E-Paper
Advertisement

Keerthy Jaidhanush: గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న బుల్లితెర నటి కీర్తి జై ధనుష్..ఫోటో వైరల్!

Keerthy Jaidhanush: గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న బుల్లితెర నటి కీర్తి జై ధనుష్..ఫోటో వైరల్!
Advertisement

Keerthy Jaidhanush: బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి కీర్తి(Keerthy) ఒకరు. తెలుగు తమిళ సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కీర్తి పెళ్లి తర్వాత పెద్దగా సీరియల్స్ లో కనిపించలేదని చెప్పాలి. కేవలం బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ఉన్నారు. ఇక కీర్తి ప్రముఖ సీరియల్ నటుడు జై ధనుష్(Jai Dhanush) ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జై ధనుష్ ప్రస్తుతం జీ తెలుగు ఈటీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ ద్వారా ఎంతో బిజీగా ఉన్నారు.

రంగం డాన్స్ షోలో పరిచయం..

ఇలా ధనుష్ కీర్తి రంగం డాన్స్ షోలో కలిసి పార్టిసిపేట్ చేశారు ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో 2015వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు రుద్వేధ్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. ఇక బాబు పుట్టిన తర్వాత కీర్తి పూర్తిగా బుల్లితెర సీరియల్స్ కు దూరంగా ఉన్నారు. కేవలం స్పెషల్ ఈవెంట్స్ లో మాత్రమే ఈమె పాల్గొని సందడి చేస్తున్నారు. ఇక తన కుమారుడిని కూడా ఇప్పటికే పలు సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇక కీర్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా తమకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ బిజీగా ఉన్నారు.

మరోసారి తల్లి కాబోతున్న కీర్తి..

Advertisement

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే కీర్తి తాజాగా తన భర్త ధనుష్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన ఈమె త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతోంది అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో అసలు ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటూ అభిమానులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు అయితే త్వరలోనే ఈమె తన రెండవ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేయబోతున్నారని, అదే విషయాన్ని ఇలా షేర్ చేసారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే మరో జూనియర్ కీర్తి రావాలని కోరుకుంటున్నాము అంటూ ఈమె సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

ఇప్పటికే ఒక అబ్బాయికి జన్మనిచ్చిన కీర్తి మరోసారి అమ్మగా మారబోతోందని ఈమె పోస్ట్ చూస్తేనే తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని వెల్లడించబోతున్నట్టు సమాచారం. ధనుష్ కీర్తి కంటే ముందుగా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక కుమార్తె కూడా ఉన్నారు. కీర్తి ధనుష్ కు రెండవ భార్య కావటం గమనార్హం. మరి ఈ జంట త్వరలోనే చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలియాల్సి ఉంది. ఇక కీర్తి స్వయంగా కార్తీకదీపం ఫేమ్ సీరియల్ నటుడు పరిటాల నిరుపమ్ సతీమణి మంజులకు చెల్లెలు అనే విషయం తెలిసిందే. ఇక మంజుల కూడా బుల్లితెర సీరియల్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Also Read: Ram Pothineni: మళ్లీ పెన్ పడుతున్న రామ్… తాలుకా తగలలేదా ఏంటి?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×