E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode May 1st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపకు సారీ చెప్పిన సుమిత్ర – శ్రీధర్ కు స్ట్రోక్ 

Karthika Deepam 2 Serial Today Episode May 1st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపకు సారీ చెప్పిన సుమిత్ర – శ్రీధర్ కు స్ట్రోక్ 
Advertisement

Karthika Deepam 2  serial today Episode: జ్యోత్స్న మాటలకు శివనారాయణ కోపంగా నీ కూతురు ఇంత బరి తెగించి మాట్లాడుతుంటే నువ్వేం అనవా..? అంటూ దశరథను అడిగితే దశరథ నేను తప్పు చేశాను నాన్న ఇన్నాళ్లు కార్తీకే నీ భర్త అని చెప్పి తప్పు చేశాను అంటూ చెప్పగానే.. శివనారాయణ ఇప్పుడు కార్తీక్‌ దీప భర్త. అనగానే.. అది జ్యోత్స్న అర్థం చేసుకోవాలి తనేం చిన్న పిల్ల కాదు కదా… తల్లిగా సుమిత్ర న్యాయంగానే మాట్లాడుతుంది అనగానే.. జ్యోత్స్న మొండిగా నాకు బావ కావాలి బావనే పెళ్లి చేసుకుంటాను అంటుంది. దీంతో సుమిత్ర కోపంగా చెప్తుంటే నీకు అర్థం కాదా..? తిడుతుంటే నీకు అర్థం కావడం లేదా..? అనగానే.. అందరూ నన్నే అంటున్నారు.. కానీ బావ నేనంటే ఇష్టం లేదని ముందే చెప్పాలి కదా..? అనగానే.. పారిజాతం నాకు ముందే చెప్పాడు.

లండన్‌ నుంచి కార్తీక్‌ ఇంటికి రాగానే.. నాతో ఆ విషయం చెప్పాడు. అని చెప్పగానే.. మరి మాతో ఎందుకు చెప్పలేదు అని శివనారాయణ అడగ్గానే.. అప్పుడున్న పరిస్థితుల్లో ఆ నిజం తెలిస్తే ఈ రెండు కుటుంబాలు విడిపోతాయి.. అని చెప్పలేదు అంటుంది. దీంతో జ్యోత్స్న నీ ఆలోచనలతో నష్ట పోయింది నేనే కదా..? మరి నాకు న్యాయం జరగాలి అంటే బావ నా మెడలో తాళి కట్టాలి అనగానే.. సుమిత్ర కోపంగా మరోసారి కార్తీక్‌ తాళి కట్టాలి అనే మాట వచ్చిందంటే నిన్ను ఇంట్లోంచి గెంటేస్తాను.. కనికరం లేకుండా నా చేతులతోనే నిన్ను బయటకు గెంటేస్తాను లోపలికి పో అంటూ వార్నింగ్‌ ఇవ్వగానే.. జ్యోత్స్న వెళ్లిపోతుంది. పారిజాతం దీపను లోపలికి వెళ్లిపోతుంది. శివనారాయణ, కార్తీక్‌కు థాంక్స్ చెప్పగానే.. తనకు కాదని పారిజాతానికి చెప్పమని ఇదంతా చేసింది తనేనని చెప్పగానే.. శివనారాయణ, పారిజాతానికి థాంక్స్‌ చెప్తాడు.. నువ్వు అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు కూడా చేస్తావా..? అంటూ మీ ఇద్దరిని మెచ్చుకుంటున్నాను అంటాడు. అందరూ కలిసి నెల రోజుల్లో జ్యోత్స్నకు పెళ్లి చేయాలి.. అని డిసైడ్‌ అవుతారు.

Advertisement

మరోవైపు శ్రీధర్‌ టిఫిన్‌ చేస్తుంటే.. స్వప్న వస్తుంది. టిఫిన్‌ చేస్తూ.. తాను ఫ్రెండ్స్‌ తో కలిసి టూర్‌ వెళ్తున్నాను అని చెప్తుంది. దీంతో శ్రీధర్‌ టూర్‌ క్యాన్సిల్‌ చేసుకోమని చెప్తాడు. ఎందుకని స్వప్న అడిగితే వద్దని చెప్తున్నాను కదా..? బయట పరిస్థితులు బాగా లేవని చెప్తాడు. అయితే స్వప్న కోపంగా నేను టూర్‌కు వెళ్తున్నాను. కాశీ ఇంట్లోంచి పోయే వరకు నేను ఇంటికే రాను.. ఈ విషయంలో నేను మీ మాట వినను అనగానే.. శ్రీధర్‌ కోపంగా ఉండాలి.. అంటూ జ్యోత్స్న కిడ్నాప్‌ విషయం చెప్తాడు. అదే వార్త నాకు ఎవడైనా నీ కూతురును కిడ్నాప్ చేశామని చెప్తే నాకు ఎలా ఉంటుందో తెలుసా..? అంటూ ఎమోషనల్‌ అవుతాడు.  నాకు నమ్మకం కలిగించే తోడు నీకు దొరికే వరకు నా గుండె భయంభయంగానే కొట్టుకుంటుంది అంటూ టిఫిన్‌ చేయకుండానే లేచి వెళ్లిపోతాడు.

కిచెన్‌లోకి వెళ్లిన దీప కోపంగా తనలో తాను తిట్టుకుంటుంటే సుమిత్ర వెళ్లి సారీ చెప్తుంది. జ్యోత్స్న మాట్లాడిందంతా తప్పేనని కానీ ఆ తప్పు చేయడంలో తల్లిగా  నా పాత్ర ఉంది అంటూ బాధపడుతుంటే.. మీరు చెప్పారని అన్ని జరగలేదు కదా మీ తప్పేం లేదమ్మా.. అంటూ దీప చెప్తుంది. మీరే జ్యోత్స్ను కూర్చోబెట్టి మాట్లాడండి.. నచ్చజెప్పండి అంటూ చెప్తుంది.

Advertisement

ఇంట్లోంచి టిఫిన్‌ చేయకుండా కోపంగా ఆఫీసుకు వెళ్లిపోయిన శ్రీధర్‌ కు కారులో వెళ్తుండగానే.. స్ట్రోక్ వస్తుంది. కారు మెల్లగా పక్కకు ఆపేసి అలాగే స్టీరింగ్‌ మీద కుప్పకూలిపోతాడు. వెనకాలే వచ్చిన ఒక వ్యక్తి శ్రీధర్‌ను కారులోంచి తన కారులో హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు. కార్తీక్‌కు ఫోన్‌ చేసి మీ నాన్న గారు హాస్పిటల్‌లో ఉన్నారని చెప్పగానే.. కార్తీక్‌ షాక్‌ అవుతాడు. హాస్పిటల్‌కు వెళ్తాడు. శ్రీధర్‌ను ఏం జరిగిందని అడుగుతాడు. జరిగింది మొత్తం శ్రీధర్‌ చెప్తాడు. నువ్వు సేవ్‌ చేసింది ఎవరు అంటూ అడగ్గానే.. మెడిసిన్స్‌ తీసుకురావడానికి వెళ్లాడు అని చెప్పగానే.. కార్తీక్‌ అటు వైపు వెళ్తాడు. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×