E-Paper
Advertisement

ఆస్తికోసం చిత్రహింసలు.. రెండుసార్లు అబార్షన్.. కార్తీకదీపం సుమిత్ర కన్నీటి కష్టాలు!

ఆస్తికోసం చిత్రహింసలు.. రెండుసార్లు అబార్షన్.. కార్తీకదీపం సుమిత్ర కన్నీటి కష్టాలు!
Advertisement

Karthika Deepam Sumitra: కార్తీకదీపం సీరియల్ ద్వారా సుమిత్రగా ఎంతో సుపరిచితమైనటువంటి నటి సీతాలక్ష్మి (Seetha Lakshmi) ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈమె ఇదివరకు ఎన్నో సీరియల్స్ సినిమాలలో నటించినప్పటికీ కార్తీకదీపం సీరియల్ లో సుమిత్ర పాత్ర ద్వారా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్న సీత నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈమె ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి కష్టాలు గురించి మొదటి భర్త నుంచి విడాకులు రెండో పెళ్లి గురించి పలు విషయాలను తెలిపారు.

పెళ్లి వద్దని భగవంతుడు హెచ్చరించాడు..

నటి సీత మొదట ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని అతని నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే విడాకులకు గల కారణాలను తెలియజేశారు. నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మా ఇంట్లో వారికి ఇష్టం లేదు అందుకే తిరుపతికి వెళ్లి పెళ్లి చేసుకున్నాను అయితే పెళ్లికి వెళ్లే సమయంలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి బహుశా ఆ దేవుడే పెళ్లి వద్దని అలా చెప్పాడేమో కానీ ఆ సమయంలో నాకు అర్థం కాలేదని సీత తెలిపారు. పెళ్లి అంటే ముత్తైదువుల ఆశీర్వాదాలు ఉంటాయి కానీ నాకు మాత్రం భర్త చనిపోయిన వారు, విడాకులు తీసుకొని విడిపోయిన వారి ఆశీర్వాదాలు మాత్రమే లభించాయని తెలిపారు.

అమ్మతనానికే దూరమయ్యాను..

Advertisement

ఇక పెళ్లి అయిన రెండు రోజులకే తనకు టార్చర్ మొదలైందని సీత తెలిపారు. తాను ఇల్లు కట్టుకొని మా అమ్మ పేరు మీద రాశాను ఆ ఆస్తి తీసుకురావడం కోసం చిత్రహింసలు పెట్టేవారు, పెళ్లి తర్వాత నన్ను ఒక బ్యాచిలర్ రూమ్ లో ఉంచారని, తాళి తెంపి మరి నన్ను కొట్టేవారు అంటూ ఈమె అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.. అయితే తనకు మొదట్లో రెండుసార్లు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కానీ తన భర్త పెట్టిన చిత్రహింసల కారణంగా అబార్షన్ అయిందని, చివరికి గర్భసంచి తీసేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడి అమ్మతనానికే దూరమయ్యానని ఎమోషనల్ అయ్యారు.

స్కూల్ ఫ్రెండ్ తో రెండో వివాహం…

Advertisement

ఇలా ఏడేళ్ల పాటు తన వైవాహిక జీవితంలో సంతోషంగా గడిపిన క్షణం లేదని, అందుకే తన నుంచి విడాకులు తీసుకొని విడిపోయానని సీత తెలియచేశారు. ఇలా విడాకులు తీసుకున్న ఈమె తన స్కూల్ ఫ్రెండ్ అయిన అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం తన భర్త వద్ద పెద్దగా ఆస్తులు లేకపోయినా తనని చాలా ప్రేమగా చూసుకుంటారు అంటూ ఈమె తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం సీత చేసిన ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో సౌమ్యంగా హుందాగా కనిపించే సుమిత్ర జీవితంలో ఇన్ని కష్టాలను అనుభవించిందా అంటూ అభిమానులు షాక్ అవుతున్నారు.

Also Read: అనిల్ రావిపూడి- వెంకటేష్ సినిమాలకి రూ.12.5 కోట్లు సేవ్ చేసిన కళ్యాణ్ రామ్

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×