E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode July 22nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ ను అనుమానించిన శివనారాయణ 

Karthika Deepam 2 Serial Today Episode July 22nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ ను అనుమానించిన శివనారాయణ 
Advertisement

Karthika Deepam 2 serial today Episode: ఇంటికి వచ్చిన దీపను కాంచన మెచ్చుకుంటుంది. దక్షిణమూర్తి, మాలినిని ఓడించినందుకు కంగ్రాట్స్‌ చెప్తుంది. దీపకు దిష్టి తీయాలని.. అంటుంది. అయితే పారు దిష్టే ఎక్కువగా తగిలి ఉంటుందని చెప్తాడు కార్తీక్.. మాటల్లో పారు పురిట్లోనే బిడ్డను మార్చింది అనబోయి ఆగిపోతాడు. కాంచన అనుమానంగా ఏంటో చెప్పబోయావు అంటూ అడిగితే.. ఏం లేదమ్మా.. జ్యోత్న్సను పురిట్లోంచి తన అలవాట్లు వచ్చేలా పెంచింది అంటూ కార్తీక్‌ మాట మారిస్తే.. కాంచన కూడా ఈ విషయం అయితే నిజమేరా..? అంటుంది. ఈలోపు శౌర్య రాగానే.. అందరూ కలిసి భోజనం చేయడానికి వెళ్తారు.

సూరజ్‌ రూంలోకి వెళ్లిన సుమిత్ర.. అనుమానంగా చూస్తూ.. జ్యోత్స్న విషయంలో నువ్వెందుకు అంత రియాక్ట్‌ అయ్యావు అంటూ అడగ్గానే.. అందరి విషయంలో నేను ఎలా రియాక్ట్ అవుతానో జ్యోత్స్న విషయంలో కూడా అలాగే రియాక్ట్‌ అయ్యాను సారీ మేడం అంటూ సూరజ్‌ చెబితే.. కూతురుకు సాయం చేసిన వ్యక్తి నుంచి ఏ తల్లి సారీ అడగదు సూరజ్‌ అంటుంది సుమిత్ర. మామూలుగా అయితే నేనే నీకు థాంక్స్‌ చెప్పాలి. మనం ఎంత బలవంతులం అయినా కొన్ని సార్లు మన బలం మనమే మర్చిపోతాం దాన్ని గుర్తు చేయడానికి సాయంగా నిలబడే స్నేహితుడు ఎప్పుడు గొప్పవాడే ఈరోజు జ్యోత్స్న పోటీలో నిలబడింది అంటే అందుకు కారణం నువ్వే.. మీ వాళ్లు నీకు మంచి సంస్కారం నేర్పించారు. ఇంతకీ మీ అమ్మానాన్న ఎవరు..? ఎక్కడుంటారు..? ఏం చేస్తుంటారు.. అంటూ సూరజ్‌ డీటెయిల్స్‌ అడుగుతుంది సుమిత్ర. సూరజ్‌ మౌనంగా ఉంటే… చెప్పు సూరజ్‌ మీ ఫ్యామిలీ గురించి అంటూ అడగ్గానే.. సూరజ్‌ ఏదో చెప్పబోతుంటే.. బయటి నుంచి పారిజాతం పిలుస్తుంది. తర్వాత ఎప్పుడైనా మీ ఫ్యామిలీ గురించి తెలుసుకుంటాను అంటూ సుమిత్ర అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement

దీప ఇంటికి మాలిని వెళ్తుంది. మాలినిని చూసిన దీప షాక్ అవుతుంది. ఇంట్లో పూజ చేస్తున్న కాంచన, తిరిగి మాలినిని చూసి కోపంతో రగిలిపోతుంది. మాలిని మాత్రం ఎలా ఉన్నావు కాంచన అని అడుగుతుంది. కాంచన కోపంగా నా ఇంటికి ఎందుకు వచ్చావు.. అని అడుగుతుంది. నువ్వు ఎలా ఉన్నావో పలకరించి వెళ్దామని వచ్చాను అంటుంది. కాంచన కోపంగా దీప ముందు ఆ మనిషిని బయటకు వెళ్లమని చెప్పు.. ముఖం చూడటానికి కూడా ఇబ్బందిగా ఉంది  అంటుంది.  దీంతో మాలిని ఇంటికి వచ్చిన అతిథిని ఇలాగేనా చూసేది.. ఓ శివనారాయణ కూతురువి కదా..? ఆ పోలికలు ఎక్కడికి పోతాయి అంటూ వెటకారంగా మాట్లాడితే నా తండ్రి పేరు పలకడానికి కూడా అర్హత లేనిదానివి అంటూ కాంచన తిడుతుంది.

ఎందుకు అర్హత లేదు.. నీకు అన్యాయం చేసి ఆస్థి ఇవ్వనందుకు మహానుభావుడా అంటూ మాలిని చెప్పగానే.. కార్తీక్‌ వచ్చి  మాలినిని తిడతాడు. మా తాత గురించి మాట్లాడొద్దు అంటూ వార్నింగ్‌ ఇస్తుంటే.. కాంచన కోపంగా నువ్వు ఆగరా ఈ మనిషితో మాట్లాడుతుంటే.. మనకు తెలియకుండానే మనం ఒక మెట్టు దిగిపోతాము అనగానే.. ఒక మెట్టు దిగడం కాదు.. మీ నాన్న ఎందుకు నీ కోడలిని వంటమనిషిగా చేసుకున్నాడు.. నీ కొడుకును డ్రైవర్‌గా పెట్టుకున్నాడు అంటూ రెచ్చగొడుతుంది. దీప కల్పించుకుని మాలినిని తిడుతుంది. మాలిని మాత్రం మీరు నాతో కలిసిపోయారంటే మీ జీవితాలు మారిపోతాయి.. మీ గురించి కాకపోయినా మీ పిల్లల గురించి పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించుకోండి అంటూ ఆఫర్‌ ఇచ్చి వెళ్లిపోతుంది మాలిని.

Advertisement

శివనారాయణ కోపంగా సూరజ్‌కు కాల్‌ చేసి నువ్వు ఎక్కడున్నావు.. అని అడిగితే మార్కెట్‌ రోడ్డులో ఉన్నానని చెబితే నువ్వు అక్కడే ఉండు ఎక్కడికి వెల్లొద్దు నేను వస్తున్నాను.. అని చెబితే.. నేను స్కూటీ మీద వచ్చాను సార్‌ అని సూరజ్‌ చెప్పగానే.. స్కూటీ డ్రైవర్‌ తీసుకెళ్తాడులే నువ్వు మాత్రం అక్కడే ఉండు అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు. సూరజ్‌ అనుమానంగా చైర్మన్‌ గారికి ఏమైంది అనుకుంటాడు.

శివనారాయణ, కాంచన ఇంటికి వెళ్లి కార్తీక్‌ను పిలిచి మాలిని ఇచ్చిన ఫ్రూట్స్‌, చెక్స్‌ రెండు తీసుకోమని చెప్పి తనతో పాటు కార్తీక్‌, సూరజ్‌ను తీసుకుని దక్షిణమూర్తి ఇంటికి వెళ్తాడు. సూరజ వెంటనే ఈ ఇంటికి తీసుకొచ్చారేంటి..? అని అడగ్గానే.. శివనారాయణ ఈ ఇల్లు నీకు తెలుసా అని అడుగుతాడు. కార్తీక్ కూడా తాత నాకు చెప్పాడు కానీ సూరజ్‌కు చెప్పలేదు కదా..? అని మనసులో అనుకుంటాడు. శివనారాయణ కోపంగా నిన్నే అడిగేది ఈ ఇల్లు నీకు తెలుసా..? అని అడగ్గానే.. తెలియదు సార్‌ నేను పూర్తిగా అడగక ముందే మీరు ఆపేసారు ఈ ఇంటికి తీసుకొచ్చారేంటి ఇదేమైనా మీ బంధువుల ఇల్లా అని అడగబోతున్నాను సార్‌ అనగానే..  బంధువులు కాదు నా శత్రువు దక్షిణమూర్తి ఇల్లు అంటూ శివనారాయణ చెప్పగానే.. కార్తీక్‌, సూరజ్‌ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×