E-Paper
Advertisement

గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు, రూ. 993 పెంపు

గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు, రూ. 993 పెంపు
Advertisement

LPG Gas Price Hike: బెంగాల్ ఎన్నికల తర్వాత గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతాయని పదే పదే చెప్పుకొచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. ఆయన అన్నట్లుగానే జరిగింది. గ్యాస్ సిలిండర్‌కు దాదాపు వెయ్యి రూపాయలు పెంచాయి చమురు కంపెనీలు. పెరిగిన ధరల వల్ల హోటల్, వ్యాపార రంగాల వారికి ఊహించని షాక్ తగిలింది.

గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు షాక్

Advertisement

పశ్చిమాసియా ఉద్రిక్తల నేపథ్యంలో ఇంధన ధరలతో సతమతమవుతున్నాయి ఆయిల్ కంపెనీలు. గ్యాస్, ఆయిల్ ధరలు పెంచాలని మార్చి మొదటి వారం నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ముఖ్యంగా హోర్మూజ్ జలసంధి వద్ద టెన్షన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు గ్యాస్-ఆయిల్ ధరలు పెంచాయి.

ఇండియాలో మాత్రం ఇప్పటివరకు ధర పెంచలేదు. ఇండియాలో గ్యాస్ ధరలు పెరగడం ఖాయమని రీసెంట్‌గా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే జరిగింది. హోటల్, వ్యాపార రంగాల వారికి ఆయిల్ కంపెనీలు ఊహించని షాక్ ఇచ్చాయి.

Advertisement

భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు, రూ. 993 పెంపు

మే ఒకటి నుంచి 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచాయి కంపెనీలు. ఒక్కో సిలిండర్‌పై రూ.993 పెంచేశాయి. కంపెనీలు పెంచిన ధరతో దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ ధరలు మూడు వేల మార్కు దాటేసింది.  గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో హైదరాబాద్‌‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 3,069 రూపాయలకు చేరింది.

న్యూఢిల్లీలో కూడా దాదాపు అదే పరిస్థితి. అక్కడ రూ.3,071 చేరింది. గత నెలలో కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెంచాయి గ్యాస్ కంపెనీలు. ఈసారి ఏకంగా వెయ్యి రూపాయలు పెంచేసింది.  ఈ విషయంలో సాధారణ ప్రజలకు ఊరట నిచ్చాయి గ్యాస్ కంపెనీలు.

ALSO READ: స్టాక్ మార్కెట్లో బేర్ వీర విహారం.. 24 వేల దిగువకు నిఫ్టీ, 580 పాయింట్లు నష్టపోయిన బీఎస్ఈ

గృహ వినియోగ ఉపయోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. మార్చిలో డొమెస్టిక్ సిలిండర్‌పై 60 రూపాయలు పెంచాయి కంపెనీలు. గృహ వినియోగదారులకు పాత ధరలు వర్తించనున్నాయి. దీనికితోడు మే ఒకటి నుంచి ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల కోసం డెలివరీ అథెంటికేషన్ కోడ్ విధానాన్ని మరింత కఠినతరం చేశాయి ఆయిల్ కంపెనీలు.

దీనివల్ల గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టే అవకాశం ఉండదు. కొత్త నిబంధన మేరకు.. డెలివరీ చేసే వ్యక్తి వినియోగదారుల ఇంటికి గ్యాస్ సిలిండర్‌ను తీసుకువచ్చినప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ఓటీపీ చెప్పుకుంటే సిలిండర్ డెలివరీ పూర్తి కాదు. ఈ విషయంలో గ్యాస్ వినియోగదారులు.. మీ మొబైల్ నంబర్ గ్యాస్ ఏజెన్సీ వద్ద అప్‌డేట్ చేసుకోండి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×