E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode July 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న కు పెళ్లి సంబంధం పంపించిన మాలిని      

Karthika Deepam 2 Serial Today Episode July 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న కు  పెళ్లి సంబంధం పంపించిన మాలిని      
Advertisement

Karthika Deepam 2 serial today Episode: శివనారాయణ, సూరజ్‌ను పిలిచి మాట్లాడుతుంటే.. గంగాధర్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తన కుటుంబంతో వచ్చి జ్యోత్స్నను చూసుకోవడానికి వచ్చామని చెప్తారు. శివనారాయణ ఎవరు పంపించారని అడిగితే అప్పుడే దశరథ వచ్చి రాత్రి దీపతో మాట్లాడాను.. బహుశా దీప పంపించిందేమోనని చెప్తాడు. జ్యోత్స్న, పారు షాక్‌ అవుతారు. అంతా ఒకరిని ఒకరు పలకరించుకున్న తర్వాత జ్యోత్స్న కోపంగా కూర్చుని ఉంటుంది.

కార్తీక్‌ ఇంట్లోంచి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్లి దీపను పిలుస్తాడు. ఎందుకు బయటకు పిలిచావు అని దీప అడిగితే జ్యోత్స్న పెళ్లి గురించి మాట్లాడదామా..? ఇంట్లో అయితే మాస్టారు వింటారని బయటకు పిలిచానని కార్తీక్‌ చెబితే.. సరే చూద్దాం అని దీప చెప్తుంది. అప్పుడే శివనారాయణ ఫోన్‌ చేసి పెళ్లి వాళ్లు వచ్చారు. మీరు ఇంకా రాలేదని అడుగుతాడు. కార్తీక్‌ సరే వస్తున్నాం తాత అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు. పెళ్లి వాళ్లేంటి బావ అని దీప అడిగితే మీ నాన్న నీకన్నా స్పీడున్నాడు జ్యోత్స్నకు పెళ్లి సంబందం చూశాడు అని చెప్తాడు కార్తీక్. పిల్లను చూసుకోవడానికి పెళ్లి వాళ్లు ఇంటికి వచ్చారు అని చెప్పగానే.. దీప ఎగ్జైటింగ్‌గా ఇదంతా ఎప్పుడు జరిగిందని అడిగితే.. ఇప్పుడే జరుగుతుందట.. మనం త్వరగా వెళ్దాం పద అంటాడు కార్తీక్. అత్తయ్యకు చెబుదామని దీప అంటే పెళ్లి సెట్ అవని పద అంటూ దీపను తీసుకుని వెళ్తాడు కార్తీక్‌.

Advertisement

పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లికొడుకు జ్యోత్స్నను ఏమీ మాట్లాడటం లేదని తను ఇంతకీ మిస్ హైదరాబాదేనా..? అని అడగ్గానే.. సూరజ్‌ కల్పించుకుని జ్యోత్స్న గురించి చాలా గొప్పగా చెప్తుంటాడు. అప్పుడే కార్తీక్‌, దీప వచ్చి గుమ్మం దగ్గరే నిలబడి వింటుంటారు. సూరజ్‌ చెప్తుంటే.. పారిజాతం ఏంటి మా జ్యోత్స్నలో ఇంత ఉందా..? అని మనసులో అనుకుంటుంది. సూరజ్‌ చెప్తూ.. చంద్రుడిలో మచ్చ ఉన్నట్టే మా జ్యోత్స్నలో కూడా ఒక లోపం ఉంది అని చెప్తాడు. ఆ మాటకు అందరూ షాక్‌ అవుతారు. జ్యోత్స్న మాత్రం వీడు నా పరువు తీయడానికే ఏదో ప్లాన్‌ చేసినట్టు ఉన్నాడు అని మనసులో అనుకుంటుంది. పారు కూడా వీడు పొగిడినప్పుడే నాకు అనుమానం వచ్చింది అని మనసులో అనుకుంటుంది. గుమ్మం దగ్గర ఉన్న కార్తీక్‌ ఏంటి బ్రదర్‌ ఆ లోపం అని అడుగుతాడు. ఆ రా బ్రదర్‌ అంటూ సూరజ్‌, కార్తీక్‌ను పిలుస్తాడు..

పెళ్లి కొడుకు ఏంటి ఆ లోపం చెప్పండి అంటూ ఎగ్జైంటింగ్‌గా అడిగితే జ్యోత్స్న గారికి వంట చేయడం రాదు అని చెప్పగానే.. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఇంతలో కార్తీక్‌ ఎవరు తాత ఈ సంబంధం హైదరాబాదేనా..? అని అడగ్గానే.. శివనారాయణ అది నువ్వే చెప్పాలి అంటాడు. కార్తీక్‌ నేను చెప్పడం ఏంటి..? అనగానే.. నువ్వు కాకపోతే దీప చెప్పాలి అని దశరథ అడిగితే.. దీప నేను చెప్పడం ఏంటి..? అంటుంది. ఇంతలో పెళ్లి వారు కూడా కార్తీక్‌, దీపలను ఎవరని అడుగుతారు. శివనారాయణ వాళ్లు పంపిస్తేనే కదా మీరు వచ్చింది అని అడిగితే పెళ్లి వాళ్లు కాదని చెప్తారు. మరి మేడం పంపిస్తే వచ్చామని చెప్పారు అనగానే.. ఈ మేడం కాదండి డీఎం రెస్టారెంట్‌ చైర్మన్‌ మాలిని గారు అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. శివనారాయణ మిమ్మల్ని పంపించింది మాలినియా..? అని అడగ్గానే మాలిని అవును బాబాయ్‌ నేనే పంపించాను అంటూ వస్తుంది. వెనకే దక్షిణమూర్తి వస్తాడు.

Advertisement

వాళ్లను చూసి అందరూ మరింత షాక్‌ అవుతారు. మాలిని, దక్షిణమూర్తిలను అందరూ తిడతారు. సంబంధం లేకుండా ఇంట్లోకి ఎందుకు వచ్చారని కోప్పడతారు. దీంతో మాలిని అన్ని విషయాలు మాట్లాడుతుంది. జ్యోత్స్న మీ కూతురేనా..? ఎవరైనా ఇస్తే పెంచుకున్నావా..? కార్తీక్‌ ఎవరో దారినపోయే దాని మెడలో తాళి కడితే దాన్ని తీసుకొచ్చి సీఈవోను చేస్తారా..? అంటూ నిలదీస్తుంది. దీంతో కార్తీక్‌ కోపంగా మాలినిని తిడతాడు. దీప గురించి ఇంకోసారి మాట్లాడొద్దని వార్నింగ్‌ ఇస్తాడు. దీంతో మాలిని కోపంగా దీప వల్ల జోత్స్నకు అన్యాయం జరిగింది అంటూ చెప్పగానే.. దీప కోపంగా మా బావ జ్యోత్స్నను ఎప్పుడూ ప్రేమించలేదు అంటూ చెప్పగానే.. అలాగని నా కూతురు నీ దగ్గర చెప్పిందా..? అంటూ సుమిత్ర నిలదీయగానే.. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×