E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Neethu : నీతూ క్యూట్ లవ్ స్టోరీ.. పాప యమ స్పీడు గురు..

Gundeninda Gudigantalu Neethu : నీతూ క్యూట్ లవ్ స్టోరీ.. పాప యమ స్పీడు గురు..
Advertisement

Gundeninda Gudigantalu Neethu : తెలుగు సీరియల్స్ ద్వారా ఎంతో మంది మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. అందులో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో స్పెషల్ రోల్ లో నటించిన నీతో కూడా ఒకరు. ఈమె ఎంట్రీ ఇవ్వడంతోనే శృతిరవిల కాపురంలో చిచ్చు పెట్టింది. రవి అంటే ఇష్టంతో శృతికి రవిని దూరం చేయాలని అనుకుంటుంది కానీ వారిద్దరి మధ్య ఉన్న ప్రేమతో ఆమె ఆలోచనను మానుకుంటుంది. కానీ రవిని మాత్రం తన రెస్టారెంట్ ని పైకి తీసుకెళ్ళేందుకు ఇంకాస్త వాడుకోవాలని అనుకుంటుంది. శృతి మాత్రం ఏమి చేస్తున్న ఓవరాక్షన్ కి వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని అనుకుంటుంది. నీతూ ఎంటర్ అయిన తర్వాత సీరియల్ కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.. తన అందం నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా నీతూ లవ్ స్టోరీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె క్యూట్ స్టోరీ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం..

నీతూ లవ్ స్టోరీ..

స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ ప్రారంభమైన కొద్దిరోజులకే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇందులో కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇచ్చే కొద్ది స్టోరీ కీలక మలుపులు తిరిగుతుంది. కల్పన తర్వాత నీతూ ఈ సీరియల్ లోకి అడుగు పెట్టడంతో అనేక ట్విస్టులు ఎదురయ్యాయి. రవి శృతిల మధ్య చిచ్చు పెట్టి విడగొట్టాలని నీతూ చూస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ అలాంటిదేమీ జరగలేదు. తన పెళ్లిని చెడగొట్టడానికి తను రవి సహాయం తీసుకుంటుంది. వీళ్ళిద్దరినీ క్లోజ్ గా చూస్తున్న శృతి మొదట అపార్థం చేసుకున్న సరే ఆ తర్వాత అర్థం చేసుకుంటుంది. ఇందులో నీతూ పాత్రలో నటించిన అమ్మడు అసలు పేరు యామిని.. ఈమె తెలుగు అమ్మాయినే. తెలుగులో పద సీరియల్స్ ఎలా నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈమె రియల్ లైఫ్ లో లవ్ స్టోరీ నడిపిస్తుందని ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. తన క్లాస్మెట్ అయినా ఓ అబ్బాయిని ఈమె ప్రేమిస్తుందట.. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ, ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Also Read :శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

నీతూ రెమ్యూనరేషన్..?

నీతూ అలియాస్ యామిని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె ఆంధ్ర ముద్దుబిడ్డ. విశాఖపట్నంలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ అక్కడే తన చదువును కూడా పూర్తి చేసింది.. మోడలింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టి ఆ తర్వాత సీరియల్స్లలో అవకాశాలు రావడంతో నటనపై ఆసక్తిని పెంచుకుంటూ వచ్చింది. మొదట పలు వెబ్ సిరీస్లలో నటించి సీరియల్స్ దర్శకనిర్మాతల దృష్టిని ఆకట్టుకుంది. ఇప్పటివరకు వెబ్ సిరీస్ లతోపాటుగా సీరియల్స్ కూడా ఎన్నో నటించింది. ముఖ్యంగా సత్యభామ సీరియల్లో హీరో చెల్లెలుగా నటించి అందరి మనసుని దోచుకుంది. తెలుగు నటి అయినా సరే వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతున్న ఈ నీతూ ఒక్క రోజుకి రెమ్యూనరేషన్ దాదాపు 35 వేలకు పైగా తీసుకుంటుంది. ఈమె నెలకి లక్షల్లో సంపాదిస్తుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×