E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode July 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: బాలాను బెదిరించి హోటల్ కొన్న మాలిని  

Karthika Deepam 2 Serial Today Episode July 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: బాలాను బెదిరించి హోటల్ కొన్న మాలిని  
Advertisement

Karthika Deepam 2 serial today Episode:  సూరజ్‌ తాను ఆఫీసుకు రెండు గంటలు లేటుగా వస్తానని దీపకు చెప్తాడు ఎందుకని దీప అడగ్గానే.. కొంచెం పర్సనల్‌ వర్క్‌ ఉందని చెప్తాడు. నీకు ఎవ్వరూ లేరని చెప్పావు కదా పర్సనల్‌ వర్క్‌ ఏంటి అని కార్తీక్‌ అడగ్గానే.. తాను గుడికి వెళ్లి శనిశ్వరుడికి పూజ చేయించాలని చెప్తాడు. ఎందుకని కార్తీక్ అడగ్గానే.. పెళ్లి సెట్టు అయ్యేందుకు పూజ చేయిస్తున్నాను.. దోషం పోతే పెళ్లి సెట్టు అవుతుందని పంతులు చెప్పారు.. అందుకే వెళ్తున్నాను అంటూ సూరజ్‌ చెప్పగానే.. ఇంకా ఏం చెప్పారు బ్రదర్‌ ఆ పంతులు గారు అంటూ అడగ్గానే.. ఆ దోషం ఉంటే.. మనది కాని దాని మీద మనకు వ్యామోహం వస్తుందని దాన్ని దక్కించుకోవాలనే కోరిక ఎక్కువ అవుతుందట.. అని సూరజ్‌ చెప్పగానే.. శివనారాయణ, సుమిత్ర వింటూ ఆలోచిస్తారు..

పారిజాతం మాత్రం వీడు అటు తిరిగి ఇటు తిరిగి జ్యోత్స్న మీదకే తీసుకొచ్చాడు.. అని మనసులో అనుకుంటుంది. అప్పుడే శివనారాయణ కూడా అమ్మా సుమిత్ర మనం కూడా రేపు గుడికి వెళదాం అంటాడు. దీంతో పారిజాతం కల్పించుకుని సూరజ్‌ కోసం మనం గుడికి వెళ్లడం ఏంటి..? అని అడగ్గానే.. శివనారాయణ కూల్‌గా సూరజ్‌ కోసం కాదు మన జ్యోత్స్న కోసం అనగానే.. జ్యోత్స్న నాకోసం దేనికి తాత అని అడుగుతుంది. దీంతో నీకు కూడా పెళ్లి సంబందం చూస్తున్నాము కదా..? గతంలో పంతులు గారు నీ జాతకం చూసి దోషం ఉందని చెప్పారు కదా..? నువ్వు కూడా రేపు వెళ్లి నవగ్రహాలకు పూజ చేసుకో అని చెప్తాడు. ఇక కార్తీక్‌, దీప వెళ్లబోతుంటే.. శివనారాయణ ఇక్కడే భోజనం చేయండి అంటూ చెప్తాడు. సూరజ్‌ వెళ్లబోతుంటే.. సూరజ్‌ ను కూడా అక్కడే భోజనం చేయమని శివనారాయణ చెప్తాడు. ఆ మాటలక జ్యోత్స్న షాక్‌ అవుతుంది. మా ఇంట్లోనే భోజనం చేస్తావా..? నీకు చేయాల్సిన మర్యాదలు చేస్తానురా అని మనసులో అనుకుంటుంది.

Advertisement

బాలా కోపంగా మాలిని ఇంటికి వెళ్లి తన దగ్గర ఉన్న స్టాప్‌ను ఎందుకు కొనేశావని నిలదీస్తాడు. తాను డబుల్‌ పేమెంట్ ఇచ్చి కొంటానని బెదిరిస్తాడు. అప్పుడే ఎవరో ఫోన్‌ చేసి తన హోటల్ మీద ఎవరో రాళ్లు విసిరారని చెప్తాడు. దీంతో బాలా షాక్‌ అవుతాడు. మాలినితో రాజీకొస్తాడు. తన హోటల్‌ అమ్మేస్తానని చెప్తాడు. మాలిని అగ్రిమెంట్‌ పేపర్స్‌ తెప్పించగానే.. అవి చూస్తూ.. బాలా రెండు కోట్లే అని ఉందేంటి మేడం అని అడగ్గానే.. నీకు వేరే ఆప్షన్‌ ఉంటే సంతకం పెట్టొద్దు లేదంటే నేను వేరే మార్గం ఆలోచిస్తాను అంటుంది మాలిని. దీంతో బాలా సంతకం చేసి వెళ్లిపోతుంటే అప్పుడే దక్షిణమూర్తి వస్తాడు. నమస్తే చెప్పి వెళ్లిపోతాడు. దక్షిణమూర్తి అతను ఎందుకు వచ్చాడమ్మ అని అడగ్గానే.. తన హోటల్‌ మనకు అమ్మేసి వెళ్లిపోయాడు మామయ్య అంటుంది. దక్షిణమూర్తి హ్యాపీగా వెళ్లిపోతాడు. నేనేం చేయాలో ఎంతవరకు చెప్పాలో నాకు తెలుసు మామయ్య గారు.. ప్రతీకారం తీర్చుకోవడానికి వేదిక సిద్దం అయింది. అది కూడా మొదలవుతుంది అని కోపంగా చూస్తుంది.

శివనారాయణ ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తుంటే జ్యోత్స్న కోపంగా సూరజ్‌ మీద కర్రీ పడేలా చేస్తుంది. అది చూసిన సుమిత్ర కోపంగా సూరజ్‌ షర్ట్‌ క్లీన్‌ చేయి ఇవ్వమని జ్యోత్స్నకు వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో కార్తీక్‌ ఇది నిజమే రేపు అత్తగారింట్లో ఇలాగే చేస్తే.. ఏమవుతుంది..? అంటూ చెప్తుంటే.. సూరజ్‌ తన కోసం ఎవరూ గొడవపడొద్దని తన షర్ట్‌ తానే క్లీన్‌ చేసుకుంటానని వెళ్లిపోతాడు.

Advertisement

తర్వాత రూంలో పారిజాతం, జ్యోత్స్న మాట్లాడుకుంటుంటే.. సూరజ్‌ వీడియో కాల్‌ చేస్తాడు. జ్యోత్స్న గుర్తుగా పప్పు పోసిన షర్ట్‌ అలాగే పెట్టుకున్నానని చెప్తాడు. ఇప్పుడెందుకు ఫోన్‌ చేశావని అడిగితే చలి మంట వేసుకోవాలనిపిస్తుంది అందుకే మీకు ఫోన్‌ చేశాను అనగానే.. నువ్వు మంట పెట్టుకుంటే నాకేందుకు ఫోన్‌ చేయడం అంటే నేను మంట పెట్టుకోబోయే ఐటమ్‌ చూస్తూ షాక్ అవుతారని జ్యోత్స్న శారీ చూపిస్తాడు. శారీ చూసిన జ్యోత్స్న కోపంగా అరేయ్‌ లక్షన్నర శారీరా అంటూ కోప్పడుతుంటే.. అయితే మీరు వచ్చి నా షర్ట్‌ ఉతకండి అంటాడు జ్యోత్స్న షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×