E-Paper
Advertisement

Delhi News: ఢిల్లీలో ఘోరం నాలుగు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి, ఇంకా

Delhi News:  ఢిల్లీలో ఘోరం నాలుగు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి, ఇంకా
Advertisement

Delhi News: ఢిల్లీలోని నాలుగు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాతపడగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అసలు ప్రమాదం ఎలా జరిగింది?

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం, నలుగురు మృతి

Advertisement

దక్షిణ ఢిల్లీలోని సంగం విహార్‌లోని ఓ పాదరక్షల షాపులో శనివారం భారీ అగ్నిప్రమాదంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. బాధితుల్లో ఇద్దరు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు.

మిగతా ఇద్దరు వ్యక్తులు 38 ఏళ్ల అనిత, మరొకరు 38 ఏళ్ల సతేందర్‌గా గుర్తించారు. శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న పాదరక్షల దుకాణం నుండి మంటలు చెలరేగాయి. ఆ తర్వాత క్రమంగా భవనాన్ని చుట్టిముట్టాయి. ఘటన నుంచి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు.

Advertisement

మంటల్లో కాలిబూడిదైన చెప్పుల దుకాణం

ప్రమాదానికి గల కారణాన్ని పరిశీలించడానికి ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మంటలు ఎలా ప్రారంభమయ్యాయో తెలుసుకోవడానికి దర్యాప్తులో నిమగ్నమయ్యారు అధికారులు.

ఘటన జరిగిన దుకాణం పక్కన గదిలోని ఒక కుటుంబం నివసించింది. ఆ గదిలో రెండు కాలిపోయిన మృతదేహాలను కనుగొన్నామని తెలిపారు. భవనానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో అగ్నిమాపక చర్యకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. భవనంలో ఒకే ఒక ఎంట్రీ, అదే ఎగ్జిట్ కూడా ఉంది.

ALSO READ: కర్ణాటకలో సీఎం మార్పు లేనట్టే, కలిసిపోయిన నేతలు

దానికితోడు ఇరుకైన మెట్లు, వెంటిలేషన్ లేకపోవడంతో అందులోని వ్యక్తులు తప్పించుకునే మార్గం లేకపోయింది. ఫలితంగా భవనం అంతా దట్టమైన పొగ వ్యాపించింది. లోపల ఉన్నవారికి బయటకు రావడానికి మార్గం లేకుండా పోయిందని చెప్పారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో దాదాపు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×