E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 18th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శౌర్యను కిడ్నాప్ చేయించిన జ్యోత్స్న  

Karthika Deepam 2 Serial Today march 18th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శౌర్యను కిడ్నాప్ చేయించిన జ్యోత్స్న  
Advertisement

Karthika Deepam 2  serial today Episode:  దాసు, జోత్స్న దగ్గరకు వెళ్లి వార్నింగ్‌ ఇవ్వాలని చూస్తాడు. దీపను వదిలేయమని.. జ్యోత్స్న చేస్తున్న పనులన్నీ ఆపేయమని లేదంటే రిస్క్‌లో పడతావని చెప్పడంతో జ్యోత్స్న కూడా అంతే రియాక్షన్‌ ఇస్తుంది. తనను దాసు  కూతురినని ఒప్పుకోమని చెప్తుంది. నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నా చేతలు చాలా దారుణంగా ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. జ్యోత్స్న మాటలకు దాస్ భయపడతాడు. సుమిత్ర వదినకు ఆపరేషన్‌ జరిగే వరకే నీ ఆటలు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వు కూడా ఊహించలేవు అని మనసులో అనుకుంటాడు దాస్‌.

తర్వాత సుమిత్రకు ఆపరేషన్‌ అంటేనే తనకు టెన్షన్‌గా ఉందని జ్యోత్స్న బాధపడినట్టు నటిస్తుంది పారిజాతంలో అక్కడే ఉన్న దశరథ అంతా గమనిస్తూ.. నువ్వేం టెన్షన్ పడొద్దు.. ఇన్నిరోజులు ఏ సమస్య వల్ల నిద్రపోలేదో అది ఈరోజుతో తీరిపోతుందని చెబుతాడు దశరథ. ఆ దేవుడి దయ వల్ల నేను అనుకున్నది జరుగుతుంది.. అనుకుంటాడు. దీంతో జ్యోత్స్న కూడా ఈ ఆపరేషన్ పూర్తయితే మీరందరూ ఏదో చేయబోతున్నారని నాకు అర్ధమైంది. అది నేను జరగనివ్వను అనుకుంటుంది మనసులో… ఇంతలో అక్కడికి వచ్చిన సుమిత్ర నేను మళ్లీ మీ అందరినీ తిరిగి చూస్తానో లేదోనని భయంగా ఉందని చెప్తుంది.

Advertisement

దీంతో దశరథ అదేం లేదని.. నీ కూతురికి నీకు ఉన్న రుణానుబంధం అంత తేలికగా తీరిపోదని.. ఈ ఆపరేషన్ తర్వాతే నీ కూతురితో అసలైన బంధం మొదలవుతుందని చెబుతాడు.. దీంతో జ్యోత్స్న షాక్‌ అవుతుంది. దీపే అసలైన కూతురని అందరికీ చెబుతాడా.? ఏంటని టెన్షన్ పడుతుంది. ఇంతలో దశరథ మళ్లీ భగవంతుడి ఆశీస్సులు ఎప్పటికీ మన మీద ఉంటాయి.. అందుకే పోగొట్టుకున్నది దక్కిందని చెప్పడంతో జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు… వెంటనే జ్యోత్స్న మెల్లగా పారిజాతంతో  డాడీ మాటలు వింటుంటే భయంగా ఉంది.. ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్టు ఉన్నారు.. నాకోసం ఓ సాయం చేస్తావా అని అడగ్గా.. సరే అంటుంది పారిజాతం.

ఆసుపత్రిలో దీపను టెస్ట్‌ చేసని డాక్టర్ హారిక కంగారు పడుతుంది.  దశరథ గారి కన్నకూతురు దీపేనని కొందరికే తెలుసు, ఈరోజు ఎలా డీల్ చేయాలో అర్ధం కావడం లేదని టెన్షన్‌ పడుతుంది. దీంతో కార్తీక్‌ మీకు ఏ ప్రాబ్లమ్ రాదని చెప్తాడు. అయితే డాక్టర్‌ మాత్రం శివన్నారాయణ, పారిజాతం, జ్యోత్స్నకి తెలియకుండా ఆపరేషన్ చేయడం నా వల్ల అవుతుందా..? అనగానే.. ఇక్కడ నేనుండగా మీకు ఏ ప్రాబ్లమ్ రాదని చెప్తాడు కార్తీక్. అయితే ఈ ఆపరేషన్ పూర్తయ్యే వరకు మీరు ఎక్కడికి వెళ్లొద్దని ఇక్కడే హాస్పిటల్‌ లోనే ఉండాలని చెప్తుంది. దీంతో కార్తీక్‌ సరే అంటాడు. ఏ సమస్య వచ్చినా తాను చూసుకుంటనంటాడు.

Advertisement

ఇంతలో శ్రీధర్‌ ఫోన్‌ చేసి శౌర్య కనిపించడం లేదని బ్యాగ్‌ ఇంటి గేటు ముందు ఉందని చెప్పగానే.. కార్తీక్‌ టెన్షన్‌ పడతాడు. దీప అడిగితే శౌర్య ఏడుస్తుందట స్కూల్ దాకా వెళ్లోస్తాను అంటూ బయటకు వస్తాడు. అప్పుడే సుమిత్ర, శివనారాయణ, జ్యోత్స్న, పారిజాతం హాస్పిటల్‌కు వస్తారు. కార్తీక్‌ కంగారు చూసి శౌర్య కనిపించడం లేదని బావకు తెలిసినట్టు ఉంది అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కార్తీక్‌ కూడా శౌర్యను జ్యోత్స్నే కిడ్నాప్‌ చేయించి ఉంటుందని అనుకుంటాడు. బయటకు వెళ్తున్న కార్తీక్‌ను శివనారాయణ ఎక్కడికి వెళ్తున్నావని అడగ్గానే.. బావ ఏదో టెన్షన్‌ లో ఉన్నట్టు ఉన్నాడని జ్యోత్స్న అంటుంది. ఈ టెన్సన్ కు కారణం కూడా నీకు తెలుసు కదా.? అందరికి ముగింపు ఇస్తానని తప్పు తెలుసుకుని ఆపకపోతే అందరి కథలు ముగిస్తానని  కార్తీక్ కోపంగా జ్యోత్స్నను చూస్తూ చెప్తాడు. ఇక సుమిత్రకు అత్తా  నీకు ఏ భయం లేదు.. నీ కూతురే నిన్ను కాపాడుతుంది అని చెప్పి వెళ్లిపోతాడు.

తర్వాత అందరూ లోపలికి వెళ్లాక సుమిత్రను టెస్టులకు డాక్టర్‌ తీసుకెళ్తుంది. పారిజాతం, దీప దగ్గరకు వెళ్లి శౌర్య కిడ్నాప్‌ అయిందటగా కార్తీక్‌ నీకు చెప్పలేదా..? అని అడగ్గానే.. దీప షాక్ అవుతుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంటే.. డాక్టర్‌ హారిక వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు.. సుమిత్ర గారు వచ్చారు.. ఆపరేషన్‌కు అంతా రెడీ చేశాము నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్తుంది. దీంతో పారిజాతం అనుమానంగా సుమిత్రకు ఆపరేషన్‌ అయితే దీప ఇక్కడ ఎందుకుండాలి అని అడుగుతుంది. ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×