E-Paper
Advertisement

బెంగాల్‌లో చివరి దశ పోలింగ్‌ మొదలు, పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు బారులు, రాత్రికి ఎగ్జిట్ ఫలితాలు

బెంగాల్‌లో చివరి దశ పోలింగ్‌ మొదలు, పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు బారులు, రాత్రికి ఎగ్జిట్ ఫలితాలు
Advertisement

Bengal Second Phase: బెంగాల్‌లో చివరి దశ పోలింగ్‌ మొదలైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఆయా కేంద్రాల్లో భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బెంగాల్‌లో ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారో ఈ విడత ఎన్నికలు చాలా కీలకమని చెబుతున్నారు.

బెంగాల్‌లో చివరి దశ పోలింగ్‌ మొదలు, పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు బారులు

Advertisement

పశ్చిమబెంగాల్‌ శాసనసభకు రెండువిడతలుగా ఎన్నికలు జరిగాయి. తొలి దశలో 152 చోట్ల పోలింగ్‌ పూర్తి అయ్యింది. రెండో విడతలో మరో 142 సీట్లలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఆరుగంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీశారు. ఈ దశ పోలింగ్ బట్టి బెంగాల్‌లో ఎవరు అధికారంలోకి వస్తారనేది తేలిపోనుంది.

ఎందుకంటే సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపుర్‌ నియోజకవర్గం అత్యంత కీలకమైనది. బీజేపీ నుంచి సువేందు అధికారి ఆమెపై పోటీకి దిగారు. అంతేకాదు ఈసారి పోలింగ్ జరగనున్న అనేక నియోజకవర్గాలు టీఎంసీకి కంచుకోటగా మారాయి.

Advertisement

రాత్రికి ఎగ్జిట్ ఫలితాలు వెల్లడి.. ఐదు రాష్ట్రాల అభ్యర్థుల్లో టెన్షన్

ఈ నేపథ్యంలో పోలింగ్ విషయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం గట్టి చర్యలు చేపట్టింది.దీనికితోడు మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కంచుకోట దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఈ విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.

ఇప్పటికే మూడు రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికల పోలింగ్ పూర్తి అయ్యింది. పశ్చిమ బెంగాల్‌లో ఈ విడత ఎన్నికల పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ అందరి అంచనాలు నెలకున్నాయి.

ALSO READ: ఎన్నికలు అయిపోయాయి.. ధరల బాదుడు షురూ.. రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఎప్పుడు లేని విధంగా ఈసారి కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో ముక్కోణపు పోటీ జరిగింది. దానివల్ల తాము విజయం సాధిస్తామని అధికార పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ మాత్రం, అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కాషాయం జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఎవరివైపు మొగ్గు చూపుతాయో చూడాలి.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×