E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు పెళ్లి సెట్ చేసిన కార్తీక్  

Karthika Deepam 2 Serial Today Episode April 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు పెళ్లి సెట్ చేసిన కార్తీక్  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: పారిజాతం, దీపకు ఫోన్‌ చేసి జ్యోత్స్న గురించి చెప్తుంది. నేను చెప్పింది మీకు అర్థం అయిందా..? అంటుంది. ఇందులో అర్థం కాకపోవడం ఏముంది జ్యోత్స్న ఇలాగే మాట్లాడితే చివరికి అందరూ తన ప్రేమలోనూ అర్థం ఉందని అంటారు అంటున్నావు కదా అని కార్తీక్‌ చెప్పగానే.. అవునురా..? దీనికి పరిష్కారమే లేదా అని పారిజాతం అడగ్గానే.. ఎందుకు లేదు మన దగ్గర మంచి ప్లాన్‌ ఉంది కదా..? అని కార్తీక్‌ చెప్పగానే.. ఏం ప్లానురా..? అంటూ పారిజాతం అడగ్గానే.. ఏం లేదు దీపకు మంచి చీర కొను అని కార్తీక్‌ చెప్పగానే..

అరేయ్‌ జ్యోత్స్న నిన్ను టార్గెట్‌ చేసిందిరా అంటే దీపకు చీర కొనమంటావు ఏంట్రా అంటూ డౌటు క్రియేట్‌ చేయగానే.. కార్తీక్ తన ప్లాన్‌ మొత్తం వివరిస్తాడు. ఎన్ని రోజులని ఈ డొంక తిరుగుడు రేపు దీనికి క్లారిటీ ఇద్దాం.. అంటూ చెప్పగానే.. సరేరా నువ్వేమీ చేసినా దాని పీడ వదిలించుకో చాలు అంటూ ఫోన్‌ కట్‌ చేస్తుంది. చూశావా..? విషం పోసి పెంచిన వాళ్లతోనే విరుగుడు పెట్టిస్తాను చూడు.. చిన్న మరదలా నీకిచ్చిన వాగ్దానం నెరవేరుస్తాను.. చీర కట్టుకుని సిద్దంగా ఉండు అనుకుంటాడు.

Advertisement

మరోవైపు షాపింగ్‌ మాల్‌లోకి వెళ్లిన జ్యోత్స్న  చిన్న పిల్లలు ఆడుకునే డాల్‌ కొంటుంది. ఇంకో బొమ్మ కావాలని షాపు అతన్ని అడగ్గానే.. అది వేరే వాళ్లు తీసుకున్నారని వాళ్లు ఇస్తే మీరే తీసుకోండి అని చెప్తాడు షాపతను. ఆ బొమ్మ కొన్న వ్యక్తి దగ్గరకు వెళ్లి ఎంత రేటు అయినా ఇస్తాను ఆ బొమ్మ ఇవ్వమని అడుగుతుంది. ఆ వ్యక్తి నువ్వెంత ఇచ్చినా నేను ఇవ్వను.. మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. మనది కాని దాని మీద మనసు పారేసుకోకండి.. అది దక్కకపోతే చాలా నష్టపోతాం అని బుద్దుడు ఎప్పుడో చెప్పారు అంటూ తన బొమ్మలు తీసుకుని వెళ్లిపోతాడు.

తర్వాత కాఫీ తాగుతూ కూర్చున్న జ్యోత్స్న వెనక్కి వెళ్లి చీర గురించి ఏదేదో మాట్లాడుతుంది పారిజాతం. జ్యోత్స్న ఏం చేస్తున్నావు గ్రానీ నువ్వు గతం మర్చిపోయావు నన్ను బావను కలుపుతానని మాటిచ్చావు అనగానే.. పారిజాతం కోపంగా ఆపు ఈ మాట నీ నోట వినడానికి ఇష్టం లేదు అనగానే.. అది సరే ఈ చీరేంటి అసలు చీరకు నీ మాటలకు సంబందమే లేదు అంటూ అడగ్గానే.. పారిజాతం చీర దీప కోసం తీసుకున్నాను.. కార్తీక్‌ గాడికి బాగా నచ్చింది. అని చెప్పగానే.. జ్యోత్న్స కోపంగా చీర లాక్కుని ఈ చీర నేను కట్టుకుని వస్తాను అంటూ వెళ్తుంది.

Advertisement

అప్పుడే ఇంటికి వస్తున్న కార్తీక్‌, దీపలకు ఎదురు వెళ్లిన పారిజాతం ఒరేయ్‌ మనవడా ప్లాన్‌ సక్సెస్‌ అంటూ పారిజాతం చెప్తుంటే.. శివనారాయణ, దశరథ, సుమిత్ర వస్తారు. ఏమైందని అడుగుతారు. జ్యోత్స్నను చూసుకోవడానికి పెళ్లి కొడుకు వస్తున్నాడు అని కార్తీక్ చెప్పగానే.. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో పెళ్లి కొడుకు వస్తాడు. కార్తీక్‌ అందరికీ పరిచయం చేస్తాడు. సుమిత్ర మాకు చెప్పావు.. కానీ జ్యోత్స్నకు ఎప్పుడు చెప్తావు.. ఎలా చెప్పి ఒప్పిస్తావు అని అడగ్గానే.. ఇప్పుడు చెప్తాను అత్త.. ఇవాళ నీ అసలైన కూతురును చూస్తావు అంటాడు. దీంతో సుమిత్ర వీడు ఏదో చేయబోతున్నాడు అనుకుంటుంది సుమిత్ర.

రూంలో శారీ కట్టుకుంటున్న జ్యోత్స్న దగ్గరకు పారిజాతం, దీప వెళ్లి చీర గురించి గొడవ చేస్తారు. నువ్వు చీర కట్టుకుని ఆ కార్తీక్‌ గాడి ముందుకు అయితే వెళ్లకు వాడు నన్ను తిడతాడు అంటూ పారిజాతం అనగానే.. నేను ఇప్పుడే కిందకు వెళ్తాను.. బావ ముందు నిల్చుని చీర ఎలా ఉందని బావను అడుగుతాను అంటూ జ్యోత్స్న కిందకు వెళ్తుంది. చీర కట్టుకుని పెళ్లి కూతురులా రెడీ అయి వస్తున్న జ్యోత్స్ను చూసిన శివనారాయణ, దశరథ, సుమిత్ర షాక్‌ అవుతారు. జ్యోత్స్న కిందకు రాగానే.. కార్తీక్‌ రండి పెద్ద మేడం గారు మీకో సర్‌ఫ్రైజ్‌ అంటూ పెళ్లి కొడుకును చూపిస్తాడు. జ్యోత్స్న ఎవరతను అని అడగ్గానే.. పారిజాతం పెళ్లికొడుకు అని చెప్తుంది. జ్యోత్స్న షాక్‌ అవుతుంది. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×