E-Paper
Advertisement

40 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమైన బుల్లితెర నటి!

40 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమైన బుల్లితెర నటి!
Advertisement

Film industry: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు నచ్చిన వారిని వివాహం చేసుకోవడం, ఆ తర్వాత నచ్చకపోతే విడాకులు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత మళ్ళీ సరైన జోడు దొరికితే వివాహం చేసుకోవడానికి కూడా వెనుకడుగు వేయరు. ముఖ్యంగా లేటు వయసులో కూడా పెళ్లికి సిద్ధమవుతున్నారు సెలబ్రిటీలు. ఈ క్రమంలోనే ఇప్పుడు తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి 12 ఏళ్లు ఒంటరిగా ఉన్న ఆమె.. ఇప్పుడు మళ్లీ 40 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమయ్యింది. మరి ఆమె ఎవరు? ఎవరిని వివాహం చేసుకోబోతోంది? మొదటి భర్తతో విభేదాలు రావడానికి గల కారణం ఏమిటి? ఆయన ఎవరు? ఇలా కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ సీరియల్ నటి..

ఆమె ఎవరో కాదు జెన్నీఫర్ వింగెట్. పలు సీరియల్స్ ద్వారా హిందీ సినీ రంగంలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈమె.. గత కొన్ని సంవత్సరాలుగా వ్యక్తిగత జీవితం కంటే కూడా కెరియర్ పైనే దృష్టి పెట్టింది. నిజానికి ఈమెకు చిన్నప్పటి నుంచే నటన అంటే చాలా ఇష్టం. అందుకే చైల్డ్ ఆర్టిస్ట్ గానే తన కెరియర్ ను మొదలు పెట్టింది. అకేలే హమ్ అకేలే తుమ్, రాజాకి ఆయేగీ బారాత్, రాజా కో రాణి సే ప్యార్ హో గయా ఇలా పలు చిత్రాలలో నటించింది. చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చి, మేకప్ వేసుకొని అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత టెలివిజన్ రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

మొదటి భర్తతో విడాకులు.. 12 ఏళ్లుగా ఒంటరితనం..

Advertisement

ఇకపోతే ఈమె నటించిన బేహాద్ సీరియల్ ఈమెకు విపరీతమైన ప్రజాదారణను తీసుకొచ్చింది. ఇకపోతే కెరియర్ లో మంచి మంచి పాత్రలు ఎంచుకుంటూ పీక్స్ లో ఉన్న సమయంలోనే దిల్ మిల్ గయే అనే చిత్రంలో తన సహనటుడైన కరణ్ సింగ్ గ్రోవర్ తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరూ 2012లో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన రెండేళ్లకే మనస్పర్ధలు రావడంతో 2014లో విడిపోయారు. ఇంకా విడాకుల తర్వాత కరణ్ ప్రముఖ నటి బిపాసా బసుని వివాహం చేసుకోగా.. ఈమె మాత్రం కెరియర్ పై దృష్టి పెట్టి దాదాపు 12 ఏళ్లపాటు ఒంటరిగానే తన జీవితాన్ని కొనసాగిస్తోంది.

also read:వారణాసిపై ప్రియాంక చోప్రా బిగ్ అప్డేట్.. 14 నెలలుగా అదే పని అంటూ!

కాబోయే భర్త ఎవరంటే?

Advertisement

అయితే ఇప్పుడు రెండవ వివాహానికి సిద్ధమైనట్టు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ గా మారింది. సింగపూర్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విలియం ఇష్మాయెల్ ను జులై 16వ తేదీన వివాహం చేసుకోబోతోంది అనే ప్రచారం నడుస్తోంది. అనగా రేపు వీరి వివాహం జరగబోతున్నట్లు సమాచారం. యునైటెడ్ కింగ్డమ్ లో చాలా ప్రైవేటుగా తమ పెళ్లిని చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరగబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే 40 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమవుతున్న ఈ బ్యూటీ నిజంగానే పెళ్లి చేసుకుంటుందా లేక ఇది కేవలం రూమర్ మాత్రమేనా అన్న విషయం తెలియాల్సి ఉంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×