచుకున్నారు.. అయితే ఈ సీరియల్ లోని వంటలక్క క్యారక్టర్ ను తీసేస్తున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. గతంలో కూడా దీప సీరియల్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు మరోసారి వినిపించడంతో జనాలలో టెన్షన్ మొదలైంది.. దీప నిజంగానే ఈ సీరియల్ నుంచి వెళ్ళిపోతుందా లేదా అన్నది మరి కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది..

Also Read : నీతూ క్యూట్ లవ్ స్టోరీ.. పాప యమ స్పీడు గురు..

వంటలక్క ప్లేసులోకి మోనిత…

Advertisement

కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క డాక్టర్ బాబు ఎంత ఫేమస్ అయ్యారో అంతే ఫేమస్ సీరియల్ లోని విలన్ క్యారెక్టర్ లో నటించిన మౌనితకు దక్కింది. వీళ్ళిద్దరిని కలవకుండా చేయాలని ఆమె చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కావు. డాక్టర్ బాబుకి మతిస్థిమితం లేకుండా చేసి తన వైపు తిప్పుకుంది. గతం గుర్తొచ్చిన తర్వాత డాక్టర్ బాబు మళ్ళీ తన భార్యతో కలవడానికి వెళ్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సీరియల్కు కీలక మలుపు తిప్పేది మాత్రం మౌనిత పాత్రనే. ఇందులో కన్నడ ముద్దుగుమ్మ శోభ శెట్టి నటించింది. బిగ్బాస్ ద్వారా వచ్చిన నెగెటివిటీ తో ఈ సీరియల్ లో ఆమెకు అవకాశం రాలేదు. ఇప్పుడు వంటలక్క ప్లేసులోకి మౌనిత రాబోతుంది అంటూ నెట్టింట ఓ వార్త వినిపిస్తూనే ఉంది. మరి ప్రేమి విశ్వనాథ్ వేరే ఏదైనా సమస్యలతో ఈ సీరియల్ నుంచి తప్పకుంటుందా? లేదంటే ఈమధ్య స్లిమ్ గా మారిన దీప సినిమాలలో కూడా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుందా? అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. ఏది ఏమైనా కూడా మౌనిత వర్సెస్ జోష్నా గొడవతో పోటీ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండే అవకాశం ఉంది. మరి దీనిపై ఒక క్లారిటీ రావాలంటే కార్తీకదీపం టీం రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×