E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today February 25th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఇంట్లో వాళ్లను నిజం చెప్పబోయిన దశరథ   

Karthika Deepam 2 Serial Today February 25th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఇంట్లో వాళ్లను నిజం చెప్పబోయిన దశరథ   
Advertisement

Karthika Deepam 2  serial today Episode:   

జ్యోత్స్న కోపంగా దశరథ దగ్గరకు వెళ్లి నీ కూతురు కాంచన అత్తకి కోడలు ఎప్పుడైందని నిలదీస్తుంది. అమ్మా నాన్న చచ్చిన ఈ అనాథ ఈ ఇంటికి కోడలు అయిందని దీపని తిడుతుంది. దీంతో దశరథ కోపంగా దీప అనాథ కాదని దీపకు అమ్మానాన్నలు ఉన్నారని చెప్తాడు. దీంతో జ్యోత్స్న ఇరిటేటింగ్‌గా కోపంగా చూస్తూ.. దీప అమ్మనాన్నలు ఎక్కడున్నారని ప్రశ్నిస్తుంది. ఇంతలో అక్కడికి కార్తీక్‌ వచ్చి ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను.. కానీ సమాధానం చెప్తే నువ్వు తట్టుకోలేవు అంటాడు కార్తీక్‌.. అవునా ముందు నువ్వు చెప్పు తట్టుకోగలనో లేదో తెలుస్తుంది కదా అంటుంది జ్యోత్స్న. అప్పుడు కార్తీక్‌ తమ పెళ్లి మీ ఇంట్లోనే అయింది. నాకు కాళ్లు కడిగి కన్యాదానం చేసింది మీ నాన్నే కదా అప్పుడు వాళ్లే కదా దీపకు అమ్మానాన్న అని చెప్తాడు. జ్యోత్స్న షాక్‌ అవుతుంది.

మరోవైపు  స్వప్న తన ఆగిపోయిన చదువును మళ్లీ కంటిన్యూ చేస్తానని కాశీతో చెప్తుంది.  అయితే అక్కడే ఉన్న కావేరీ ఆగిపోయిన చదువునే మళ్లీ మొదలుపెట్టావు.. మరి సంసారాన్ని కూడా చక్కదిద్దుకోవచ్చు కదా అంటూ కోప్పడుతుంది. అయితే తాను చదువుకుని బిజినెస్‌ పెట్టి పది మందికి ఉపాధి కల్పిస్తానని అంటుంది స్వప్న. అయితే బిజినెస నడపాలంటే ఎంతో ఓపిక ఉండాలని అందులో సగం ఉన్నా నీ కాపురాన్ని సరిదిద్దుకోవచ్చని చెప్తాడు శ్రీధర్‌. కానీ సంపారం కంటే సన్యాసమే బెటర్‌ అని కాశీకి చెప్తుంది స్వప్న.

Advertisement

మరోవైపు దీప తల్లిదండ్రుల గురించి జోత్స్న అడిగిన ప్రశ్నలకు వారిని ఈరోజు తీసుకురాకపోవచ్చని అయితే ఏదో ఒక రోజు వాళ్లను తీసుకొస్తానని దశరథ చెప్తాడు. అయితే దీపను పెంచిన తల్లింద్రండ్రులు ఎవరో తెలిస్తే దీప కన్నవాళ్లు ఎవరో తెలిసేదని జ్యోత్స్న అడగ్గానే.. కానీ వాళ్లెవరో కూడా తన తమ్ముడికి తెలియదని చెప్తుంది అనసూయ.

కాంచన వాళ్ల అన్నయ్య ఏదో కొత్తగా కనిపిస్తున్నాడని చెప్పగానే.. గుడి నుంచి వచ్చిన తర్వాతే వాడిలో ఏదో మార్పు కనిపిస్తుందంటాడు శివనారాయణ. దశరథను చూసిన దీప ఆయన ఇంట్లో వాళ్లకు  నిజం చెప్పేసేలా ఉన్నాడని భయపడుతుంది.  దశరథ మాత్రం కుబేరను పొగుడుతుంటాడు. కుబేర తన కూతురికి జీవితాన్ని ఇచ్చాడని అలాంటి వ్యక్తికి నేను చేతులెల్లి మొక్కడం తప్ప ఏం చేయలేను అంటాడు. ఇంతలో కార్తీక్‌ వచ్చి దశరథను ఆపేస్తాడు. నిజం చెప్పకుండా దాటవేస్తాడు. దీంతో దశరథ బాధపడతాడు. గొప్పింట్లో పెరగాల్సిన నా బిడ్డ పేదరికంలో మగ్గిపోయింది దీనికి కారణం నేనే. ఆరోజు కళ్యాణి బిడ్డ పురిట్లోనే చనిపోయింది అన్నప్పుడు పుట్టిన బిడ్డ ఏది అని పిన్నిని అడిగి ఉంటే ఈ నిజం ఆరోజే తెలిసేది. కానీ నేను బిడ్డ గురించి కలలు కంటూ చేతులు కట్టుకుని ఉండిపోయాను అని బాధపతాడు దశరథ. అప్పుడు జరిగిన తప్పుకి ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదని అంటాడు కార్తీక్ నచ్చజెప్తాడు.

Advertisement

కుబేర బతికి ఉన్నంత వరకు దీపని చాలా గొప్పగా చూసుకున్నాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత భర్త మోసం చేశాడు.. అత్తగారి మోసం చేసింది. చేసిన అప్పులు కట్టడానికి ఆరేళ్ల కూతురిని వదిలేసి రోడ్డునపడి నరకయాతన అనుభవించింది. పేదవాడైన కుబేర నా కూతురిని మహారాణిలా చూసుకున్నాడు. అలాంటిది నేను ఎలా చూసుకోవాలని ప్రశ్నిస్తాడు దశరథ.  ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×