// // Iran Vs America: ఇరాన్-అమెరికా మధ్య భీకర దాడులు.. సైనిక స్థావరాలు ధ్వంసం, టార్గెట్ హోర్ముజ్ జలసంధి -->
E-Paper
Advertisement

ఇరాన్-అమెరికా మధ్య భీకర దాడులు.. సైనిక స్థావరాలు ధ్వంసం, టార్గెట్ హోర్ముజ్ జలసంధి

ఇరాన్-అమెరికా మధ్య భీకర దాడులు.. సైనిక స్థావరాలు ధ్వంసం, టార్గెట్ హోర్ముజ్ జలసంధి
Advertisement

Iran Vs America: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.అమెరికా వరుసగా ఐదవ రోజు ఇరాన్‌పై దాడులు చేసింది. హోర్ముజ్ జలసంధిలోని ఇరాన్ ఓడ రేవులపై విధించిన నేవీ దిగ్బంధనాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తోంది అమెరికా. ఈ క్రమంలో ఖాళీ చమురు ట్యాంకర్‌ను అమెరికా బలగాలు నిలిపి వేశాయి.

ఇరాన్-అమెరికా మధ్య భీకర దాడులు-హార్మూజ్‌ జలసంధిలో ఇరాన్‌ దాడులు తీవ్రతరం చేయడంతో అమెరికా రగిలిపోతోంది. దీనికి ప్రతీకారంగా బుధవారం ఇరాన్‌ ఓడరేవును దిగ్బంధించింది అమెరికా. ముఖ్యంగా ఇరాన్ కీలకంగా మారిన సైనిక శిబిరాలు లక్ష్యంగా ఐదో రోజు దాడులు చేసింది.దక్షిణ ఓడరేవు నగరం బందర్ అబ్బాస్‌, అహ్వాజ్, చాబహార్ సహా వివిధ ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది. ఏడుగురు సైనికులు మృతి చెందగా, 200 మందికి పైగానే గాయపడ్డారని ఇరాన్‌ అధికారులు తెలిపారు. ముఖ్యంగా హార్మూజ్‌ జలసంధిని టార్గెట్ చేసింది అమెరికా.

Advertisement

అమెరికా టార్గెట్ హోర్ముజ్ జలసంధి-అందులో కీలకంగా మారిన తున్బ్‌ ఐలాండ్‌పై దాడులు చేసింది అమెరికా. ఇరాన్‌ గతంలో యూఏఈ నుంచి అబూ మూసా, ‌ తున్బ్, లెసర్‌ తున్బ్‌ మూడు ద్వీపాలను ఆక్రమించింది. వాటిని స్వాదీనం చేసుకోవడానికి చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది యూఏఈ. ఆ మూడు దీవులను అమెరికా స్వాదీనం చేసుకుంటే హార్మూజ్‌పై పట్టు చిక్కినట్లే. జరుగుతున్న పరిణామాలు చేస్తుంటే రానున్న రోజుల్లో ఇరాన్‌పై మరిన్ని దాడులు అమెరికా చేసే అవకాశం ఉన్నాయి. మరోవైపు గల్ఫ్‌లో అమెరికా మిత్రదేశాలు బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది ఇరాన్.

ఆ మూడు దీవులపై అమెరికా ఫోకస్-ఓడరేవులపై విధించిన నావికా దిగ్బంధనాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఖాళీ చమురు ట్యాంకర్‌ను అమెరికా కూల్చివేసింది. హోర్ముజ్ జలసంధి ద్వారా ఇరాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు దాడులు కొనసాగిస్తున్నాయి. గతంలో ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించడం వల్ల అనేక నౌకలపై తీవ్ర ప్రభావం చూపింది.అమెరికా సెంట్రల్ కమాండ్-సెంట్‌కామ్  వివరాల మేరకు.. అమెరికా దళాలు ఏప్రిల్ 13 నుండి జూన్ 18 వరకు ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించాయి. ఆ సమయంలో వారు తొమ్మిది నౌకలను నిలిపి వేసి, 140కి పైగా నౌకలను దారి మళ్లించినట్టు తెలిపింది.

Advertisement

ALSO READ: పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న వైరల్ లేఖ.. ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’ నిజమేనా?

వ్యూహాత్మక జలమార్గం గుండా ప్రయాణించే నౌకలను బెదిరించడానికి ఇరాన్ ఉపయోగించే సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే  తాజా దాడుల లక్ష్యమని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. గ్రేటర్ తున్బ్ ద్వీపంపై దాడులు చేసింది అమెరికా. ఈ దాడులలో ఇరాన్ తీర రక్షణ వ్యవస్థలు, క్రూయిజ్ క్షిపణి నిల్వ, ప్రయోగ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఈ ఆపరేషన్ సుమారు 90 నిమిషాల్లో పూర్తయిందని సెంట్రల్ కమాండ్ తెలిపింది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×