E-Paper
Advertisement

నిక్కర్‌లో మూత్రం.. ప్రైవేటు పార్టుపై టీచర్ వాతలు, వారణాసిలో షాకింగ్ ఘటన

నిక్కర్‌లో మూత్రం.. ప్రైవేటు పార్టుపై టీచర్ వాతలు, వారణాసిలో షాకింగ్ ఘటన
Advertisement

Varanasi: యూపీలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నర్సరీ చదువుతున్న బాలుడు నిక్కర్‌లో మూత్రం పోశాడు. దీంతో కోపానికి గురైన ఉపాధ్యాయురాలు, బాలుడి మర్మాంగంపై వాతలు పెట్టింది. నాలుగైదు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

వారణాసిలో షాకింగ్ ఘటన- వారణాసిలోని పాండేపూర్ ప్రాంతంలోని షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో కేసరి కుమార్ అనే వ్యక్తి తన కొడుకును ప్లే స్కూల్‌లో చేర్పించాడు. తాను యూరిన్‌కు వస్తోందని బాత్‌రూంకు వెళ్తానని టీచర్‌ని కోరాడు. అందుకు సదరు టీచర్ ప్రీతి కుష్వాహాగా  అనుమతి నిరాకరించింది. దీంతో ఆ బాలుడు తన ప్యాంటులో మూత్ర విసర్జన చేశాడు.

Advertisement

నిక్కర్‌లో మూత్రం పోసిన బాలుడు-ఈ ఘటనతో ఉపాధ్యాయురాలికి కోపం రెట్టింపు అయ్యింది. దీంతో ఉపాధ్యాయురాలు ఆ బాలుడిని మరొక గదిలోకి తీసుకెళ్లింది. బాలుడ్ని కొట్టి, కత్తిని వేడి చేసి బాలుడి ప్రైవేటు పార్ట్స్‌పై వాతలు పెట్టింది. మళ్లీ ఇలాంటి తప్పు చేయవద్దని బాలుడ్ని హెచ్చరించింది. బాలుడు ఇంటికి వచ్చిన నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు.

ప్రైవేటు పార్టుపై టీచర్ వాతలు –  కాలిన మచ్చలు కనిపించడంతో బాలుడు తల్లి, తన భర్తకు చెప్పింది. మరుసటి రోజు తల్లిదండ్రులు ప్లే స్కూల్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదు. ఫలితం లేకపోవడంతో బాధితుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు.. ఉపాధ్యాయురాలు- స్కూల్ ప్రిన్సిపాల్, యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

Advertisement

కేసు నమోదు చేసిన పోలీసులు-వారిపై వివిధ  సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన వెలుగులోకి రాగానే సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రియాక్ట్ అయ్యారు. ఇది అత్యంత తీవ్రమైన, బాధాకరమైన, భయంకరమైన ఘటనగా తెలిపారు. ఆ చిన్నారి జీవితాంతం నిలిచిపోతుందని అన్నారు. ఉపాధ్యాయులకు పిల్లల పట్ల మానవత్వంతో వ్యవహరించాలన్నారు. తక్షణమే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ALSO READ: విజయ్ ప్రభుత్వానికి ఊహించని షాక్.. ఆ జీవోలను రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×