E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న కిడ్నాప్ డ్రామా – కుప్పకూలిపోయిన సుమిత్ర 

Karthika Deepam 2 Serial Today Episode April 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న కిడ్నాప్ డ్రామా – కుప్పకూలిపోయిన సుమిత్ర 
Advertisement

Karthika Deepam 2  serial today Episode: కార్తీక్‌ ఇంటి నుంచి కోపంగా కారులో వెళ్లిపోతున్న జ్యోత్స్నకు ఎదురుగా వైరా వస్తాడు. రోడ్డుకు అడ్డంగా తన కారు పెట్టి జ్యోత్స్న కోసం వెయిట్‌ చేస్తుంటాడు. జ్యోత్స్న రాగానే తన కారులో ఎక్కి డబ్బులు ఇవ్వమని డిమాండ్‌ చేస్తాడు. జ్యోత్స్న నేనెందుకు ఇవ్వాలి డబ్బులు అంటూ గన్‌ తీయగానే.. వైరా ఆ గన్‌ లాక్కుని జ్యోత్స్నకు ఎయిమ్‌ చేస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు అంటూ జ్యోత్స్న అడగ్గానే..అది కిడ్నాప్‌ చేస్తున్నాను.. పద కారు స్టార్ట్‌ చేయ్‌ లేదంటే బుల్లెట్‌ నీ బుర్రలోకి దూసుకెళ్తుంది అని బెదిరించగానే.. జ్యోత్స్న కారు స్టార్ట్‌ చేస్తుంది. కట్‌ చేస్తే.. జ్యోత్స్నను తన డెన్‌కు తీసుకెళ్లి కుర్చీకి కట్టేస్తాడు వైరా. జ్యోత్స్న కోపంగా రేయ్‌ నేను శివనారాయణ గారి మనవరాలిని అని చెప్పగానే.. అసలు నువ్వేం భయపడకు వాళ్లకు నేనే చెప్తాను అనగానే.. జ్యోత్స్న అసలు నీకేం కావాలి అని అడగుతుంది.

దీంతో వైరా తనకు ఇరవై కోట్లు కావాలని అడుగుతాడు. నేనెందుకు ఇస్తాను అని జ్యోత్స్న అడగ్గానే.. ఇన్నాళ్లు మా డాడీని అడిగేవాణ్ని ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను.. అంటూ చెప్పగానే.. నేనెందుకు ఇస్తాను అంటూ జ్యత్స్న అడగ్గానే.. నన్ను మొత్తం మోసం చేసి నన్ను దివాలా తీసేలా చేశావని తిడుతూ మీ డాడీ మీద పగ తీర్చుకుందామనుకున్నాను.. కానీ నువ్వు చేసిన దానికి నేను చాలా లాస్‌ అయ్యాను.. ఇప్పుడు మీ డాడీకి ఫోన్‌ చేసి ఇరవై కోట్లు ఇవ్వమని లేదంటే నిన్ను చంపేస్తానని బెదిరిస్తాను అంటూ చెప్తూనే.. వైరా, దశరథకు ఫోన్‌ చేసి నీ కూతురును కిడ్నాప్‌ చేశాను అంటాడు. దీంతో దశరథ కోపంగా ఎవర్రా నువ్వు నీలాంటి వాళ్లను చాలా మంది చూశానురా..? నా కూతురు ఇంట్లోనే ఉందిరా..? అంటూ పారిజాతాన్ని పిన్ని జ్యోత్స్న ఎక్కడ ఉంది అని అడగ్గానే.. జ్యోత్స్న ఇంట్లో లేదని చెప్తుంది పారిజాతం. దీంతో దశరథ మాట్లాడేలోపే కిడ్నాప్‌ వీడియో పంపిస్తాను చూసుకో అంటూ కాల్ కట్‌ చేస్తాడు వైరా..

Advertisement

దశరథ, శివనారాయణ, కార్తీక్‌, దీప కిడ్నాప్‌ గురించి మాట్లాడుకుంటుంటే.. వైరా వీడియో పంపించి కాల్ చేస్తాడు. కార్తీక్‌ కోపంగా ఎవర్రా నువ్వు అని అడగ్గానే.. వైరా కోపంగా ఎంత మంది మాట్లాడతార్రా..? నాకు ఇరిటేషన్‌ వచ్చిందంటే మీ కూతురును చంపేసినా చంపేస్తాను అంటూ బెదిరించగానే.. అందరూ కంగారుపడతారు. నేను మళ్లీ ఫోన్‌ చేసే వరకు ఆగండి.. ఈలోపు మీరు పోలీసులకు చెప్పడాలు లాంటివి ఏమైనా చేశారంటే మీ కూతురు శవమై వస్తుంది అని బెదిరిస్తూ కాల్‌ కట్‌ చేస్తాడు.

దశరథ ఏడుస్తూ.. కూర్చుంటాడు. శివనారాయణ ఓదారుస్తుంటాడు. కార్తీక్‌ దీపను పక్కకు తీసుకెళ్లి కిడ్నాప్‌ గురించి మాట్లాడుతుంటాడు. ఆ కిడ్నాపర్‌ నీకు కూడా ఫోన్‌ చేసి ఉంటాడురా అని పారిజాతం చెప్తుండగానే.. దాస్‌ ఫోన్‌ చేస్తాడు. కాల్ మాట్లాడి వస్తాను అంతవరకు సుమిత్రకు ఏ విషయం చెప్పొద్దని కార్తీక్‌ పక్కకు వెళ్తాడు. సుమిత్ర ఈ విషయం చెప్పొద్దని పారిజాతం, దీపకు చెప్పగానే.. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జ్యోత్స్న గురించి కాదండి సుమిత్ర గురించే అని చెప్పి వెళ్లిపోగానే..పారిజాతం ఎమోషనల్‌ అవుతూ.. మనవరాలా నువ్వు నాకంటే మంచిదానివే అనుకుంటూ ఇంతకీ దాస్‌ గాడు కార్తీక్‌ ఎందుకు ఫోన్‌ చేశాడు అనుకుంటుంది.

Advertisement

బయటకు వెళ్లిన కార్తీక్‌, దాస్‌కు కిడ్నాప్‌ విషయం చెప్తాడు. దీంతో దాస్‌ వెంటనే ఇంటికి వస్తున్నాను అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు. రావొద్దని చెబుదామనుకున్నాను.. కానీ ఆయనే వస్తున్నారు అనుకుంటూ లోపలికి వెళ్తాడు.  అందరూ కిడ్నాప్‌ గురించి భయడపడుతూ ఆలోచిస్తుంటే.. ఇంతలో సుమిత్ర వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. కార్తీక్‌ మాత్రం సుమిత్రకు మాటలు చెప్తూ.. కిడ్నాప్‌ వీడియో చూపిస్తాడు. వీడియో చూసిన సుమిత్ర భయంగా ఏంట్రా ఇది అంటూ అడగ్గానే.. కిడ్నాప్‌ విషయం చెప్తాడు కార్తీక్‌. దీంతో సుమిత్ర ఏడుస్తూ.. ఉండగానే.. వైరా వీడియో కాల్ చేస్తాడు. సుమిత్ర ఏడుస్తూ.. జ్యోత్స్నతో వీడియో కాల్ మాట్లాడుతుంది.

సుమిత్ర ఏడుస్తుంది. శివనారాయణ, దశరథ.. ఓదారుస్తుంటారు. వీడియో కాల్‌లో మాట్లాఉతున్న జ్యోత్స్న మమ్మీ ఒక కూతురుగా నిన్ను కాపాడుకున్నాను.. వచ్చే జన్మలో కూడా నీ కూతురుగానే పుట్టాలని ఉంది అంటూ చెప్తుండగానే.. కాల్ కట్‌ చేస్తాడు. తర్వాత వాయిస్‌ కాల్ చేసి తనకు ముప్పై కోట్లు ఇవ్వాలని అప్పుడే జ్యోత్స్నను వదిలేస్తానని చెప్తాడు. దీంతో సుమిత్ర ఏడుస్తూ పడిపోతుంది. మరోవైపు వైరా నీ ప్లాన్‌ అదిరిపోయింది. మీ అమ్మ సెంటిమెంట్‌తో ముప్పై కోట్లు రాబడుతున్నావు అంటాడు. దీంతో జ్యోత్స్న అవసరాలు అలా ఉన్నాయి. ఏం చేస్తాం అంటుంది. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×