E-Paper
Advertisement

OTT: ఓటీటీ ప్రియులకు షాక్..బ్లాక్ లిస్ట్ లోకి 5 ఫ్లాట్ ఫారమ్స్.. అసలేమైందంటే?

OTT: ఓటీటీ ప్రియులకు షాక్..బ్లాక్ లిస్ట్ లోకి 5 ఫ్లాట్ ఫారమ్స్.. అసలేమైందంటే?
Advertisement

OTT: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారమ్స్ ప్రేక్షకుడికి మంచి వినోదాన్ని పంచుతున్న విషయం తెలిసిందే. జానర్ తో, భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుడికి కావలసిన ప్రతి జానర్ ను ఎంటర్టైన్మెంట్ రూపంలో అందిస్తోంది. అందుకే అటు థియేటర్లకు వెళ్ళలేని చాలామంది ఈ ఓటీటీలలోనే సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాను థియేటర్లలో చూసిన ఆడియన్స్ కూడా మళ్లీ ఓటీటీ లపై ఆసక్తి కనబరుస్తున్నారు అంటే ఈ ఓటీటీలకు డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.. అలాంటి ఈ సమయంలో ఓటీటీ లవర్స్ కి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది.. ఏకంగా ఐదు ఓటీటీ ప్లాట్ ఫారం లను బ్లాక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

బ్లాక్ లిస్ట్ లోకి 5 ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్..

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ..Jugnoo, Koyal PlayPro, MoodXVIP, Digi MoviePlex, Feel అని ఐదు ఓటీటీ ఫ్లాట్ ఫారం లను బ్లాక్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందని అధికారులు స్పష్టం చేశారు. అశ్లీల , అభ్యంతరకరమైన కంటెంట్ ను ప్రచారం చేస్తున్నందుకే కేంద్ర ప్రభుత్వం ఇలా ఈ ఐదు ఓటీటీ ప్లాట్ ఫారం లను బ్లాక్ చేసింది. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ప్రకారం అశ్లీల , నిరోధక చట్టాల ప్రకారం ఓటీటీ ప్లాట్ ఫారంలను బ్లాక్ చేయాలని ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది.

Advertisement

ALSO READ:Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు టాలీవుడ్ హీరోలతో విభేదాలా? ఇదెక్కడి విడ్డూరం!

జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యం..

ముఖ్యంగా నియమాలు అనేవి ప్రజా మర్యాదను కాపాడడం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడం, డిజిటల్ ప్లాట్ ఫామ్ లపై నైతిక పాత్రికేయ పద్ధతులను అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇక వివిధ కారణాలవల్ల ఆన్లైన్ కంటెంట్ బ్లాక్ చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2001 సెక్షన్ 69A ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఒక జూలై 2025లో భారత ప్రభుత్వం అభ్యంతరకరమైన, అశ్లీలమైన కంటెంట్ ను ప్రదర్శిస్తున్నారని ఆరోపణలతో చాలా ఓటీటీ ప్లాట్ఫామ్ లను నిషేధించింది. ముఖ్యంగా ఉల్లు తోపాటు 25 యాప్ లను వెబ్సైట్లను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే 2023లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా అశ్లీల కంటెంట్ ను అందిస్తున్నందుకు ఏకంగా 18 ఓటీటీ ప్లాట్ ఫారం లను బ్లాక్ చేసింది. ఇక ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మళ్లీ అదే రిపీట్ అవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.. మరి ఈ అశ్లీల కంటెంట్ ప్రసారం ఎప్పుడు ఆగిపోతుందో చూడాలి. ఏది ఏమైనా ఇలాంటి ప్లాట్ఫామ్స్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయనే వార్తలు మాత్రం వ్యక్తమవుతున్నాయి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×