E-Paper
Advertisement

మర్మమైన రీతిలో గ్రామస్తుల మరణాలు… దున్నపోతును బలిస్తేనే శాంతించే శాపం

మర్మమైన రీతిలో గ్రామస్తుల మరణాలు… దున్నపోతును బలిస్తేనే శాంతించే శాపం
Advertisement

Kannada Horror Movie: ఓ ఊర్లో వరుసగా మిస్టీరియస్ మరణాలు జరిగితే… ఆ శాపం శాంతించాలి అంటే దున్నపోతును బలివ్వాలి అంటూ కొత్త రూల్ ను తీసుకొస్తే… జానపద సంస్కృతి, ఆధునిక జీవితం అనే అంశాలను కలగలిపి తెరకెక్కించిన హర్రర్ మూవీనే ‘కోన’ ( Kona). మరి ఈ సినిమా స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

సినిమా ప్రారంభంలో జగ్గేష్ వాయిస్ ఓవర్ తో కథ షురూ అవుతుంది. 18వ శతాబ్దపు ‘కొల్లూరు’ గ్రామ కథ చెప్తూ సినిమాను స్టార్ట్ చేస్తారు. ఆ కాలంలో ఊరు పొలిమేరలోని నది దగ్గర గ్రామస్థులు మిస్టీరియస్ రీతిలో చనిపోతుంటారు. గ్రామ పూజారి దీనికి కారణం ఒక చేతబడి అని, ఆ మంత్రగాడు సృష్టించిన దుష్టశక్తి అని చెప్తాడు. ఆ శక్తి నుండి గ్రామాన్ని కాపాడాలంటే ప్రతి సంవత్సరం ‘కోన’ అంటే దున్నపోతును బలి ఇవ్వాలని ఆదేశిస్తాడు. ఆ ఆచారం తరతరాలుగా కొనసాగుతూ వస్తుంది. ఈ జానపద గాథ సినిమాకు బలమైన బ్యాక్‌డ్రాప్‌గా నిలుస్తుంది.

Advertisement

కథ ఇప్పటి కాలానికి షిఫ్ట్ అవుతుంది. నారాయణ భార్య లక్ష్మి. ఆమె ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక తీవ్ర దుఃఖంలో మునిగిపోతాడు. ఆమె జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతూనే ఉంటాయి. ఒంటరితనం తట్టుకోలేక అతను తన దగ్గరున్న ‘జోగి’ అనే జాతకాలు చెప్పే రోబోతో కలిసి ఊరూరా తిరుగుతూ, జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో కొల్లూరుకి బయలుదేరిన ఒక సంచార నాటక బృందంతో నారాయణకు పరిచయం ఏర్పడుతుంది. అతను కూడా వాళ్ళ గ్రూప్‌లో చేరతాడు. అక్కడే గ్రామంలో గందరగోళం మొదలవుతుంది.

ఆ సంవత్సరం కొల్లూరు గ్రామంలో ఈ ఏడాది ‘కోన’ బలి ఆచారం సకాలంలో జరగదు. దీంతో గ్రామస్థులలో భయం, అశాంతి మొదలవుతాయి. సరిగ్గా అదే సమయంలో నాటక బృందంతో కలిసి నారాయణ ఆ గ్రామంలోకి అడుగు పెడతాడు. అక్కడ వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. అంతలోనే ఒక ఆవు అనుమానాస్పదంగా చనిపోతుంది. గ్రామంలోని పాత రహస్యాలు బయట పడతాయి. నాటక బృందం వేసే ‘రాముడు-సీత’ నాటకం గ్రామస్థులను నవ్విస్తుంది. కానీ ఆ నవ్వుల మధ్యనే భయం కూడా పెరుగుతుంది.

Advertisement

నారాయణ ఆ గ్రామంలో తన భార్య లక్ష్మి జ్ఞాపకాలను చూస్తూ భ్రమల్లోకి వెళ్తాడు. జోగి రోబో అతనికి సలహాలు ఇస్తుంటుంది. గ్రామంలో జరుగుతున్న వింతల వెనుక ఉన్న దుష్టశక్తి నారాయణను టార్గెట్ చేస్తుంది. ఆ శాపం నుండి గ్రామాన్ని కాపాడాలంటే మళ్లీ ‘కోన’ బలి ఇవ్వాల్సి వస్తుంది. కానీ నారాయణ ఆ ఆచారాన్ని పక్కన పెట్టేస్తాడు ? నారాయణ భార్య చనిపోవడానికి కారణం ఏంటి ? చివరికి ఏమైంది ? అన్నది స్టోరీ.

తెలుగులో ఉందా ?

‘కోన’ మస్ట్ వాచ్ కన్నడ హర్రర్ కామెడీ థ్రిల్లర్. ZEE5లో కన్నడలో అందుబాటులో ఉంది. 2025 అక్టోబర్‌ లో విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకుంది. కోమల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ జానపద హారర్-కామెడీ థ్రిల్లర్‌ ను హరి కృష్ణ ఎస్. దర్శకత్వం వహించారు. తెలుగు ఆడియో అందుబాటులోకి రాలేదు.

Read Also: అపర కుబేరుడితో పెళ్లి… భర్తకు తెలియకుండా మరొకరితో… స్వీట్ రివేంజ్ డ్రామా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×