E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: ఆస్తి కోసం కోర్టు మెట్లేక్కబోతున్న శ్రీయ..అవని, అక్షయ్ లకు టెన్షన్.. పల్లవి ప్లానేంటి..?

Intinti Ramayanam Today Episode: ఆస్తి కోసం కోర్టు మెట్లేక్కబోతున్న శ్రీయ..అవని, అక్షయ్ లకు టెన్షన్.. పల్లవి ప్లానేంటి..?
Advertisement

Intinti Ramayanam Today Episode November 30th: నిన్నటి ఎపిసోడ్ లో..ఆస్తులు మళ్లీ తిరిగి వచ్చాయని అందరూ సంతోషంగా ఉంటారు.. అయితే పల్లవి భానుమతిని తీసుకొని బయటకు వెళ్తుంది.. అసలు తిరిగి వచ్చాయి కదా అమ్మమ్మ.. మా వాటా మాకు ఇవ్వొచ్చు కదా.. లేకపోతే అవని మళ్లీ మావయ్య గారిని మాయ చేసి ఆస్తి మొత్తాన్ని తన పేరు మీద తన మొగుడి పేరు మీద రాయించుకుంటుంది అని అంటుంది.. శ్రియ కూడా శ్రీకర్ తో మనకు ఆస్తి కావాలి అని అడుగుతుంది.. ఆస్తుల కోసం శ్రీయ, పల్లవి గొడవలకు దిగుతారు.. పల్లవి ఆస్తి అంతా అవని పేరు మీదకి వెళ్ళిపోతుంది. మాకేం మిగులుతుంది చెప్పు అనేసి భానుమతిని రెచ్చగొడుతుంది. భానుమతి వెళ్లి కమల్ దగ్గర అడుగుతుంది. ఆస్తులు గురించి నీకెందుకే అసలు నువ్వు ఆస్తులు గురించి మాట్లాడే అర్హతలు కోల్పోయావని పల్లవిని కమల్ తిడతాడు. శ్రీయ ఆస్తి పంపకాల గురించి ఆడుతుంది. ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. ఆస్తులు మళ్లీ రావడంతో ఇంట్లో వాటా కోసం చిన్నపాటి యుద్ధమే చేస్తారు. ముఖ్యంగా శ్రీయ ఆస్తి కోసం చిన్నా, పెద్ద అని తేడా లేకుండా కడిగిపడేస్తుంది. ఆ మాటలకు అందరు ఒక్కసారి షాక్ అవుతారు. భానుమతి అరే రాజేంద్ర ఆస్తుల కోసం ఇంత గొడవలు జరుగుతున్నాయి. అక్షయ్ అవనీలకు ఎంత హక్కు ఉందో మిగిలిన వాళ్లకు కూడా అంతే హక్కు ఉంది అని అంటుంది. అమ్మమ్మ గారు కూడా చెప్తున్నారు కదా మామయ్య మీరేం మాట్లాడరేంటి అని శ్రీయా అడుగుతుంది. మీరు ఇంతగా అడుగుతున్నావ్ కాబట్టి చెప్తున్నాను.. ఈ ఇళ్లు ఆస్తులు అన్ని కూడా నా కష్టార్జితం నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు. వీటి మీద ఎటువంటి హక్కులు లేవు అని రాజేంద్ర ప్రసాద్ అంటారు..

Advertisement

ఆ మాట వినగానే శ్రీయ షాక్ అవుతుంది. ఏం అన్నారు. మీ ఉద్దేశం ఏంటో బాగా అర్థమైంది మీరు అవనికి అక్షయ్ కి ఇవ్వాలని అనుకుంటున్నారు. మొత్తానికి ఇంట్లో ఆస్తి కోసం పెద్ద గొడవలు జరుగుతాయి. ఆస్తులు గురించి మీరేమీ మాట్లాడొద్దు. అవని అక్కే ఇలాంటివన్నీ చేసిందేమో అని శ్రీయా అంటుంది. మీనాక్షి, ఆరాధ్య ఒక్కటిగా మాట్లాడతారు. ఆ మాట వినగానే శ్రీయ నీకు ఎవరు ఎదురు తిరగడానికి వీలులేదు అని అప్పుడే ఒక టీం ని కూడా రెడీ చేసుకున్నావా అని అంటుంది..

అక్షయ్ మాత్రం రాజేంద్రప్రసాద్ ఎందుకు ఇలా చేస్తున్నాడు.. ఒకప్పుడు మన వద్దన్నా సరే ఆస్తులు పంచాలి అని అన్నాడు. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు వద్దని అనుకుంటున్నాడో అర్థం కావట్లేదు అని అంటాడు. ఈ విషయం ఎలాగైనా సరే నేను నాన్నను అడిగే తెలుసుకుంటాను అని అక్షయ్ అంటాడు… అవని అక్షయ్ ఇద్దరూ రాజేంద్రప్రసాద్ దగ్గరికి వెళ్లి ఆస్తులు పంపకాల గురించి మరోసారి అడుగుతారు. మిమ్మల్ని ఎవరేమన్నా సరే మీరు పట్టించుకోవద్దు.. ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని రాజేంద్రప్రసాద్ అంటాడు.

Advertisement

Also Read :అయ్యో.. ప్రభావతి, మనోజ్ నిమ్మకాయ భయం.. మరొక దొంగతనం.. బయటపడతారా?

మీనాక్షి శ్రీయా అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతేని ఇక్కడ సమస్యలన్నీ తగ్గిపోతాయని అనుకుంటుంది. తర్వాత రోజు ఉదయం ఎవరు లేవక ముందే వెళ్లిపోవాలని అనుకుంటుంది. మీనాక్షి గదిలోంచి బయటికి రాగానే అక్కడ అవన్నీ నిలబడుకుని ఉంటుంది. అవని నువ్వు ఇలాంటివి ఏదో చేస్తావని అనుకున్నాను.. ఇప్పుడు వెళితే ఈ సమస్యల్ని మరింత పెద్ద వి అవుతాయి తప్ప తగ్గవు అని అంటుంది. ఇప్పుడు ఆ చక్రధారిని అరెస్ట్ చేయించాం. నువ్వు బయటికి వెళ్తే కచ్చితంగా నేను ఏదో ఒకటి చేస్తాడని అవని అంటుంది. వీళ్ళ మాటలని అక్షయ విన్నట్లు తెలుస్తుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఆస్తులు కోసం ఇంకెన్ని గొడవలు జరుగుతాయో చూడాలి.. ఇప్పటివరకు ఈ సీరియల్ ఎత్తుకు పై ఎత్తు అన్నట్లుగా సాగింది. ఇకముందు ఆస్తుల కోసం గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రస్తుతం జరుగుతున్న స్టోరీ ని చూస్తే తెలుస్తుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×