E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: బావిలో దూకిన వల్లి.. నిజం దాచిన వేదవతి.. రామరాజు మాటతో శ్రీవల్లి కన్నీళ్లు..

Illu Illalu Pillalu Today Episodes: బావిలో దూకిన వల్లి.. నిజం దాచిన వేదవతి.. రామరాజు మాటతో శ్రీవల్లి కన్నీళ్లు..
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 8th: నీ కూతురిని నీ ఇంట్లోనే పెట్టుకొని మేము వెళ్ళిపోతున్నాము అని వేదవతి అక్కడ వల్లిని వదిలేసి వెళ్ళిపోతూ ఉండగా.. రామరాజుకి ఫోన్ చేసి మీకు ఒక నిజం చెప్పాలి మీరు అర్జెంటుగా ఇక్కడికి రండి అని అంటుంది వేదవతి.. ఆ మాట వినగానే వల్లి మామయ్య గారికి నా గురించి నిజం తెలిసిపోతుంది ఆ తర్వాత నన్ను క్షమించడు అని తట్టుకోలేక పోతుంది. వెంటనే అక్కడే ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. అయితే ధీరజ్ వల్లినీ కాపాడతాడు.. మా అమ్మ చేసిందానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అత్తయ్య.. నేను మా అమ్మకి ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నన్ను అసహ్యించుకుంటారు అని కానీ నేను చూసుకుంటాను అని చెప్తూనే వచ్చింది. అందుకే నేను చచ్చిపోవాలని అనుకుంటున్నాను అని వల్లి అంటుంది. వల్లి ఎంత చెప్తున్నా కానీ వేదవతి మాత్రం అస్సలు వినదు..

దిగొచ్చిన వేదవతి..చందు ఫైర్..

వల్లి బావిలో దూకడంపై అందరూ భయపడిపోతారు.. అసలు ఇది ఇలాంటి పిచ్చి పని చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఇప్పుడు ఏం చేద్దాం నాకు అర్థం కావట్లేదు అని పేదవతి అందరిని పక్కకు తీసుకొని వెళ్లి మాట్లాడుతుంది.. ఇది ప్రాణాల మీదకు తెచ్చుకునింది కాబట్టి. దీనికి ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా నా బిడ్డ అయితే నేను అలా వదిలేస్తానా అని వేదవతి కరిగిపోతుంది.. చందు మాత్రం ఇలాంటి దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తాను అంటే నేను అసలు ఊరుకోను అని అంటాడు.. ఇది ఎన్ని చేసిందో నీకు అర్థం కావడం లేదా అమ్మ దీని క్షమించి ఇంటికి తీసుకొని వస్తే ఇంకెన్ని అబద్ధాలు చెప్తుందో ఎందుకమ్మా నువ్వు మళ్ళీ ఇలా చేస్తున్నావు నేనైతే తనని ఇంటికి తీసుకురావడానికి అసలు ఒప్పుకొని ఒప్పుకోను అని తెగేసి చెప్పేస్తాడు. వేదవతి ఎంతగా బ్రతిమిలాడినా కూడా చందు మాట్లాడకుండా మౌనంగా బయటికి వెళ్లిపోతాడు..

టెన్షన్ పడుతున్న వేదవతి..

Advertisement

వేదవతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆయన వస్తే ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఇది చూస్తే ఇది చావాలనుకునింది.. నా బిడ్డ లాంటిది కాబట్టే నేను క్షమించి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని వేదవతి అనుకుంటుంది.. మాటని నర్మదా ధీరజ్ ప్రేమలని అడుగుతుంది.. వాళ్ళందరూ మౌనంగా ఉండడంతో.. ఏంటే మిమ్మల్ని అడుగుతుంటే మాట్లాడకుండా అలా బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటారేంటి అని అడుగుతుంది. మీ ఇష్టం అత్తయ్య మీరు ఎలా అంటే అలానే చేయండి అని నర్మదా అంటుంది. ఇప్పుడు ఆయన వస్తే ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని వేదవ తేదీ బయపడిపోతూ ఉంటుంది..

రామరాజు ఎంట్రీతో వల్లి షాక్..

రామరాజు కంగారు పడిపోతూ ఏంటి బుజ్జమ్మ కోడలు వాళ్ళ ఇంటి దగ్గరికి రమ్మని చెప్పావు. అర్జెంటుగా రమ్మని చెప్తే నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు ఏం జరిగింది అని అడుగుతాడు. అందరూ ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే సుక్కు వచ్చి తను బిడ్డ పోయిందని బాధతో బావిలో దూకేసిందని అబద్ధం చెప్తుంది. రామరాజుకి నిజం తెలిస్తే మళ్లీ వాళ్ళ కుటుంబాన్ని చంపేస్తారు అని వేదవతి కూడా అవునండి అని కంగారు పడిపోతున్నట్లు చెప్తుంది.. నువ్వేం బాధపడకు అమ్మ వల్లి బిడ్డ పోయిందని నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దు తండ్రి లాంటి నేనున్నాను.. నిన్ను నా బిడ్డ లాగా చూసుకుంటాను పదమ్మ మన ఇంటికి వెళ్లి పోదామని వల్లిని తీసుకొని వెళ్తారు.. వేదవతి భాగ్యం ఆనందరావుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.. ఆ ఇంటి గుమ్మం వైపు వచ్చినా కూడా నేను అస్సలు ఊరుకోను అని అంటుంది..

చందు మనసు మార్చుకుంటాడా..?

Advertisement

చందు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు తప్పు చేశారమ్మా. అలాంటి దాన్ని మళ్లీ ఇంటికి తీసుకొని వస్తాను అని ఎందుకు అనుకున్నారు.. మీరు దాన్ని తీసుకుని వచ్చి మళ్లీ మళ్లీ తప్పు చేసి నా గొంతు కోయాలని చూస్తున్నారా అని బాధ పడిపోతాడు. నేనెందుకు నీ గొంతుకోస్తారా? నువ్వు ఊరికే బాధ పడిపోతున్నావు అని తను అంటుంది.. వల్లి ఇంట్లోకి రానివ్వడానికి నేను ఒప్పుకుంటాను అయితే నాన్నకి అన్ని నిజాలు చెప్తేనే నేను తనని ఇంట్లోకి రానివ్వమని చెప్తాను అని అంటాడు. మీ నాన్నకి పోరు తెచ్చుకున్న కోడలు కాబట్టి వల్లి అంటే ఎంతో అమితమైన ప్రేమ ఉంది.. వల్లిని ఒక మాట అంటేనే అసలు ఊరుకోరు.. అలాంటి వల్లి గురించి నిజం చెప్తే ఆయన గుండె పగిలిపోతుంది అని బాధ పడిపోతుంది వేదవతి. ఇక చందు సరే అమ్మ నీ ఇష్టం అని అంటాడు.. అప్పుడే రామరాజు గట్టిగా లోపలి నుంచి కేకలు వేస్తాడు.. శ్రీవల్లి కాఫీ తెచ్చి ఇవ్వడంతో కోడలికి ఆరోగ్యం బాగోలేదు కదా మరి ఎందుకు నువ్వు తన చేత పనులు చేస్తున్నావని రామరాజు సీరియస్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి మాస్టర్ ప్లాన్.. మాట నిలబెట్టుకున్న అవని.. కమల్ దెబ్బ అదుర్స్ కదూ..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×