E-Paper
Advertisement

Horror movie OTT: అమ్మాయి శరీరంలోకి వెయ్యేళ్ల నాటి ఆత్మ… గూస్ బంప్స్ తెప్పించే హారర్ స్టోరీ

Horror movie OTT: అమ్మాయి శరీరంలోకి వెయ్యేళ్ల నాటి ఆత్మ… గూస్ బంప్స్ తెప్పించే హారర్ స్టోరీ
Advertisement

Horror movie OTT : హారర్ సినిమాల ప్రత్యేకత ఏమిటంటే, ఈ సినిమాలు భయపెడుతూ ఎంటర్టైన్ చేస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలను చూసే క్రేజీ అభిమానులు కూడా ఎక్కువే ఉన్నారు. ఇకపోతే ఇప్పుడు చెప్పుకోబోయే హారర్ సినిమాలో వెయ్యేళ్ల నాటి మంత్రగత్తే, ఆత్మ రూపంలో ఒక మహిళ ఒంటిలో చేరుతుంది. ఆ తర్వాత సీన్స్ చాలా భయంకరంగా ఉండటమే కాకుండా, స్టోరీ కూడా చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఇది అవతార్ తర్వాత వరుసగా ఆరు వారాలు బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానంలో నిలిచింది.

జియో హాట్ స్టార్ (Jio hotstar) లో స్ట్రీమింగ్

ఈ సూపర్ నేచురల్ హారర్ సినిమా పేరు ‘ది రెచ్డ్’ (The Wretched). పియర్స్ బ్రదర్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్-పాల్ హోవార్డ్, పైపర్ కుర్దా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2019 జూలై 19న జరిగిన ఫాంటాసియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచ ప్రీమియర్‌ను ప్రదర్శించింది. 2020 మే 1న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ (Jio hotstar) లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

బెన్ అనే కుర్రాడి పేరెంట్స్ కొన్ని కారణాల వల్ల విడిపోతారు. దీంతో సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి తండ్రి దగ్గరికి వస్తాడు బెన్ . అయితే పక్క ఇంట్లో ఉండే ఫ్యామిలీలో ఒక వింత సంఘటన జరుగుతుంది. ఒక పురాతనమైన దుష్ట శక్తి (మంత్రగత్తె) ఆ ఇంటి యజమానురాలు అబ్బీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అది మామూలు దుష్ట శక్తి కాదు, వెయ్యేళ్ల నాటి మంత్రగత్తె ఆత్మ. రూపాలు మారుస్తూ చిన్న పిల్లలను మాయం చేస్తుంటుంది. మెల్లగా బెన్ ఆ పక్క ఇంట్లో ఏదో తేడా ఉందని గమనిస్తాడు. ఆ మంత్రగత్తె తన మాయతో పిల్లలను మింగేయడమే కాకుండా, వాళ్లు అసలు పుట్టనే లేదన్నట్టుగా వాళ్ల పేరెంట్స్ జ్ఞాపకాలను కూడా తుడిచేస్తుంది.

మరోవైపు తన పక్క ఇంట్లో పిళ్ళాడు మాయమైనా, ఆ బాబు తండ్రి మాత్రం నాకు అసలు కొడుకే లేడు అని చెప్పడం చూసి బెన్ షాక్ అవుతాడు. ఈ భయంకరమైన నిజాన్ని తన తండ్రికి చెప్పినా ఎవరూ నమ్మరు. పైగా బెన్‌ను ఏదో డ్రగ్స్ వాడుతున్నాడని తప్పుగా అర్థం చేసుకుంటారు. చివరికి బెన్ ఒంటరిగానే ఆ రాక్షసి మీద యుద్ధం ప్రకటించాల్సి వస్తుంది. తన స్నేహితురాలు మల్లోరీ సాయంతో ఆ మంత్రగత్తె గుట్టు రట్టు చేసి, మాయమైన పిల్లలను ఎలా కాపాడాడు ? అనేది చాలా థ్రిల్లింగ్‌గా సాగుతుంది. సినిమాలో చివరి వరకు ఉండే సస్పెన్స్, ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఆ చిన్న ట్విస్ట్ చూస్తే ఆడియన్స్‌కి గూస్ బంప్స్ వస్తాయి.

Advertisement

Read Also : 40 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శనలు… అనేక అవార్డులు గెలుచుకున్న ఈ క్రేజీ మూవీ చూశారా?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×