E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode July 25th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ : పారిజాతం, జ్యోత్స్నలను ఇరికించిన సూరజ్‌   

Karthika Deepam 2 Serial Today Episode July 25th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ : పారిజాతం, జ్యోత్స్నలను ఇరికించిన సూరజ్‌   
Advertisement

Karthika Deepam 2 serial today Episode: తనను కలిసిన జ్యోత్స్నతో నువ్వు ఏం అడిగినా ఇస్తానని మాలిని చెప్పగానే.. ఆస్థి కూడా ఇచ్చేట్టు ఉన్నావు అంటూ పారిజాతం అంటే జ్యోత్స్నను ఊ అనమను నా ఆస్థిలో సగం వాటా ఇస్తాను అంటూ మాలిని చెప్పగానే.. పారిజాతం షాక్‌ అవుతుంది. జ్యోత్స్న మాత్రం కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. పారిజాతం వెల్లబోతుంటే.. మాలిని ఉంగరం కింద పడిపోయి ఉంటుంది. అది చూసి వంగి తీసుకోబోతూ.. పారిజాతం మెడకు ఉన్న పట్టీ ఊడిపోతుంది. రింగ్‌ తీసుకున్న పారిజాతం.. మాలిని నీ ఉంగరం  నా మెడనొప్పి తగ్గించేసింది తీసుకో అంటూ ఇవ్వబోతుంటే… వద్దు నువ్వే తీసుకో అని చెప్తుంది మాలిని.. చాలా విలువైనది అనుకుంటాను అంటూ పారు అడిగితే అవును కానీ అడగ్గానే.. నా మేనకోడలును నా ఇంటికి తీసుకొచ్చావు కదా..? అంతకంటే విలువైనదేమీ కాదు అంటూ మాలిని చెప్తుంది. నేను ఇలాంటి వాటికి ఆశపడి తీసుకురాలే.. పాత పరిచయం గుర్తుకు వచ్చి తీసుకొచ్చాను అని చెప్తుంది. అయితే మన పరిచయం ఇలాగే ఉంచుకో పారిజాతం అని చెప్తుంది మాలిని. సరే అయితే వెళ్తాను అంటూ పారు వెళ్లగానే.. నీతో ఆడుకోవడానికి నాకో అవకాశం దొరికింది శివనారాయణ అని మాలిని మనసులో అనుకుంటుంది.

కాంచన భోజనం చేస్తుంటే.. పొలమారుతుంది. వెంటనే శివనారాయణ చెప్పిన శ్రీధర్‌ వస్తున్నాడన్న మాటలు గుర్తు చేసుకుంటూ.. తినబోతుంటే.. శ్రీధర్‌ వచ్చి గుమ్మం దగ్గర నిలబడి భోజనం నీకేనా..? నాకు లేదా అంటాడు. శ్రీధర్‌ను చూసి సంతోషంగా కాంచన లేచి వెళ్లబోతూ కిందపడిపోతుంది. శ్రీధర్‌ పరుగెత్తుకుంటూ వచ్చి కాంచన నన్ను చూసి నిన్ను నువ్వు మర్చిపోయావంటే నాకోసం ఎంతలా ఎదురుచూస్తున్నావో అర్థం అవుతుంది అంటాడు. అందుకు కాంచన ఇప్పుడు మీకు ఎలా ఉంది. డాక్టర్‌ ఏమన్నారు..? అంటూ అడుగుతుంటే.. ముందు నాకు భోజనం పెట్టు అంటూ చెప్పగానే.. కాంచన ప్లేట్‌ ఇస్తే.. వద్దు నువ్వు ముద్దలు కలిపి పెడితే తినాలని ఉంది అని చెప్తాడు. ఆ మాటలకు కాంచన ఎమోషనల్‌ అవుతుంది. శ్రీధర్‌ కూడా తన ఆపరేషన్‌ గురించి చెబుతూ ఎమోషనల్ అవుతాడు. ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు.

Advertisement

జ్యోత్స్న ఆఫీసుకు లేటుగా వెళ్తుంది. దీప, కార్తీక్‌, సూరజ్‌ ముగ్గురు రిసెప్షన్‌లో ఎదురుచూస్తుంటారు. వాళ్లను చూసి జ్యో షాక్‌ అవుతుంది. మీరేంటి ఇక్కడ ఉన్నారు…? అని అడిగితే నువ్వేంటి ఎక్కడికి వెళ్లావు..? అని ముగ్గురు అడగ్గానే.. ఒకరి సమాధానం చెప్పడమే కష్టం అంటే ముగ్గురు చేరి అడుగుతున్నారు అని మనసులో ఆలోచిస్తుంటే.. కార్తీక్‌ ఏంటి చిన్న మరదలా ఏదో సాకు చెప్పాలని ఆలోచిస్తున్నావా..? ఇంట్లో పారు మిస్‌ అయింది. ఇక్కడ నుంచి నువ్వు మిస్‌ అయ్యావు.. ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్లారు కదా..? అనగానే.. జ్యో షాక్‌ అవుతుంది. వెంటనే మాట మారుస్తుంది. తలనొప్పిగా ఉంటే ట్యాబ్లెట్‌ కోసం వెళ్లాను అని చెప్తుంది. సూరజ్‌ ట్యాబ్లెట్‌ ఎక్కడ తీసుకున్నావు.. ఏ షాపులో తీసుకున్నావు ఆ షాపు పేరేంటి..? అని అడిగితే జ్యో కోపంగా సూరజ్‌ను తిడుతుంది. కానీ కార్తీక్‌ మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్లావో తాతయ్యకు తెలిసింది. నువ్వు రాగానే తాతయ్య నిన్ను తీసుకురమ్మన్నారు అని చెప్పగానే.. జ్యో షాక్‌ అవుతుంది.

కట్‌ చేస్తే అందరూ ఇంట్లో ఉంటారు. అప్పుడే పారిజాతం మెడపట్టి చేతితో తిప్పుతూ.. ఇంట్లోకి వస్తుంది. అందరూ ఉండటం చూసి షాక్‌ అవుతుంది. అందరూ ఇక్కడ ఉన్నారేంటి..? అనుకుంటూ లోపలికి వెళ్లగానే.. శివనారాయణ కోపంగ పారిజాతం మీరు ఎక్కడికి వెళ్లారో తెలిసిపోయింది. జ్యోత్స్న చెప్పిందే నువ్వు చెప్తావా..? లేదా అని చూస్తున్నాము అంటూ చెప్పగానే.. పారు కోపంగా జ్యోత్స్నను తిట్టుకుంటూ ఇది ఎవ్వరికీ చెప్పోద్దని చెప్పినా వినకుండా చెప్పిందేమో..? ఇప్పుడు ఎలా చెప్పాలి నిజం చెబితే ఒక బాధ.. చెప్పకపోతే ఒక బాధ అంటూ బాధపడుతూ.. నిజం చెప్పబోతుంటే.. జ్యోత్స్న సైగ చేస్తుంది. వెంటనే పారు మాట మారుస్తుంది. తాను హాస్పిటల్‌కు వెళ్లానని చెప్తుంది. జ్యోను తీసుకుని వెళ్లావా అని అడగ్గానే.. లేదు అది ఎక్కడికి వెళ్లిందో తనకు తెలియదని చెప్తుంటే.. మాలిని దగ్గర తీసుకుని వచ్చిన ఉంగరం కింద పడిపోతుంది. ఉంగరం చూసి శివనారాయణ అనుమానిస్తే.. సూరజ్‌ చూసి అది మాలినిది అని గుర్తు చేసుకుంటాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×