E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దశరథ, శివనారాయణలను తిట్టిన కాంచన  

Karthika Deepam 2 Serial Today Episode April 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దశరథ, శివనారాయణలను తిట్టిన కాంచన  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: కిడ్నాప్‌ చేసింది వైరా అని డబ్బు కోసమే కాదు వాడు పాత కక్షలు మనసులో పెట్టుకుని చేశాడు. అని కార్తీక్‌ చెప్పగానే.. శివనారాయణ కోపంగా లోపలికి వెళ్లి గన్‌ తీసుకుని వచ్చి వైరాను చంపేస్తానని వెళ్లబోతుంటే.. కార్తీక్‌ ఆపేస్తాడు. దశరథ కూడా శివనారాయణను ఆపేసి పోలీసులకు అంతా చెప్తాడు. దీంతో పోలీసులు వాణ్ని పట్టుకునే బాధ్యత మాది మీరు ఏమీ చేయకండి అంటూ చెప్పి వెళ్లిపోతారు. గుమ్మం దగ్గర చాటుగా నిలబడిన పారిజాతం భయపడుతూ ఇప్పుడు నేను లోపలికి వెళ్తే వీరంగమే చేస్తాడు అనుకుని పక్కకు వెళ్లబోతుంటే.. పారిజాతానకి శ్రీధర్‌ ఫోన్‌ చేస్తాడు. కిడ్నాప్‌ విషయంలో కార్తీక్‌కు బుల్లెట్‌ తగిలిందని పారిజాతం చెప్పగానే.. శ్రీధర్‌ కంగారుగా కారేసుకుని బయలుదేరుతాడు. పారిజాతం మాత్రం లోపలికి ఎలా వెళ్లాలి అని భయపడుతూ ఆలోచిస్తుంది.

లోపల సుమిత్ర ఇప్పుడు నేను మీ అమ్మకు ఏం సమాధానం చెప్పాలిరా అని అడుగుతుంది. దీంతో ఇప్పుడు నాకేం కాలేదు కదా అత్త అని చెప్పగానే.. నీకు బుల్లెట్‌ తగిలిన విసయం ఇంకెవరికైనా తెలుసా..? అని శివనారాయణ అడగ్గానే.. ఎవ్వరికీ తెలియదు తాత అంటాడు. ఇంతలో శ్రీధర్‌ కంగారు వచ్చి రేయ్‌ కార్తీక్‌ నీకు బుల్లెట్‌ తగిలిందని అత్తయ్య గారు చెప్పారు అని అడగ్గానే.. బుల్లెట్‌ తగలడానికి తనే కారణం అని అత్తయ్య చెప్పలేదా..? అంటాడు శివనారాయణ. దీంతో అందరూ షాక్‌ అవుతారు. అత్తయ్య ఏం చేశారు మామయ్య అని శ్రీధర్‌ అడగ్గానే.. అందరూ వద్దంటున్నా కార్తీక్‌ను అక్కడికి తీసుకెళ్లింది పారిజాతమే వీళ్లు దాంట్లో ఇన్వాల్వ్‌ అయ్యారు. అందుకే కార్తీక్‌ బుల్లెట్‌ తగిలింది అని చెప్తాడు.

Advertisement

మరోవైపు డబ్బులున్న సూట్‌కేసు తీసుకెళ్లి సంతోషంగా ఓపెన్‌ చేసి చూసి షాక్‌ అవుతాడు. అందులో డబ్బులకు బదులు ఇటుకలు ( బ్రిక్స్‌) ఉంటాయి. అవి చూసి కోపంగా వాళ్లను ఊరికే వదలను వాళ్లకు ఈ వైరా పవరేంటో చూపిస్తాను అంటూ డైలాగులు కొడుతుంటాడు.

మరోవైపు శివనారాయణ ఇంట్లో ఉన్న కార్తీక్‌ చెప్పగానే.. పారిజాతం బయటకు వెళ్లి గోనె సంచిలో ఉన్న డబ్బు బయటి నుంచి తీసుకొచ్చి అందరికీ చూపిస్తుంది.  ఆ డబ్బును చూసిన అందరూ ఆశ్చర్యపోతారు. జ్యోత్స్న మాత్రం మనసులో తిట్టుకుంటుంది. ఇంతలో కార్తీక్‌ వీడియో కాల్‌లో వాడి ముఖం మేము గుర్తుపట్టలేదు కానీ నువ్వు చూశావు కదా మాకు చెప్పొచ్చు కదా అంటాడు కార్తీక్‌. దీంతో జ్యోత్స్న నిజం చెబితే చంపేస్తానని బెదిరించారు అందుకే చెప్పలేదు అంటూ ఇంకా సాగదీస్తే బావ మొత్తం లాగేసేలా ఉన్నాడు అని మనసులో అనుకుని కార్తీక్‌ దగ్గరకు వెళ్లి ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు బావ అందుకే నీకు నేను ఏం చెప్పినా తక్కువే అవుతుంది. కానీ ఒక్కటి మాత్రం చేయగలను. అంటూ కార్తీక్‌ను హగ్‌ చేసుకుంటుంది. దీంతో దీప కోపంతో రగిలిపోతుంది. కోపంగా జ్యోత్స్నను చూస్తుంటుంది. ఇంతలో జ్యోత్స్న, దీపను చూసి కన్ను కొడుతుంది. తర్వాత శ్రీధర్‌ కార్తీక్‌, దీపలను తీసుకుని ఇంటికి వెళ్లిపోతాడు.

Advertisement

కాంచన విషయం తెలుసుకుని అందరినీ తిడుతుంది. దాన్ని కాపాడటం కోపం నిన్ను ఎవర్రా వెళ్లమంది. మా అన్నయ్య, మా నాన్న ఎవరు చెప్పారు అంటూ కోప్పడుతుంది. కార్తీక్‌ ఏదో చెప్పబోతుంటే.. కాంచన ఏడుస్తూ.. నీ చేతికి ఇంత బుల్లెట్‌ తగిలింది అంటే ఏమనుకోవాలి…? అంటూ ఎమోషనల్‌ అవుతుంది. జ్యోత్స్నను తిడుతుంది. కార్తీక్‌ నాకేం కాలేదు కదా అమ్మా అంటూ ఓదారుస్తాడు. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×