E-Paper
Advertisement

Psychological thriller OTT: ప్రేమ పేరుతో బురిడి… భర్త హత్యకు ప్రియుడితో స్కెచ్… బుర్ర గిర్రున తిరిగే ట్విస్టులు

Psychological thriller OTT: ప్రేమ పేరుతో బురిడి… భర్త హత్యకు ప్రియుడితో స్కెచ్… బుర్ర గిర్రున తిరిగే ట్విస్టులు
Advertisement

Psychological thriller OTT : ఒక అదిరిపోయే థ్రిల్లర్ సినిమాను చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాపై ఓ లుక్ వేయండి. ఈ సినిమా ముంబైలో ఉండే ఒక డెంటిస్ట్ డాక్టరు చుట్టూ తిరుగుతుంది. ఒక అమ్మాయి అతన్ని మోసం చేయడంతో కథ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో నడుస్తుంది. ఇది క్లైమాక్స్ వరకు కట్టిపడేస్తుంది. ఊహించని ట్విస్ట్లు ఈ సినిమాలో బుర్ర గిర్రున తిరిగేలా చేస్తాయి. ఇక చివరగా వచ్చే రివేంజ్ సీన్స్ ఒంట్లో వణుకు పుట్టిస్తాయి. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్

ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఫ్రెడ్డీ’ (Freddy). 2022లో వచ్చిన ఈ హిందీ సినిమాకు శశాంక ఘోష్ దర్శకత్వం వహించారు. లాజీ మోషన్ పిక్చర్స్, NH స్టూడియోస్, నార్తర్న్ లైట్స్ బ్యానర్లపై ఏక్తా కపూర్, శోభా కపూర్ దీనిని నిర్మించారు. ఈ చిత్రంలో అలయ ఎఫ్ తో పాటు కార్తీక్ ఆర్యన్ లీడ్ రోల్‌లో నటించారు. ఈ పాత్ర కోసం కార్తీక్ ఆర్యన్ సుమారు 14 కిలోల బరువు పెరిగారు. చాక్లెట్ బాయ్ ఇమేజ్ నుండి బయటకు వచ్చి, ఒక సైకో థ్రిల్లర్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రం 2022 డిసెంబర్ 2 నుంచి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఫ్రెడ్డీ గిన్వాలా అనే డెంటిస్ట్ డాక్టరు ముంబైలో అమాయకుడిగా, పిరికివాడిగా బతుకుతుంటాడు. ఫ్రెడ్డీ చిన్నతనంలోనే తన తల్లిని తండ్రి చంపడం కళ్లారా చూస్తాడు. ఆ చేదు జ్ఞాపకాలతో అతను ఒంటరి లైఫ్ కి అలవాటుపడతాడు. ఇక పెళ్లి సంబంధాలు ఎన్ని చూసినా సెట్ కాక, ఒక్కడూ ఉండలేక ‘హార్డీ’ అనే తాబేలుతో కాలక్షేపం చేస్తుంటాడు. ఇలాంటి టైమ్ లో కైనాజ్ అనే పిల్లను చూసి మనోడు ఫ్లాట్ అయిపోతాడు. ఆమెకు అప్పటికే పెళ్లయి మొగుడి చేతిలో దెబ్బలు తింటుంటే చూసి తట్టుకోలేక, ఆమెను ఆ కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఏకంగా ఆమె మొగుడినే లేపేస్తాడు. సీన్ కట్ చేస్తే, ఆ పిల్ల తనను అసలు ప్రేమించలేదని, కేవలం ఆస్తి కోసం మొగుడిని చంపడానికే తనను పావులా వాడుకుందని తెలిసి ఫ్రెడ్డీకి మైండ్ బ్లాక్ అవుతుంది.

మోసపోయానని తెలిశాక, ఆ అమాయకపు డాక్టర్ కాస్తా రౌద్ర రూపం ఎత్తుతాడు. తనను నమ్మించి గొంతు కోసిన ఆ పిల్లకి, ఆమె వెనకాల ఉన్న ఆమె ప్రియుడికి చుక్కలు చూపించాలని ఫిక్స్ అవుతాడు. పంటి నొప్పి వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్తాం కానీ, అదే డాక్టరు పగ పడితే ప్రాణాలు ఎలా తీస్తాడో తన డెంటల్ ట్రిక్కులతో వాళ్లకు నరకం చూపిస్తాడు. చివరికి ఆ అమ్మాయిపై, ఆమె ప్రియుడిపై ఈ డెంటల్ డాక్టరు ఎలా పగ తీర్చుకున్నాడు ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనేది తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : అడివిలో అంతుచిక్కని చావులు… వింత ఆచారాలతో ఉత్కంఠ… చూస్తే అస్సలు వదలరు

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×