// // Hyderabad Accident: హయత్‌నగర్‌‌లో ఘోర ప్రమాదం.. కంటైనర్ లారీని ఢీ కొట్టిన మరొక లారీ, భారీగా ట్రాఫిక్ జామ్ -->
E-Paper
Advertisement

హయత్‌నగర్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్ లారీని ఢీ కొట్టిన మరొక లారీ, భారీగా ట్రాఫిక్ జామ్

హయత్‌నగర్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం..  కంటైనర్ లారీని ఢీ కొట్టిన మరొక లారీ, భారీగా ట్రాఫిక్ జామ్
Advertisement

Hyderabad Accident: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంటైనర్ లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన మరొక లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కంటైనర్ డ్యామేజ్ అయ్యింది. వెనుక లారీ క్యాబిన్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అసలేం జరిగింది?

హయత్‌నగర్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

Advertisement

హైదరాబాద్‌ శివారు ప్రాంతం హయత్‌నగర్‌‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు వస్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి మరో లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కంటైనర్ లారీ తీవ్రంగా డ్యామేజ్ అయ్యింది. వెనుక వస్తున్న లారీ క్యాబిన్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది.

ఈ ప్రమాదం నేపథ్యంలో జాతీయ రహదారిపై కిలోమీటరు మేరా వాహనాలు నిలిచిపోయాయి. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.  మరోవైపు అంబులెన్స్ కూడా అక్కడికి వచ్చింది. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్, క్లీనర్‌‌ని అతి కష్టం మీద బయటకు తీశారు.

Advertisement

కంటైనర్ లారీని ఢీ కొట్టిన మరొక లారీ, భారీగా ట్రాఫిక్ జామ్

క్షతగాత్రులకు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో  ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  దాదాపు రెండు గంటలపాటు ఆ ప్రాంతం మీదుగా ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందిపడ్డారు.

చివరకు వాహనాలను నియంత్రించేందుకు సర్వీసు రోడ్డు ద్వారా వాహనాలను మళ్లించారు. కంటైనర్ లారీ ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్తోంది? టిప్పర్ లారీ ఢీ కొట్టడం వెనుక అసలేం జరిగింది. అనేదానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

ALSO READ: వన్ షార్ట్ టూ బర్డ్స్ ఫార్ములా.. మామూలు మహిళ కాదు, సాప్ట్‌గా ప్లాన్ చేసి భర్తని పైలోకానికి పంపి

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×