E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 7th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: హాస్పిటల్ లో అడ్మిట్ అయిన దీప 

Karthika Deepam 2 Serial Today march 7th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: హాస్పిటల్ లో అడ్మిట్ అయిన దీప 
Advertisement

Karthika Deepam 2  serial today Episode:  

కాంచన ఒప్పుకోవడంతో కార్తీక్‌, దీపను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్తాడు. అక్కడే ఉన్న దశరథ ఎమోషనల్‌ అవుతుంటే.. ఇప్పుడు మనం చేసే పనిని అందరూ ఇష్టపడకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు అందరూ అర్ధం చేసుకుంటారు. నేను అనుకున్నది సాధించడానికి ఎన్ని బాధలు పడటానికైనా సిద్దంగా ఉన్నాని చెప్తాడు కార్తీక్‌. దీంతో దశరథ ఇంకాస్త ఎమోషనల్‌ అవుతూ కార్తీక్‌ను హగ్‌ చేసుకుంటాడు. తర్వాత కాంచన తన మనవరాలి గురించి బాధపడుతుంటే.. శివనారాయణ ఓదారుస్తాడు. జీవితం తెరమీద కథల్లాంటిదని జరిగే దానిని చూడటం తప్ప దానిని ఆపే ప్రయత్నం చేయటానికి మనం సరిపోమని చెప్తాడు.

దీంతో శ్రీధర్‌ ఎవరూ కావాలని సమస్యలు కొని తెచ్చుకోరని కాంచనకు చెప్తాడు. కానీ దీప మాత్రం సమస్యలకు ఎదురెళ్తుంది. అవి పొరపాటున ఇంటి ముందు నుంచి వెళ్తున్నా వాటిని ఆపి గుమ్మంలోకి రమ్మంటుంద అంటాడు.. అయితే కాంచన బాపడుతూ ప్లాష్‌ బ్యాక్‌ గుర్తు చేసుకుని  ఆ రోజు గురువుగారు దీపని చూసి బిడ్డ జాగ్రత్త అని చెప్పారు. అలా ఎందుకు చెప్పారో నాకు ఈరోజు అర్ధమవుతుంది.. సమస్య రాబోతోందని ఆయన అప్పుడే హెచ్చరించారు. కానీ మనమే పట్టించుకోలేదు.. పైగా నా కొడుకుని మా అన్నయ్యే సమర్ధిస్తున్నాడు. నా కొడుకేమో నా కోడలి మాట కాదనలేడు. నా కోడలేమో నా మాట వినదు అంటూ  కాంచన ఏడుస్తుంది.  ఆ దేవుడి దయ వల్ల అంతా క్షేమంగానే ఉంటారని కూతురిని ఓదారుస్తాడు శివన్నారాయణ.

Advertisement

కావేరి ఇంట్లో బూజు దులుపుతుండగా స్వప్న వచ్చి నేను చేస్తాను నువ్వు తప్పుకోమని చెబుతుంది. ఇవన్నీ నీకు తెలియదు కదా? అసలు నువ్వు ఎప్పుడు చేశావని అడుగుతుంది కావేరి. మా ఆయనతో ఆ ఇంట్లో ఉన్నప్పుడు అని చెప్తూనే.. స్వప్న బూజు దులుపుతుంది. అప్పుడే కాశీ వస్తాడు.. స్వప్న కింద పడిపోతుండగా పట్టుకుంటాడు. నన్నెందుకు పట్టుకున్నావు అంటూ స్వప్న తిడుతుంది. దీంతో కాశీ స్వప్నను వదిలేస్తాడు. స్వప్న కింద పడిపోతుంది. కావేరి రాగానే పైకి లేపమని అడుగుతుంది. తన చేతులు బాగాలేవని కావేరి చెప్పగానే.. కాశీ చేయి ఇస్తాడు.. స్వప్న కోపంగా చూస్తూ.. మళ్లీ నీ చేయి అసలు పట్టుకోను అంటుంది. కాశీ ఏవేవో మాటలు చెప్తుంటే.. మళ్లీ మాటలతో మాయ చేద్దామని చూస్తున్నావా..? అంటూ తిడుగుతుంది స్వప్న.

మరోవైపు దీపకు డాక్టర్‌ టెస్ట్‌ చేసి అన్ని నార్మల్ గానే ఉన్నాయి. మీరేం టెన్షన్‌ పడొద్దు.. ట్రీట్‌మెంట్‌కి కావాల్సిన ప్రోసీజర్ స్టార్ట్ అయ్యింది. ఇక మీరు హాస్పిటల్‌ లోనే ఉండాలని చెప్తుంది. సుమిత్ర గారిని ఎప్పుడు ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలో చెప్తానంటుంది. మీరు ఆ జ్యోత్స్నతో జాగ్రత్తగా ఉండండి అంటూ దశరథకు చెప్తుంది డాక్టర్‌. జ్యోత్స్న తనను కలిసి మాట్లాడిన విషయం చెప్తుంది. అయితే దశరథ మాత్రం నా కూతురు, తన కడుపులోని బిడ్డ ఇద్దరూ బతకాలి. అందుకు నేనేం చేయాలో చెప్పండి అని అడుగుతాడు. ఛాన్స్ ఉంటే నేను వదిలేస్తానా? నేను కూడా ఒక ఆడదానినే కదా? బిడ్డపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అర్ధం చేసుకోగలను. మీరైతే ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దని చెప్తుంది డాక్టర్‌.

Advertisement

మరోవైపు దశరథను ఎలాగైనా రెచ్చగొట్టి నిజం తెలుసుకోవాలని ప్లాన్‌ చేస్తుంది జ్యోత్స్న. ఇంటికి వచ్చిన దశరథను తన ప్రశ్నలలో రెచ్చగొడుతుంది. దీంత దశరథ కోపంగా గట్టిగా మాట్లాడుతుంటే.. అప్పుడే శివనారాయణ వచ్చి దశరథను ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావని తిడతాడు. దీంతో దశరథ కూల్‌గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తన ప్లాన్‌ ఫెయిల్‌ అయినందుకు జ్యోత్స్న ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది. డాడీకి నా గురించి తెలిసిపోయినట్లే ఉంది.. ఒకసారి దాస్‌ని కలవాలని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×