E-Paper
Advertisement

షకలక శంకర్ పై అప్పారావు షాకింగ్ కామెంట్స్.. అందుకే అవకాశాలు లేవంటూ!

షకలక శంకర్ పై అప్పారావు షాకింగ్ కామెంట్స్.. అందుకే అవకాశాలు లేవంటూ!
Advertisement

Apparao:; జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్లు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమంతో సక్సెస్ అందుకున్న వారందరూ ప్రస్తుతం వెండి తెరపై కమెడియన్లుగా కొనసాగుతున్నారు అదేవిధంగా హీరోలుగాను, డైరెక్టర్లు గాను స్థిరపడిన సంగతి తెలిసిందే. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో షకలక శంకర్ (Shakalaka Shankar) ఒకరు. ఈయన కూడా తన అద్భుతమైన కామెడీ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల షకలక శంకర్ పెద్దగా సినిమాలలోనూ అలాగే బుల్లితెర కార్యక్రమాలలో కూడా కనిపించలేదు.

షకలక శంకర్ కారణంగా అవకాశాలు..

ఈ నేపథ్యంలోనే షకలక శంకర్ కనిపించకపోవడం గురించి మరొక కమెడియన్ అప్పారావు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అప్పారావు షకలక శంకర్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. షకలక శంకర్ జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో అప్పారావు కొనసాగుతూ మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షకలక శంకర్ గురించి అప్పారావు మాట్లాడుతూ..

దేవుడు అని సేవ్ చేసి పెట్టుకున్నాను..

Advertisement

సినిమా ఇండస్ట్రీలో నేను అవకాశాలను అందుకొని ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం షకలక శంకర్ అని తెలిపారు .షకలక శంకర్ అనే వ్యక్తి లేకపోతే అప్పారావు అనే వ్యక్తి కూడా లేరని ఈయన తెలియచేశారు. నేను కెరియర్ లో ఇలా ఉండటానికి కారణమైనటువంటి షకలక శంకర్ పేరును నా మొబైల్ ఫోన్లో దేవుడు అని సేవ్ చేసి పెట్టుకున్నాను అంటూ అప్పారావు తెలియజేశారు. శంకర్ పక్కవారిని ఎంతో ప్రోత్సహిస్తూ ఉండేవారు అయితే ఈయన కెరియర్ పరంగా చేసిన తప్పు కారణంగానే ఇండస్ట్రీలో రాణించలేకపోయారు అంటూ అప్పారావు తెలిపారు.

ఇండస్ట్రీలోకి వచ్చింది నటించడానికి..

Advertisement

సాధారణంగా ఆర్టిస్టులు మంచి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత బయట ఈవెంట్లకు వెళ్లి పెద్ద ఎత్తున సంపాదించుకుంటారు కానీ శంకర్ మాత్రం అలా వెళ్లడానికి ఇష్టపడేవాడు కాదు. మనం ఇండస్ట్రీలోకి వచ్చింది సినిమాలలో నటించడానికి కానీ ఈవెంట్లకు వెళ్లి నటించడానికి కాదు అంటూ ఆయన బయట ఈవెంట్లకు వచ్చేవారు కాదు. ఇలా సినిమాలపై ఆసక్తితోనే బయట ఈవెంట్లకు వచ్చిన అవకాశాలన్నింటిని కూడా వదులుకున్నారు. అలా కాకుండా వచ్చిన అవకాశాలన్నింటిని సద్వినియోగం చేసుకొని ఉంటే షకలక శంకర్ మరో స్థాయిలో ఉండే వారని అప్పారావు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: అల్లు అర్జున్ రాకా సినిమాలో మృణాళ్..త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నా అంటూ !

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×