E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode July 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ ను ఇరికించాలని తానే బుక్కైన పారిజాతం   

Karthika Deepam 2 Serial Today Episode July 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ ను ఇరికించాలని తానే బుక్కైన పారిజాతం   
Advertisement

Karthika Deepam 2 serial today Episode: కారులో వెళ్లిన జ్యోత్స్నకు బాగానే ఉంటుంది. కానీ పారిజాతం మెడలు పట్టేస్తాయి. డాక్టర్‌ వచ్చి ట్రీట్‌మెంట్ చేసి వెళ్లిపోతుంది. శివనారాయణ అంతా చూస్తూ.. నీకు యాక్సిడెంట్‌ అయింది మెడలు పట్టేశాయి కానీ ముఖానికి ఏంటి ఆ నల్లటి మచ్చలు అని అడగ్గానే.. కార్తీక్‌ నేను చెప్తాను సార్‌ అవి యాటిట్యూడ్‌ కోసం పెట్టుకున్న మచ్చలు అంటూ అసలు కారుకు బ్రేకులు ఎందుకు ఫెయిల్‌ అయ్యాయి.. అన్ని కార్లకు సర్వీసింగ్‌ చేయించేది నేనే కదా..? అందుకే నాకెందుకు అనుమానంగా ఉంది అంటాడు. ఆ మాటలకు పారిజాతం షాక్‌ అవుతుంది. కారు అన్న తర్వాత బ్రేకులు ఫెయిల్‌ కాకుండా ఉంటాయా..? అనగానే.. శివనారాయణ అనుమానంగా అయితే బ్రేక్స్‌ ఎవరో తీసేసి ఉంటారని అంటున్నావా..? అనగానే.. కార్తీక్‌ అవునని సూరజ్‌ను చంపేయడానికి కారు బ్రేకులు తీసేసి మర్డర్‌ ప్లాన్‌ చేశారేమో అనిపిస్తుంది అనగానే.. పారు, జ్యో షాక్‌ అవుతారు.

నువ్వు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరాల్సింది.. అయినా సూరజ్‌ ఇప్పుడు పరాయివాడు కదా కదా..? మన వాడే కదా..? అంటుంది. శివనారాయణ ఇక పోటీకి టైం అవుతుంది అందరూ రెడీ అవ్వండి వెళ్దాం అంటూ చెప్పి వెళ్లిపోతాడు. అందరూ రెడీ అవ్వడానికి వెళ్లిపోతారు. కార్తీక్‌ మాత్రం పారిజాతాన్ని ఆగమని గార్డెన్‌లో తనకు రెంచీ కనబడిందని అది ఎవరిది అని అడుగుతాడు. పారిజాతం కోపంగా పోయి దాన్ని అడగరా.. అంటూ తిడుతూ జ్యోను తీసుకుని వెళ్లిపోతుంది. మీరు ఎన్ని వేషాలు వేసినా బ్రదర్‌ ఇక్కడి నుంచి పోడులే.. ముందు ఈరోజు కాంపిటీషన్‌లో దీప గెలవనీ ఆ తర్వాత చెప్తాను అనుకుంటాడు.

Advertisement

వంటల పోటీ జరుగుతున్న ప్లేస్‌కు శివనారాయణ, కార్తీక్‌, దీప, సుమిత్ర, జ్యోత్స్న, పారు వెళ్తారు. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని అడుగుతాడు శివనారాయణ బాగానే జరుగుతున్నాయని నిర్వాహకులు చెప్తారు. అప్పుడే దక్షిణమూర్తి, మాలిని వస్తారు. దీంతో వాళ్ల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. ఒకరినొకరు పోటీ పడేలా మాట్లాడుకుంటారు. మాలిని, సుమిత్ర కూడా ఒకరినొకరు పోటీ పడి మరీ మాట్లాడుకుంటారు. సుమిత్ర కోపంగా కుటుంబాలను విడదీశారు. ఇప్పుడు మనుసులను విడదీస్తున్నారా..? అంటూ తిడుతుంటే.. నువ్వు కళ్లకు గంతలు కట్టుకుని లోకాన్ని చూడటం మానేశావమ్మ.. నీ రెండు చెవులు మూసుకుని మంచిని వినడం కూడా మానేశావు అంటూ దక్షిణమూర్తి చెబితే.. కానీ ఫోన్‌లో నువ్వు మాట్లాడిన మాటలు విన్నాను.. ఆ మాటలు మాట్లాడేటప్పుడు నువ్వు ఎలా ఉండగలుగుతావో కూడా ఊహించాను.. అనగానే..

నన్ను ఎప్పుడు తప్పుగా చూపించడమే ఈ శివనారాయణ పని అంటూ దక్షిణమూర్తి కోప్పడితే.. శివనారాయణ మీరు వచ్చింది వంటల పోటీకి మాటల పోటీకి కాదు.. అనగానే.. నవ్వెప్పుడు ఇలాగే మాట్లాడతావు శివనారాయణ అంటూ ఇద్దరు మాట్లాడుకుంటుంటే.. మాలిని కల్పించుకుని నువ్వు ఎలా నీ స్నేహితుడి మీద ఉన్న ప్రేమను చంపుకోలేవో.. అలాగే మా మామయ్యగారు కూతురు మీద ప్రేమను చంపుకోలేరు మీకు స్నేహం విలువ తెలుసు మా మామయ్య గారికి రక్తం పంచిన బంధం విలువ తెలుసు సుమిత్ర మామయ్య ఆలోచించేది నీ కోసమే అనగానే.. నా భర్త ప్రాణాలు తీయాలనుకున్నది కూడా నా కోసమే..కదా అంటూ తిడుతుంటే.. దక్షిణమూర్తి ఏడుస్తూ.. ప్రతిదానికి క్షమాపణ ఉంటుంది కదమ్మా అనగానే.. దీనికి ప్రక్షాళణ తప్ప క్షమాపణ ఉండదు అంటుంది. ఇంతలో నిర్వాహకులు వచ్చి లోపల అంతా సిద్దంగా ఉందని రమ్మని చెప్తాడు. అందరూ లోపలికి వెళ్తారు.

Advertisement

పోటీ మొదలవుతుండగా జ్యోత్స్న, పారు బయటకు వెళ్లి మాట్లాడుకుంటుంటారు. అప్పుడే సూరజ్‌ ఫోన్‌ రావడంతో బయటకు వెళ్లి మాట్లాడుతుంటాడు. మాలిని కూడా ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్తుంది. మాలిని ఫోన్‌ మాట్లాడుతూ వెళ్తూ.. తన ఉంగరం కింద పడేసుకుంటే సూరజ్‌ చూసి వెళ్లి మాలినికి ఉంగరం గురించి చెప్తుంటే.. పారు, జ్యోత్స్న చూస్తారు. వీడు బలే దొరికాడు గ్రాణి.. నువ్వు తాత దగ్గరకు వెళ్లి సూరజ్‌, మాలినితో చేయి కలుపుతున్నాడని చెప్పు వెళ్లి తాతను తీసుకురా అంటూ పంపిస్తుంది. లోపలికి వెళ్లిన పారిజాతం అందరికీ చెప్పి బయటకు తీసుకొస్తుంది. అందరూ బయటకు వచ్చి చాటు నుంచి సూరజ్‌, మాలిని మాట్లాడుకోవడం వింటారు. సూరజ్‌, మాలిని తిట్టి ఎప్పుడంటే అప్పుడు పడిపోయే బంగారానికి నేను పడిపోయే రకం కాదని చెప్పి వెళ్లిపోతాడు. సూరజ్‌ మాటలు విన్న శివనారాయణ కోపంగా పారిజాతాన్ని చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×