E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode May 30th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ ను లేకుండా చేస్తానని పారిజాతంతో చెప్పిన జ్యోత్స్న

Karthika Deepam 2 Serial Today Episode May 30th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ ను లేకుండా చేస్తానని పారిజాతంతో చెప్పిన జ్యోత్స్న
Advertisement

Karthika Deepam 2  serial today Episode: కార్తీక్‌ చెప్పిందే కరెక్టు అని సూరజ్‌ చెప్పగానే.. పారిజాతం అసలు ఒప్పుకోదు.. ఇంకా నయం నీ షాపులో మా జ్యోత్స్న చేత జ్యూసులుసర్వ్‌ చేయమని అడగలేదు అంటుంద. దీంతో సూరజ్‌ మంచి సలహా ఇచ్చారు.. ఇది ఇంకా న్యాయంగా ఉంది ఓ గంట మేడం జ్యూస్‌ సర్వ్‌ చేస్తే నా షాపుకు వచ్చిన బ్యాడ్‌ నేమ్‌ పోతుంది అని చెప్పగానే.. జ్యోత్స్న తాను ఒప్పుకోను అంటుంది. దీంతో కార్తీక్‌ కల్పించుకుని ఇది కాకుండా వేరే దారి ఉంటే మీరే ఆలోచించండి అంటూ చెప్పగానే.. సూరజ్‌ కూడా నేను అడగాల్సింది అడిగాను సార్‌ పెద్ద మనిషిగా మీరు చేయాల్సిన న్యాయం చేయండి అంటూ చెప్పగానే..

శివనారాయణ దశరథ, సుమిత్రలను మీరేం అంటారు అని అడగ్గానే.. దశరథ, సుమిత్ర మీరేం నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే అంటారు. దీంతో శివనారాయణ సూరజ్‌ కోరుకున్నట్టే జరుగుతుంది. కార్తీక్‌ నువ్వే దగ్గరుండి సూరజ్‌ కోరుకున్నట్టు జరిపించే బాధ్యత నీదే అంటూ చెప్పి వెళ్లిపోతాడు. దీప మాత్రం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఎలా జరిపిస్తావు బావ అని అడగ్గానే.. ముందు ఫోటోషూట్‌ చేయాలి. తర్వాత ఫ్లెక్సీ వేయించడం.. తర్వాత జ్యూస్‌ సర్వ్‌ చేయించడం ముందు ఫోటోషూట్‌ చేద్దాం పదండి అంటూ జ్యోత్స్న, సూరజ్‌, పారిజాతం, దీపలను తీసుకుని బయటకు వెళ్తాడు కార్తీక్‌.

Advertisement

బయటకు వెళ్లిన తర్వాత జ్యోత్స్న చేత ఒక బోర్డు పట్టించి కార్తీక్‌ ఫోటోలు తీస్తుంటాడు. జ్యోత్స్న ఫోటోలు దిగి వెళ్లిపోయాక కార్తీక్‌ అనుమానంగా పారిజాతాన్ని అనుమానిస్తాడు. నీ ఫోకస్‌ మొత్తం అటువైపే ఉంది అంటూ అడగ్గానే.. పారిజాతం మన మీద అనుమానం రాకుండా అలా ఉంటున్నాను అంటూ లోపలికి వెళ్లిపోతుంది పారిజాతం అప్పుడే శివనారాయణ వచ్చి సూరజ్‌ వెళ్లిపోయాడా..? అని అడగ్గానే.. వెళ్లిపోయాడని కార్తీక్‌ చెప్తాడు. ఆత్మగౌరవం కోసం డబ్బులు కూడా వద్దన్నాడు అంటే అలాంటి వాడు మన వ్యాపారంలో ఉంటే బాగుంటుదేమోరా..? అంటాడు. దీంతో కార్తీక్‌ చూద్దాం సార్‌ అతని ప్రయాణం ఎటు తిరగాలని కాలం ఎలా రాసిందో అంటూ చెప్తాడు.

రూలోకి వెళ్లిన పారిజాతాన్ని జ్యోత్స్న పిచ్చి తిట్టుడు తిడుతుంది. నీ వల్లే ఇదంతా ఇంత దూరం వచ్చింది. వాడు ఫ్లెక్సీ పెట్టమని చెబితే.. నువ్వే వాడికి జ్యూసులు సర్వ్‌ చేయమనే ఐడియా ఇచ్చావు… అంటూ తిడుతుంటే.. టైం బాగాలేనప్పుడు అరటిపండు తిన్నా పళ్ళు ఊడిపోతాయే అని చెప్పగానే.. నా టైం బాగాలేక నువ్వు అరిటి పండ్లు తింటే నా పళ్లు ఊడిపోతున్నాయి అంటూ జ్యోత్స్న తిడుతూ.. రేపటి వరకు వాడు, వాడి స్టాల్‌ ఉండదు అంటూ కోపంగా వెళ్లిపోతుంది. మరోవైపు కావేరి, స్వప్న దగ్గరకు వెళ్లి కాశీ ఇలా ఎన్ని రోజులు ఖాళీగా ఉంటాడు ఏదైనా జాబ్‌ చూసుకోమని చెప్తుంటే కాశీ విని వెళ్లిపోతాడు. కాశీ చూశాడన్న విషయం తెలసుకున్న స్వప్న కాశీ దగ్గరకు వెళ్లి ఫీలయ్యావా అని అడగ్గానే.. లేదని మా అమ్మ ఉంటే ఇలాగే చెప్పేది కదా…? అంటూ తాను ఫుడ్‌ బిజినెస్‌ చేయాలనుకుంటున్నట్టు చెప్తాడు. దీంతో స్వప్న చాలా హ్యాపీగా ఫీలవుతుంది.

Advertisement

దశరథ వెళ్లి శివనారాయణతో తనను శివనారాయణ పెంచినంత పద్దతిగా తాను జ్యోత్స్నను పెంచలేకపోయానని బాధపడుతుంటే.. పెంపకం అనేది ఎలా ఉన్నా పద్దతులు ఉండాలి అందులో నీతప్పేం లేదని శివనారాయణ చెప్తుంటే.. జ్యోత్స్న వచ్చి రేపు సూరజ్ షాపు దగ్గరకు తాను వెళ్లనని.. ఐదు లక్షలు పంపించండి అంటూ కోపంగా చెప్తుంది. దీంతో శివనారాయణ కోపంగా దీన్ని బట్టే నీకు సీఈవో అయ్యే అర్హత లేదని చెప్తుంది. ఇక నుంచి నా ఆస్థులకు వారసురాలిగా ఉంటావో.. నా మనవరాలిగా మాత్రమే మిగిలిపోతావో నువ్వే నిర్ణయం తీసుకో అంటూ చెప్పి వెళ్లిపోతాడు శివనారాయ? అయోమయంలో పడిపోతుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×