E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అక్షయ్ ను రెచ్చగొట్టిన రాజేశ్వరి.. భరత్ దెబ్బకు మైండ్ బ్లాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ ను రెచ్చగొట్టిన రాజేశ్వరి.. భరత్ దెబ్బకు మైండ్ బ్లాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్..
Advertisement

Intinti Ramayanam Today Episode April 24th : అవని మీరు మీ కొడుకుని దగ్గర చేసుకోవాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ ఈ విషయాన్ని మీరు బయట పెడితే మీ కూతురు పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించండి అని రాజేశ్వరి కి వార్నింగ్ ఇస్తుంది. మా అమ్మ అంటే ఇష్టం లేని పల్లవి మిమ్మల్ని వదిలేసి ఎవరిని తల్లిగా ఊహించుకోలేదు అని అవని అంటుంది. మా తమ్ముడు సంగతి పక్కన పెడితే మీ కూతురు పెంచిన తల్లికి కన్నతల్లికి మధ్య దూరం అయ్యి నలిగిపోతుంది. అది మీరు అర్థం చేసుకోవడం లేదు. ఇది నిజాన్ని మీరు చెప్పాలనుకుంటే చెప్పుకోండి అని అవని రాజేశ్వరి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. పల్లవి తన తండ్రి ఇచ్చిన 50 లక్షలు గురించి రాజేశ్వర్ కి చెప్పి పెద్ద గొడవ చేయమని చెప్తుంది..

శాంతి పూజ దగ్గర రచ్చ..

భూమి పూజ చేసిన తర్వాత శాంతి పూజ చేయలేదు అని కమల్ పూజ చేయించడానికి సైట్ దగ్గరికి వెళ్తారు.. అక్షయ్ కమల్ ఇద్దరు కూడా అక్కడ పూజ చేస్తూ ఉండగా.. కార్లు సౌండ్ వినిపించి ఆగుతారు. ఏంటి కార్లు ఎందుకు వస్తున్నాయి అని అక్షయ కమల్ ఇద్దరూ చూస్తుండగా అందులోంచి టకటక అని రాజేశ్వరి భరత్ తో పాటుగా కొందరు రౌడీలు కూడా దిగుతారు.. రాజేశ్వరి నా భర్త దగ్గర డబ్బులు తీసుకునింది కాక ఇప్పుడు పూజ చేసుకుంటున్నారా అని ఎత్తి పొడుస్తూ మాట్లాడుతుంది. ఫైనాన్షియర్ ని రెచ్చగొట్టి అడగమని చెప్తుంది. అతను మీరు డబ్బులు ఇవ్వకుండా ఎటువంటి పని చేయడానికి వీలు లేదు అని కండిషన్ పెడతాడు.

అక్షయ్ కు షాక్..

Advertisement

ముందు నా డబ్బులు నాకు కట్టి ఆ తర్వాత మీరు ఏ పూజ అయినా చేసుకోండి అని అతను చెప్పగానే నీ డబ్బులు రెండు రోజుల్లో ఇస్తాము అని అక్షయ్ ఎంత చెప్తున్నా సరే అతను మాత్రం వినడు. తను ఏం చెప్తే అదే చేయాలి అని అనుకుంటాడు. ఎక్కువ మాట్లాడద్దు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్తున్నాను కదా అని అక్షయ్ కూడా సీరియస్ అవుతాడు.. కానీ అతను మాత్రం నేను వినను అని అంటాడు. నా భర్త దగ్గర షూరిటీ తీసుకుని మీరు డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు ఆస్తి మొత్తం నా పేరు మీదకు రావడంతో వాళ్లు నన్ను అడుగుతున్నారు అని రాజేశ్వరి అంటుంది.. మీ భర్త ఇచ్చారు కాబట్టి మీ భర్త కి తెలియకుండా మేము ఏది చేయడం లేదు అని అక్షయ్ అంటాడు.

రాజేశ్వరికి అవమానం..

నా భర్త దగ్గర తీసుకున్న 50 లక్షలు కూడా నాకు ఇప్పుడే ఇచ్చేయండి. నా భర్త జైల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని విడుదల చేయించమని ఎంతగా బ్రతిమలాడినా మీరు మాత్రం కరగలేదు. అలాంటిది ఇప్పుడు నా భర్త దగ్గర డబ్బులు తీసుకోవడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా అని రాజేశ్వరి అంటుంది. ఆ మాట విన్న అక్షయ్ నీ భర్తని నీ కంట్రోల్ లో పెట్టుకోవడం చేతకాదు కానీ నువ్వు మా గురించి మాట్లాడుతున్నావా అని దారుణంగా అవమానించాలా మాట్లాడుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ రా నీ పెళ్ళాన్ని నువ్వు కంట్రోల్ లో పెట్టుకోలేక ఇలా చేస్తున్నావా అని రాజేశ్వరి కూడా ఏ మాత్రం తగ్గకుండా మాట్లాడుతుంది.

అక్షయ్ ను కొట్టిన భరత్..

Advertisement

ఒక ఆడదానివి అన్న సంగతి కూడా నువ్వు మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటి? నీకు కచ్చితంగా బుద్ధి చెప్పాలి అని రాజేశ్వరి మీదకి అక్షయ వెళ్తాడు. పక్కనే ఉన్న భరత్ అక్షయ్ ని కింద పడేస్తాడు. ఇది నీకు సంబంధం లేని విషయం అని అక్షయ్ ఎంత చెప్తున్నా సరే భరత్ వినకుండా అక్షయనే కొడతాడు. ఇక రౌడీలు కమల్ ని కొడతారు. రాజేశ్వరి మా డబ్బులు మాకు వెంటనే ఇవ్వాలి అని తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భరత్ నేను కొట్టిన విషయం వదినతో చెప్తే అసలు ఊరుకోదు అన్నయ్య అని కమల్ అంటాడు. తను నా చెల్లెలు భర్త అని నేను ఆలోచిస్తున్నాను. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పద్దు అని అక్షయ్ కమల్ దగ్గర మాట తీసుకుంటాడు.

పార్వతి కన్నీళ్లు.. 

ఇంట్లో ఎక్కడ ఎవరికీ మనశ్శాంతి లేదు అని గుడికి వెళ్ళిన పార్వతి దేవుడిని మొక్కుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా భర్త పరిస్థితి అలా ఉంది నా పిల్లలు ఎవరికి వాళ్లే అని ఉన్నారు. ఎన్ని తప్పులు చేసినా పల్లవి అసలు మారడం లేదు. నా కొడుకుల వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇన్ని జరుగుతున్న కూడా నువ్వు ఏమి కనికరించడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా ఇంటిని నా పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత నీదే స్వామి అని పార్వతి బాధపడుతుంది.

పల్లవి ప్లాన్ సక్సెస్..

భరత్ ఫోన్ చేసి అక్షయ్ ని కొట్టిన విషయాన్ని పల్లవికి చెప్తాడు. ఏమి తప్పు చేయలేదు భరత్ నీ డ్యూటీని నువ్వు మాత్రమే చేసావు. నీకు ఏమీ కాకుండా మేము చూసుకుంటాము అని పల్లవి అంటుంది. నువ్వేమీ ఆలోచించొద్దు. నీకు ఏమి కాకుండా నేను మామ్ చూసుకుంటాను అని అనగానే భరత్ సరే అంటాడు. ఇక రాజేశ్వరి భరత్ దగ్గరికి వెళ్లి ఎందుకు నువ్వు అతని కొట్టావు నీ బావని సంగతి నువ్వు మర్చిపోయావా అని అడుగుతుంది.. నాకు దేవుడితో సమానం మీ కొడుకు లేదా మీ భర్త ఉంటే ఇలా జరిగేది కాదు కదా అని అనగానే రాజేశ్వరి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :శుక్రవారం టీవీ సినిమాలు.. యాక్షన్ లవర్స్ కు పండగే..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×