E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ఆనందరావును చితక్కొట్టిన ధీరజ్.. భాగ్యంకు నర్మద వార్నింగ్.. ధీరజ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: ఆనందరావును చితక్కొట్టిన ధీరజ్.. భాగ్యంకు నర్మద వార్నింగ్.. ధీరజ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 30th: భాగ్యం ఆనందరావు తన కూతురు కడుపు గురించి నర్మద ఇంకా బయట పెట్టే ఉద్దేశాలు లేవు ఎందుకంటే నర్మదకే ఇప్పుడు లేనిపోని సమస్యలు తల మీద ఉన్నాయి అని సంతోషంగా ఉంటారు. అప్పుడే సడన్ గా నర్మదా ధీరజ్ ప్రేమలు ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు. మీరు ఇలా కాపురాలలో చిచ్చు పెడతారని అనుకోలేదు.. కానీ మీ కూతురు కాపురం నిలబెట్టడం కోసం చందు బావని బ్రతిమలాడి మళ్ళీ తనని కాపురానికి వచ్చేలా చేస్తాము.. కానీ మీరు మాత్రం మా కాపురాల్లో చిచ్చు పెట్టాలని అనుకుంటారా మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది అని నర్మదా భాగ్యంకి దిమ్మతిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది..

ధీరజ్ దెబ్బకు ఆనందరావుకు షాక్..

అసలు మా కుటుంబాన్ని రెండు ముక్కలు చేసినందుకు మిమ్మల్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ధీరజ్ నర్మదా ఇద్దరు కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తారు.. అయితే ఆనందరావు ఏదైనా చెప్పే ఒక క్లారిటీగా చెప్పాలి. నాకు క్లారిటీ కావాలి దేని గురించి మేము మీకు ఇబ్బంది పెట్టాము. అది ముందు నాకు ఒక క్లారిటీ ఇవ్వండి అని పొంతన లేకుండా కావాలనే ధీరజ్ని అడుగుతాడు. అయితే ధీరజ్ క్లారిటీ కావాలి అంతే కదా అని చెంప పగలగొడతాడు. ఎందుకు కొడుతున్నాడో తెలియకుండానే కొట్టడంతో అసలు ఎందుకు కొడుతున్నావో చెప్పు అని ఆనంద్ రావు అడిగిమరీ కొట్టించుకుంటాడు..

భాగ్యంను కొట్టిన ప్రేమ..

Advertisement

ఆనందరావు నీ కొడుతుంటే భాగ్యం ఏం జరిగింది అని ఆలోచిస్తూ షాక్ లో ఉండిపోతుంది. ఏం తప్పు చేసావని మమ్మల్ని కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు చెప్పండి అని భాగ్యం అనగానే ప్రేమ రంగంలోకి దిగుతుంది. మిమ్మల్ని కొట్టాలా నరకాల? మీరు మా కుటుంబం రెండు ముక్కలు చేస్తారా మీకు మనసాక్షి అనేది లేదా అని ప్రేమ అంటుంది.. మీరు ఎందుకు కొడుతున్నారో క్లారిటీ అయితే రాలేదు కాని మీకు కొట్టే అంత అవకాశం మేము ఇవ్వము.. ఆ భార్యను నేనే కొడతానని ఆనంద్ రావు భాగ్యం నీకు చితగ్గొట్టేస్తాడు. అదేవిధంగా భాగ్యం కూడా ఆనందరావుని దారుణంగా కర్రతో కొట్టుతుంది.. వీళ్ళిద్దరూ కొట్టుకున్న కూడా ఎందుకు కొడుతున్నారు అన్నది క్లారిటీ రాలేదు అని అనుకుంటారు..

మా ఇంటిని రెండు ముక్కలు చేస్తారా..?

నందనవనం లాంటి మా ఇంటిని మీరు రెండు ముక్కలు చేస్తారా..? మీ పీకల మీదకు వస్తే కానీ మీరు వేరే పని చేయరని నాకు తెలుసు ఏం చేశారో చెప్పండి అని నర్మదా ఎంతగా అడుగుతున్నా సరే భాగ్యం మాత్రం మాకు తెలియదు అని అంటుంది. మీ నాన్న ప్రసాదరావు గారు కదా కుటుంబంలో చిచ్చు పెట్టి లాయర్ గాన్ని తీసుకొచ్చి ఆస్తి పంచమని చెప్పింది మరి మా మీదకి వస్తావ్ ఏంటి అని భాగ్యం అడుగుతుంది. మా నాన్నని రెచ్చగొట్టి కావాలని చెప్పుడు మాటలు చెప్పి పంపించింది నువ్వే అని నాకు తెలుసు అని నర్మదా అంటుంది. ఇదంతా కాదు మా వదిన కడుపుతో ఉంది అని ఆలోచించి మిమ్మల్ని చంపడం లేదు అని అంటాడు. మీకు ఏమన్నా అయితే మా వదిన బాధపడుతుంది దాని ఎఫెక్ట్ బిడ్డ మీద పడుతుంది. అవన్నీ చూసి మేము తట్టుకోలేము అని ధీరజ్ మిమ్మల్ని వదిలేస్తున్నాను అని అంటాడు..

నర్మద మాస్ వార్నింగ్..

Advertisement

మా ఎందుకు కొట్టారో ఎందుకు మమ్మల్ని ఇలా చేశారు అని ఆలోచిస్తూ ఉండగా నర్మదా మళ్లీ యూ టర్న్ తీసుకొని వస్తుంది. మీ కూతురు కడుపుతో ఉందని ఒక్క విషయం ఆలోచించి మిమ్మల్ని వదిలేసాము. కానీ మీ కూతురు కడుపు మీద కూడా నాకు అనుమానంగా ఉంది అని నర్మదా అంటుంది. ఒకవేళ మీరు తన కడుపు విషయంలో ఏదైనా దాచారని తెలియాలి మీకు చుక్కలు చూపిస్తాను అని నర్మదా వార్నింగ్ ఇస్తుంది.. ఇక భాగ్యం ఆనందరావు మన కూతురు కడుపు గురించి బయటపడితే మన పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని ఆలోచిస్తూ ఉంటారు.. ఒకవేళ మన అమ్మడు కడుపుతో లేదని తెలిస్తే మనల్ని చంపేస్తారేమో అని ఆనందరావు భయపడిపోతూ ఉంటాడు..

ధీరజ్ కారులో డ్రగ్స్..

భద్రావతి సేన ఇద్దరు కలిసి ధీరజ్ ని ఇరికించాలని ప్లాన్ చేస్తారు. అయితే పోలీసులతో మాట్లాడి ఎలాగైనా సరే ధీరజ్ ని అరెస్ట్ ఎలా చేస్తానని భద్ర అనుకుంటుంది. అనుకున్న విధంగానే పోలీసులతో ఆమె డీల్ కుదుర్చుకుంటుంది. మేనల్లుడిని తన చెల్లెలుతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి జైల్లో ఉండేలా చేసిన ధీరజ్ని అస్సలు వదలకూడదు.. మేనకోడలికి మాయమాటలు చెప్పి దాన్ని పెళ్లి చేసుకున్నాడు. అలాంటి వాడు బయట ఉండడానికి వీల్లేదు అని భద్ర ఈ డ్రగ్స్ కేసులో ఇరికిస్తే వాడు జీవితాంతం జైల్లో ఊసలు లెక్కపెడుతూ ఉంటాడు అని అనుకుంటుంది.. ఇక పక్కా ప్లాన్ ప్రకారం ధీరజ్ను ఇరికించేందుకు అంత సిద్ధం చేస్తుంది భద్ర..

ప్రేమను కోచింగ్ కు పంపనున్న ధీరజ్..

ప్రేమ ధీరజ్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ధీరజ్ మాత్రం ప్రేమని మళ్లీ ఎస్సై కోచింగ్ లో జాయిన్ చేసి ఈసారి తను మంచి మార్కులతో పాస్ అయ్యేలా చేయాలి అని అనుకుంటాడు. కానీ ప్రేమ మాత్రం మన రెండు కుటుంబాల మధ్య జాబ్ చేయడం అలాంటివి లేవు. కాబట్టి నేను ఇప్పుడు అలాంటివి చేస్తే కచ్చితంగా గొడవలు జరుగుతాయి అని ప్రేమ అంటుంది. కానీ ప్రేమ మాట వినని ఎలాగైనా సరే నేను కోచింగ్ లో జాయిన్ చేస్తాను అని శపధం చేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: మందు కొట్టి రచ్చ చేసిన పల్లవి.. డ్యాన్స్ ఇరగదీశారు.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×