E-Paper
Advertisement

Film Shooting Ban: కోఠి ఉమెన్స్ యూనివర్సిటిలో సినిమా షూటింగులపై నిషేదం.. ఒకరిపై సస్పెన్షన్ వేటు

Film Shooting Ban: కోఠి ఉమెన్స్ యూనివర్సిటిలో సినిమా షూటింగులపై నిషేదం.. ఒకరిపై సస్పెన్షన్ వేటు
Advertisement

కోఠిలోని మహిళా వర్సిటీలో మరో వివాదం రాజుకుంది. యూనివర్సిటీ ప్రాంగణంలో సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వడంపై విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్‌ల కారణంగా తమ చదువుకు భంగం కలుగుతోందని.. అంతేకాదు కొందరు సినిమా సిబ్బంది అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు.

షూటింగ్ జరుగుతున్న సమయంలో కొందరు సిబ్బంది వారిని ఇబ్బందులకు గురిచేశారని.. కార్‌వాన్‌లకు పిలిపించి అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. ముఖ్యంగా ఇటీవల ఇద్దరు విద్యార్థినులకు సినిమాల్లో యాక్టింగ్ అవకాశాలు ఇస్తామని ఆశ చూపి కార్‌వాన్‌లోకి తీసుకెళ్లి నిర్బంధించారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో యూనివర్సిటీలో భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ప్రాంగణంలో సినిమా షూటింగ్‌లను పూర్తిగా నిషేధించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. మహిళల భద్రతకు భంగం కలిగేలా ఎలాంటి కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వకూడదని నినాదాలు చేశారు. విద్యార్థినుల ఆందోళన నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు స్పందించారు.

ఈ వ్యవహారంపై ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వినోద్‌ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అవసరమైతే షూటింగ్ అనుమతులపై కూడా పునర్విమర్శ చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

ALSO READ: Usman Kunta Lake: 70 ఎకరాల్లో.. 800 విల్లాలు.. చెరువుని మింగేశారు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×