E-Paper
Advertisement

భార్య-పిల్లల నోటికి ప్లాస్టర్‌ అంటించి, ఆ తర్వాత వ్యాపార‌వేత్త ఆత్మహత్య, వెలుగులోకి షాకింగ్ నిజాలు

భార్య-పిల్లల నోటికి ప్లాస్టర్‌ అంటించి, ఆ తర్వాత వ్యాపార‌వేత్త ఆత్మహత్య, వెలుగులోకి షాకింగ్ నిజాలు
Advertisement

Businessman Family Suicide: కారణాలు ఏంటో తెలీదు. కానీ ఓ వ్యాపారవేత్త.. తన భార్య, ఇద్దరు పిల్లలను చంపేశాడు. ఆ తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు ముందు ఆయన రాసిన లేఖలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఘటనకు ముందు ఏం జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

మైసూర్‌లో వ్యాపారవేత్త ఫ్యామిలీ ఆత్మహత్య-కర్ణాటకలోని మైసూరులో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 49 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారి హరీష్, తన భార్య నిషిత, ఇద్దరు కుమార్తెలను చంపేశాడు. ఆ తర్వాత ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఈ ఘటన జరిగింది. హుణసూరు పట్టణం న్యూ మారుతి లేఅవుట్లో ఈ ఘటన బయటపడింది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌లో లభించింది. అందులో ఆస్తి, అప్పులకు సంబంధించిన విషయాలు ఉన్నాయి.

Advertisement

భార్య-ఇద్దరు పిల్లలను చంపి, లాకర్‌లో భద్రపరిచిన ఆస్తి పత్రాల వివరాలు, తాళాలున్న ప్రదేశం, ఆ పత్రాలను ఒక నిర్దేశిత వ్యక్తికి అప్పగించాలనే అభ్యర్థన కూడా అందులో ఉంది. ఘటన జరిగిన ప్రాంతాల్లో లభించిన ఆనవాళ్ల మేరకు.. తొలుత భార్య-ఇద్దరు పిల్లల నోటికి ప్లాస్టర్‌ అంటించి గొంతు నులిమి హత్య చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు మూడు రోజుల ముందు తన తల్లిని తన అమ్మమ్మ ఊరికి పంపించాడు హరీశ్‌.

హరీష్ సూసైడ్ ఎలా వెలుగులోకి వచ్చింది?  మంగళవారం ఉదయం ఎవరూ తలుపు తీయకపోవడంతో పొరుగువారికి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి హరీష్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లి చూశారు. ఇంట్లో నలుగురి మృతదేహాలు కనిపించాయి. ఏ విధంగా చంపేశారు అనేదానిపై పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా తెలుస్తుందని చెబుతున్నారు పోలీసులు. హరీష్ తల్లి మాత్రం మాకు అప్పుల గురించి తెలియజేశాడని పేర్కొన్నారు. ఈ ఘటనకు ఆర్థిక సమస్యలు కారణమా? మరేదైనా కారణమా? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు మైసూర్ ఎస్పీ తెలిపారు.

Advertisement

ALSO READ: ప్రధాని మోదీ ఇంటి వద్ద హై టెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!

దర్యాప్తులో తేలిన అంశాలేంటి? హరీష్ వ్యాపారాలు నడపడంతోపాటు, రియల్ ఎస్టేట్ రంగంలో ఆస్తులు కలిగి ఉన్నాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఆయనకు చెందిన రెండు ఆస్తులను ఇటీవల బ్యాంకులు జప్తు చేశాయని గుర్తించారు. మృతుడు బాగా ధనవంతుడని, ఆస్తులున్నప్పటికీ ఎందుకు ఈ విధంగా చేశాడనే దానిపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు అధికారులు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×