E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode June 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  దీప, జ్యోత్స్నకు వార్నింగ్ ఇచ్చిన శివనారాయణ

Karthika Deepam 2 Serial Today Episode June 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  దీప, జ్యోత్స్నకు వార్నింగ్ ఇచ్చిన శివనారాయణ
Advertisement

Karthika Deepam 2 serial today Episode: కాంచన కోపంతో జ్యోత్స్నను తిడుతుంటే..  ఈ కాంట్రాక్ట్‌ తీసుకోమని జ్యోత్స్న ముందే చెప్పింది అనగానే.. మరెవరు చేసి ఉంటారు.. ఎవరైనా కొత్త శత్రువు చేశాడా.? పాత శత్రువు చేశాడా..? అని ఆలోచిస్తుంది. కార్తీక్‌ కూడా తాము అదే ఆలోచిస్తున్నామని చెప్తాడు. పట్టుకోవడానికి ఏ ఆధారం లేదని.. పోలీస్‌ కంప్లైంట్‌ ఇస్తే.. తాత ఒప్పుకోడని.. అయినా నువ్వెందుకు టెన్షన్‌ పడతావు. ఇదిగో కాసేపు నీకు ఇష్టమైన సీరియల్‌ చూడు అంటూ సీరియల్‌ ప్లే చేసి ఇస్తాడు కార్తీక్‌. అందులో ఫేక్‌ చెక్‌ ఇచ్చిన బాలరాజు కనిపిస్తాడు. వెంటనే కార్తీక్‌ చూసి వీడు వాడే కదా..? అనుకుంటూ వెంటనే వీడిని పట్టుకోవాలి అనుకుంటూ బాలరాజు షూటింగ్‌ లోకేషన్‌కు వెళ్తాడు.

లోకేషన్‌లో బాలరాజు యాక్టింగ్‌ చేసి డైరెక్టర్‌ను తన ఫర్మామెన్స్‌ ఎలా ఉంది అని అడగ్గానే.. ఎవ్వరూ పలకరు.. అప్పుడే కార్తీక్‌ సూపర్‌గా ఉంది అంటూ ఎంట్రీ ఇస్తాడు. బాలరాజు మీరెవరు సార్‌ మారు వేషంలో తిరగుతున్న ప్రోడ్యూసర్‌ కదా..? సార్‌ మీ సినిమాలో హీరో క్యారెక్టర్‌ కాకున్న సెకండ్‌ హీరో క్యారెక్టర్‌ అయినా ఇవ్వండి సార్‌ అని అడగ్గానే..సెకండ్‌ హీరో ఎందుకు నువ్వే హీరో నీ డీటెయిల్స్‌ ఇవ్వు నేను ఫోన్‌ చేసి చెప్తాను అక్కడకు వచ్చి నీ ఫర్మామెన్స్‌ చూపిస్తే సరిపోతుంది అని కార్తీక్‌ చెప్పగానే.. బాలరాజు నెంబర్‌ ఇస్తాడు. నెంబర్‌ తీసుకున్న కార్తీక్‌ ఇంత త్వరగా దొరుకుతావు అనుకోలేదు అనుకుంటూ వెళ్లిపోతాడు.

Advertisement

జ్యోత్స్న కాఫీ తాగుతూ సూరజ దగ్గరకు వెళ్తుంది. సూరజ్‌ హాయ్‌ బంగారం గుడ్‌మార్నింగ్‌ అంటూ చెప్పగానే.. జ్యోత్స్న కోపంగా తిడుతుంది. దీపకు నువ్వు ఇచ్చిన ఐడియా వర్కవుట్‌ అయిందని హీరోలా ఫీల్‌ అవకు.. అనగానే.. సూరజ్‌ నేను హీరో అని ఎవరు చెప్పారు.. నేను విలన్ ను అని చెప్పగానే.. నిజం బలే ఒప్పుకున్నావు అంటుంది జ్యోత్స్న అవును ఎందుకంటే.. ఒక విలన్‌ కోసం మరో విలనే వస్తాడు అంటూ సూరజ్‌ చెప్పగానే.. నువ్వు చాలా బాధపడతావు సూరజ్‌ అంటూ కోపంగా తిడుతుంటే.. అప్పుడే కార్తీక్‌, దీప వస్తారు. వాళ్లను చూసిన జ్యోత్స్న ఆగిపోతుంది. దగ్గరకు వచ్చిన కార్తీక్‌ ఏంటి మేడంతో ముచ్చట్టు పెట్టావు అని అడిగితే జ్యోత్స్న కోపంగా ఏంటి బావ దీపను తీసుకుని మా ఇంటికి వచ్చావు అంటూ అడగ్గానే.. దీప ఏంటి ఏమంటున్నావు అని కోపగా అడగ్గానే.. అదే సతీసమేతంగా వచ్చారేంటి అని అడుగుతున్నాను అని జ్యోత్స్న చెబితే..  కాదు మా ఆవిడను నేను తీసుకొస్తే.. సతీసమేతంగా అవుతుంది. మా ఆవిడ నన్ను తీసుకొస్తే.. పతీసమేతంగా అంటూ చెప్తాడు కార్తీక్‌.

సరే ఎలా అయినా సరే ఎందుకు వచ్చినట్టు అని జ్యోత్స్న అడగ్గానే.. మామయ్యకు దోసకాయ పచ్చడి తినాలనిపిస్తుందట.. అందుకే వచ్చామని చెప్తాడు.. దీంతో జ్యోత్స్న తనకు అర్థం అయింది ఎలాగూ ఈవెనింగ్‌ నేను సీఈవో అయిపోతాను.. తర్వాత దీప చేయాల్సింది వంటలే కదా అంటూ నవ్వుకుంటుంది.  కార్తీక్‌, దీప లోపలికి వెళ్లిపోతారు.. లోపల శివనారాయణ, పారిజాతం, సుమిత్ర హ్యాపీగా ఉంటారు. ఎందుకు సంతోషంగా ఉన్నారని కార్తీక్‌ అడగ్గానే.. తన సంతోషానికి మీరే కారణం అంటాడు శివనారాయణ. పారిజాతం మాత్రం దీపను ఓడిపోయాక బాధపడొద్దని చెప్తుంది. దీంతో కార్తీక్‌ రిజల్ట్‌ రాకముందే దీపను బాధపడకు అంటున్నావంటే.. మళ్లీ బొద్దింక ఏమైనా పాకిందా..? అని అనుమానంగా అడగ్గానే.. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. సుమిత్ర కల్పించుకుని ఈ పోటీలో న్యాయంగా కష్టపడిన వారికే పట్టంకట్టండి మామయ్య గారు అని చెప్పగానే..

Advertisement

కార్తీక్‌ ఈ పోటీ న్యాయంగానే జరిగింది అంటావా అత్తయ్యా అని కార్తీక్‌ అడిగితే అదే ఆలోచిస్తున్నాను కార్తీక్‌.. నేను కూడా బొద్దింక గురించే ఆలోచిస్తున్నాను అని చెప్తూ.. మామయ్య గారు తప్పు చేస్తే దీపైనా అది జ్యోత్స్న అయినా ఒక్కటే అంటూ చెప్పగానే.. కార్తీక్‌.. సరే అత్తా జ్యోత్స్న ఏదైనా తప్పు చేస్తే అని అడగ్గానే.. జ్యోత్స్న కోపంగా నేనెందుకు తప్పు చేస్తాను అంటుంది. పారిజాతం కూడా అదెందుకు తప్పు చేస్తుంది అని ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్‌ మాట వరుసకు అడిగాను పారు అనగానే.. పారిజాతం కోపంగా మాట వరుసకు ఎలా అడుగుతావు అనగానే.. ఏం నువ్వు మాట వరుసకు నువ్వు దీపను నువ్వు ఓడిపోతే బాధపడకు అని ఎలా అంటావు నువ్వు చెప్పు అత్త ఏం చేస్తావు అని అడగ్గానే.. సుమిత్ర కోపంగా ఎవరు తప్పు చేసినా ఈ ఇంట్లోకి అడుగుపెట్టనివ్వను ఈ ఇంటి కోడలిగా ఈ నిర్ణయం తీసుకునే హక్కు నాకుంది అని చెప్తుంది. శివనారాయణ కూడా సుమిత్ర చెప్పినట్టే తపు చేసిన వాళ్లను నిర్మోహమాటంగా ఇంట్లోంచి వెళ్లగొడతాను అంటూ చెప్పి అందరినీ తీసుకుని ఆఫీసుకు వెళ్లిపోతాడు.

జ్యోత్స్న ఆఫీసుకు వెళ్లి తన కోసం సీఈవో క్యాబిన్‌ క్లీన్ చేయమని ఆఫీస్‌బాయ్‌కు చెప్తుంది. ఆఫీస్‌ బాయ్‌ సెటైర్లు వేస్తే.. సూరజ్‌ వచ్చి నవ్వుకుంటాడు. జ్యోత్స్న చూసి తిడుతుంది. తాను సీఈవో అయ్యాక సూరజ్‌కు ఆఫీసులో మంచి హోదా పెంచుతానని దీప దగ్గర పని చేయడం ఆపేయమని చెప్తుంది. దీంతో సూరజ్‌ తనకు అవసరం లేదని చెప్పగానే.. జ్యోత్స్న వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×