E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode July 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి వార్నింగ్ ఇచ్చిన శివనారాయణ    

Karthika Deepam 2 Serial Today Episode July 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి వార్నింగ్ ఇచ్చిన శివనారాయణ    
Advertisement

Karthika Deepam 2 serial today Episode: గుడిలో ఉన్న మాలినికి దీప గురించి కార్తీక్‌ చెప్తుంటే.. ఈ విషయం మాలినికి తెలియదు అనుకున్నావా..? అంటూ శివనారాయణ వస్తాడు. తెలిస్తే వాళ్ల రెస్టారెంట్‌లో వంట మనిషిగా చేయమని ఎందుకు అడుగుతుంది అంటాడు కార్తీక్‌. తెలిసే కావాలనే అలా అడుగుతుంది అంటూ శివనారాయణ చెప్పగానే.. దీప ఈవిడ ఎవరు తాతయ్య అని అడుగుతుంది. నీకు అత్త అవుతుందమ్మా అంటూ దక్షిణమూర్తి వస్తాడు. దక్షిణమూర్తిని చూసిన దీప షాక్‌ అవుతుంది. అందరూ కోపంగా చూస్తుంటే.. మాలిని నా కోడలు, సుమిత్రకు వదిన అంటూ చెప్తుంటే.. శివనారాయణ మనుషులను పరీక్షించడానికి కొందరు కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారమ్మా మనం ఇలాంటి వాళ్లకు దూరంగా ఉండాలి అంటూ చెప్తుంటే.. కొన్ని ఎంత చేసిన దూరం కావు బాబాయ్‌ అంటుంది మాలిని..

తెలిసి కూడా ఎందుకు మాట్లాడుతున్నావు.. విలువ గురించి నాకే నేర్పిస్తున్నారా..? అంటూ శివనారాయణ చెప్తుంటే.. సొంత కూతురుని బయటకు గెంటేసినప్పుడు మీ విలువ ఏమైంది..? ఆస్థి పంచాల్సిన మనవడని నడిరోడ్డు మీద వదిలేసినప్పుడు మీ విలువ ఏమైంది అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో ఇద్దరి మధ్య మాటలయుద్దం జరుగుతుంది. ఒకరినొకరు తిట్టుకుంటుంటే.. కార్తీక్‌ అడ్డుపడతాడు. ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు.. కలిసి సంతోషంగా లేనప్పుడు విడిపోవడమే మంచిది. అది భార్యాభర్తలు అయినా కుటుంబాలు అయినా మీ వ్యాపారాలు మీరు చేసుకోండి మా వ్యాపారాలు మేము చేసుకుంటాము అంటూ చెప్తుంటే..

Advertisement

చేసిన పాపాలు ఊరికే పోవు కదరా.. అంటూ దక్షిణమూర్తి నిజం చెప్పబోతుంటే.. మాలిని ఆపేస్తుంది. గుడిలో ఇవ్వన్నీ ఎందుకు అంటూ ఆపేస్తుంది. ఇక్కడ అందరినీ నేను గుర్తుపట్టాను కానీ ఈ అబ్బాయి ఎవరు అంటూ సూరజ్‌ గురించి అడిగితే తనకు మాకు రక్తసంబంధం లేదు కానీ మా ఫ్యామిలీలో వ్యక్తి లాంటి వాడు.. పైగా మా జ్యోత్స్నను కాపాడాడు అంటూ చెప్పగానే.. అయితే మీ కుటుంబంలో వ్యక్తిని కాపాడిన వ్యక్తికి ఫ్యామిలీలో చోటు ఇచ్చారు. మా మామయ్యను కాపాడిన దీపతో మేము మాట్లాడితే మరెందుకు పెడర్థాలు తీస్తున్నారు.. అంటూ మాలిని ప్రశ్నిస్తే.. సుమిత్ర కోపంగా మాలిని తిడుతూ అందరినీ తీసుకుని వెళ్లిపోతుంది.

శౌర్యను స్కూల్‌కు పంపించడానికి కాంచన రెడీ చేస్తుంది. ఇవాళ తాతయ్య వస్తున్నారు కదా స్కూల్‌కు ఎందుకు వెళ్లడం అని అడుగుతుంది శౌర్య. దీంతో  కాంచన ఎందుకు ఎదురెళ్లి నువ్వు హారతి పడతావా..? అంటూ తిడుతూ రెడీ చేస్తుంది. ఇంతలో డోర్‌ బెల్‌ మోగగానే శ్రీధరే వచ్చాడేమోనని శౌర్య వెళ్లి డోర్‌ తీస్తుంది. ఎదురుగా చీర కట్టుకున్న వ్యక్తి కనిపిస్తే.. తాతయ్యేంటి చీర కట్టుకుని వచ్చాడు అనుకుంటూ ముఖం చూసి నాన్నమ్మ నువ్వొచ్చావా..? అంటూ నవ్వుతూ పిలుస్తుంది. ఇంట్లోకి వచ్చిన శౌర్య వాళ్ల నాన్నకు శౌర్యకు జంతికలు ఇచ్చి స్కూల్ కు పంపిస్తుంది.

Advertisement

గుడిలో ఉన్న దీప మాలిని గురించి వాళ్ల ఫ్యామిలీ గురించి అడుగుతుంది. దీంతో కార్తీక్‌ కోపంగా నువ్వు కొత్తగా తలనొప్పి తెచ్చుకోవద్దు. వాళ్లు తాతయ్యకు నచ్చలేదు.. అంతే ఇక మనం కూడా పట్టించుకోవద్దు అంటూ చెప్తుండగానే.. సూరజ్‌ వస్తాడు. ఇద్దరినీ తీసుకుని వెళ్లిపోతాడు. గుడిలో మాలిని చేయిస్తున్న అన్నదానం చూసి జ్యోత్స్న అక్కడ నీ పేరు మీదే అన్నదానం జరుగుతుంది మమ్మీ అని చెబితే శివనారాయణ కోపంగా జ్యోత్స్నను తిడతాడు. అందరినీ తీసుకుని ఇంటికి వెళ్లిపోతాడు.

సూరజ్‌ ఆఫీసుకు స్కూటీ మీద జ్యోత్స్న ను తీసుకుని వెళ్తుంటాడు. జ్యోత్స్న సైలెంట్‌గా ఉంటే.. ఏంటీ బేబీ సైలెంట్‌గా కూర్చున్నావు ఏం ఆలోచిస్తున్నావు అని సూరజ్‌ అడిగితే ఇదివరకు నాకు డ్రైవర్‌గా మా బావ ఉన్నాడు.. ఇప్పుడు నువ్వు ఉన్నావు అంటూ జ్యోత్స్న చెబితే నన్ను కూడా బావే అనుకోవచ్చు కదా..? అంటాడు సూరజ్‌. దీంతో జ్యోత్స్న కోపంగా సూరజ్ ను తిట్టి స్కూటీ దిగి ఆఫీసుకు ఆటోలో వస్తానని చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×