E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 5th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు నిజం చెప్పిన పారిజాతం 

Karthika Deepam 2 Serial Today march 5th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు నిజం చెప్పిన పారిజాతం 
Advertisement

Karthika Deepam 2  serial today Episode:    

తమ రూంలోంచి లగేజీతో బయటకు వచ్చిన దీప, కార్తీక్‌లను చూసి కాంచన షాక్‌ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. దీంతో కార్తీక్… కొద్ది రోజులు అలా సరదాగా తిరిగొద్దామని వెళ్తున్నామని చెప్తాడు. ఆ మాటలు కాంచన కోపంగా అబద్దం అంటూ అరుస్తుంది. నువ్వు నాతో అబద్దం చెప్తున్నావ్ రా, పారిజాతం పిన్ని నాతో అంతా చెప్పింది అనగానే.. లేదమ్మా ఇదే నిజం అంటాడు కార్తీక్. అయితే మాతో అబద్ధం చెప్పావా అంటూ ఎంట్రీ ఇస్తాడు శివన్నారాయణ. ఆయనను చూడగానే కార్తీక్‌, దీప షాక్‌ అవుతారు. కాంచన మాత్రం మీతో ఏం చెప్పాడు నాన్న అని అడుగుతుంది. దీపకు రెస్ట్‌ కావాలని కొద్ది రోజులు ఇంట్లోనే ఉంటామని చెప్పాడు.. అనగానే.. అవును ఇంటి దగ్గర ఉందామనే లీవ్‌ తీసుకున్నాం.. కానీ కడుపుతో ఉంది కదా తనకి నచ్చిన ప్లేస్ లకి తీసుకెళ్తే సంతోషపడుతుందని ఇలా ప్లాన్ చేశాను అంటాడు కార్తీక్‌.

అయితే కాంచన మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసు.. అనగానే.. ఎక్కడికో చెప్పు అమ్మ అంటాడు కార్తీక్‌. దీపను హాస్పిటల్‌కు తీసుకెళ్తున్నావు కదా అంటుంది కాంచన. కాంచన మాటలకు దీప, కార్తీక్‌ షాక్‌ అవుతారు. కాంచన దీపను తిడుతుంది. ఇంతలో అనసూయ కూడా ఎమోషనల్‌ అవుతూ.. ఎక్కడో అనాథలా బతకాల్సిన నిన్ను చేరదీసి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన వీళ్లకు బిడ్డను ఇవ్వలేవా దీప నువ్వు అలాంటి దానివి కాదని చెప్పు దీప.. లేదంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ కోప్పడుతుంది. కాంచన కూడా కోపంగా అది మాట్లాడదక్క.. దాని స్వార్థం కోసం ఏమైనా చేస్తుంది. ఎంతైనా పరాయి మనిషి కదా అనగానే.. ఇంతలో అక్కడకు వచ్చిన దశరథ ఎమోషన్‌ అవుతూ.. ఎవ్వరూ కూడా దీపను ఇంకో మాట అనడానికి వీల్లేదు. తన గొప్పతనం తెలియక మీరు తనని తక్కువ చేసి మాట్లాడుతున్నారు.. తను హాస్పిటల్‌కు ఎందుకు వెళ్తుందో నాకు తెలుసు.. నేను నిజం చెప్తాను.. అనగానే.. అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు.

Advertisement

కట్‌ చేస్తే.. కాశీ, శ్రీధర్‌ గురించి మామయ్య ఎక్కడికి వెళ్లారు అని  కావేరిని అడుగుతాడు. అప్పుడే అక్కడకు వచ్చిన స్వప్న డ్రైవర్‌, ఓనరును వరుసపెట్టి పిలవకూదని అంటుంది. దీంతో సరే అంటాడు కాశీ. కావేరి మాత్రం స్వప్నను తిడుతుంది. మరోవైపు ఒక్కతే హాల్లో కూర్చున్న పారిజాతం దగ్గరకు వెళ్లిన జ్యోత్స్న నాన్న, తాతయ్య లేరని ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది. దీంతో పారిజాతం నీకో సీక్రెట్‌ చెప్పలేదు కానీ కాంచనకు చెప్పాను ఇప్పుడు అక్కడ పెద్ద యుద్దమే జరుగుతుంటుంది. అని చెప్తుంది. దీంతో తాను దీప, కార్తీక్‌ మాట్లాడుకోవడం విన్న విషయాలు మొత్తం జ్యోత్స్నకు చెప్తుంది. అంతా విన్న జ్యోత్స్స షాక్ అవుతుంది. దీప రిపోర్ట్స్ మ్యాచ్ కావడానికి ఏదైనా సంబంధం ఉందా? దీపే వారసురాలు అని వాళ్లకు తెలిసిపోయిందా.. ఈ దాసు వల్ల నా మతి పోయేలా ఉంది అని మనసులో అనుకొని.. నిజాలు తెలుసుకోవడానికి కాంచన ఇంటికి  బయల్దేరుతుంది జ్యోత్స్న. ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×