E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode May 27th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ ను కొట్టి ఇంట్లోంచి గెంటేసిన శివనారాయణ  

Karthika Deepam 2 Serial Today Episode May 27th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ ను కొట్టి ఇంట్లోంచి గెంటేసిన శివనారాయణ  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: కార్తీక్‌, దీప ఇంటికి వస్తారు. దీప ఇంట్లోకి రావాలంటే తనకు భయంగా ఉందని చెప్తుంది. దక్షిణమూర్తికి తాత బ్లడ్‌ ఇచ్చిన విషయం ఎవ్వరికీ తెలియదు.. పద వెళ్దాం అంటూ ఇద్దరూ ఇంట్లోకి వెళ్తుంటే.. అప్పటికే ఇంట్లో అందరూ హాల్లో కార్తీక్‌, దీప కోసం వెయిట్‌ చేస్తుంటారు. సుమిత్ర ఓరేయ్‌ కార్తీక్‌ నువ్వు ఓ మంచి పని చేశావని నిన్ను అందరి ముందు అప్రిసేట్‌ చేయాలంటుంది. త్వరగా రా అంటూ పిలుస్తుంది. దీంతో కార్తీక్‌, దీప అనుమానంగా లోపలికి వెళ్తారు. జ్యోత్స్న కార్తీక్‌ను మెచ్చుకుంటూ శివనారాయణను కూడా మెచ్చుకుంటుంది.

దీంతో శివనారాయణ రక్తదానం చేయడం మంచిపనేగా అంటాడు. దీంతో జ్యోత్స్న అవును తాత రక్తం ఇవ్వడం మంచిపనే కానీ నువ్వు రక్తం ఇచ్చిన వ్యక్తి ఎవరో ఒకసారి చూడాల్సింది. అలాగే మా మమ్మీ నీకు థాంక్స్‌ చెప్పాలి ఎందుకంటే మా అమ్మ కన్నతండ్రి ప్రాణాలు కాపాడావు కదా అంటుంది. దీంతో సుమిత్ర కన్నతండ్రి ఎవరే అని అడగ్గానే.. నీకు క్లారిటీ ఇవ్వడానికి ముందు తాతతో మాట్లాడాలి.. తాత మనం దక్షిణమూర్తి ఇంటికి వెళ్దాం పద అనగానే.. శివనారాయణ కోపంగా తిడుతాడు. సుమిత్ర, దశరథ కూడా జ్యోత్స్నను తిడతారు. దీంతో జ్యోత్స్న అయితే మీకు ఆ మనిషికి ఏ సంబందం లేదంటారా..? అని అడిగితే లేదనే కదా చెప్తున్నాను అంటూ శివనారాయణ కోప్పడతాడు. దీంతో జ్యోత్స్న అసలు నిజం చెప్తుంది. హాస్పిటల్‌లో నువ్వు బ్లడ్‌ ఇచ్చి బతికించింది ఆ దక్షిణమూర్తినే అవునో కాదో నీ మనవడినే అడుగు అని చెప్పగానే.. శివనారాయణ కోపంగా కార్తీక్‌ దగ్గరకు వెళ్లి జ్యోత్స్న చెప్పింది నిజమేనా..? అని అడుగుతాడు.

Advertisement

కార్తీక్‌ నిజమే తాత అని చెప్తాడు. దీంతో శివనారాయణ కోపంగా కార్తీక్‌ను కొడతాడు. అందరూ షాక్‌ అవుతారు. కార్తీక్‌ను తిడుతూ.. శివనారాయణ ఎమోషనల్ అవుతాడు. దక్షిణమూర్తిని కాపాడటం నీ మొదటి తప్పు.. హాస్పిటల్‌ లో నాచేత బ్లడ్‌ ఇప్పించడం నీ రెండో తప్పు.. జ్యోత్స్న చెప్పేవరకు నువ్వు చెప్పకపోవడం మరో తప్పు.. నిన్ను జీవితాంతం వెలేయడానికి ఈ తప్పులు చాలు. నాకంటే నీకు వాడే ఎక్కువైనప్పుడు పోరా అంటూ కార్తీక్‌ ను గెంటేస్తాడు. దీంతో కార్తీక్‌ ఏడుస్తూ.. ఉంటే.. శివనారాయణ కూడా ఏడుస్తూ.. కార్తీక్‌ నా చేత పాపం చేయించాడు.. నన్ను నేను శిక్షించుకోలేని పాపం చేయించాడు అంటూ ఏడుస్తుంటాడు. కార్తీక్‌, శివనారాయణ దగ్గరకు వెళ్లి ఏదో చెప్పబోతుంటే.. ఇంకా ఏం చెప్తావు అంటూ జ్యోత్స్న తిడుతుంటే.. కాంచన అడ్డుపడుతుంది. దీంతో జ్యోత్స్న కోపంగా ఆ నిజం మీకు తెలిసి కూడా ఎందుకు తాతకు చెప్పలేదంటూ కాంచనను ప్రశ్నిస్తుంది.

దీంతో పారిజాతం అంటే ఈ నిజం కాంచనకు తెలుసా..? అని అడిగితే అత్తయ్యకే కాదు.. శ్రీధర్‌ మామయ్యకు కూడా నిజం తెలుసు అంటూ జ్యోత్స్న చెప్తుంటే.. కార్తీక్‌ కోపంగా ఇంక ఆపుతావా…? అంటూ మీరందరూ మాట్లాడారు ఇక నేను మాట్లాడతాను అంటూ కార్తీక్‌ చెబితే.. ఇంకా ఏం మాట్లాడతావు.. అంటూ శివనారాయణ కోపంగా అడిగితే ధర్మం మాట్లాడతాను.. నువ్వు చిన్నప్పటి నుంచి నాకు నేర్పిన ధర్మం మాట్లాడతాను అంటూ కార్తీక్‌ ఎమోషనల్‌ గా నా స్థానంలో నువ్వుంటే.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని వదిలేసి వెళ్తావా..? అంటూ ప్రశ్నిస్తాడు. ప్రాణం పోతున్న వాళ్లల్లో నువ్వు శత్రువును చూస్తావా..? మనిషిని చూస్తావా..? అంటూ ప్రశ్నిస్తుంటే అందరూ ఎమోషనల్‌గా చూస్తుంటారు. ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×