E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి షాకిచ్చిన శ్రీయా.. భానుమతిని రెచ్చగొట్టిన పల్లవి.. ఆస్తి కోసం ఇంట్లో గొడవలు..

Intinti Ramayanam Today Episode: పల్లవికి షాకిచ్చిన శ్రీయా.. భానుమతిని రెచ్చగొట్టిన పల్లవి.. ఆస్తి కోసం ఇంట్లో గొడవలు..
Advertisement

Intinti Ramayanam Today Episode November 28th: నిన్నటి ఎపిసోడ్ లో..పల్లవి తన తండ్రిని అవని అరెస్ట్ చేయించిందని చాలా కోపంగా ఉంటుంది. ఇంట్లోనే వాళ్ళందరి మీద అంతకంత పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. అప్పుడే వచ్చిన అవని మాత్రం మీ నాన్న ఏమైనా మంచివాడు అనుకున్నావా మంచి వాడిని అరెస్ట్ చేశారు కదా అని బాధపడ్డానికి.. ఒక దుర్మార్గుడు ఎంతో మంది కుటుంబాలను నాశనం చేశాడు. అలాంటి వాడిని అరెస్ట్ చేయడం కాదు చంపేసిన తప్పులేదు అని అంటుంది.. ఇకమీదటైనా నువ్వు బుద్ధిగా ఉండు లేదంటే మీ నాన్న దగ్గరికి నువ్వు కూడా వెళ్తావని వార్నింగ్ ఇస్తుంది.. మా నాన్న గురించి తప్పుగా మాట్లాడతావా మీ నాన్న ఎవరో తెలుసుకొని అతన్ని అరెస్ట్ చేసేలా చేస్తాను అని పల్లవి అంటుంది.

పల్లవి తన తండ్రిని కలవడానికి పోలీస్ స్టేషన్కు వెళుతుంది.. అయితే పల్లవి తన తండ్రిని జైల్లో చూసి బాధపడుతూ ఉంటుంది.. డాడ్ మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మీరు ఎలాంటి వారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని పల్లవి అడుగుతుంది. అవని మీనాక్షి ల గురించి పల్లవికి నిజం చెప్పిన చక్రధర్ డాక్యుమెంట్స్ గురించి కూడా చెప్తాడు.. తన ఆస్తికి మనకి రావాలి అంటే ఆ డాక్యుమెంట్లు కొట్టేయాలని చెప్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. తన తండ్రిని అరెస్ట్ చేయించింది అవని అని పల్లవి కోపంగా ఉంటుంది. అలా పల్లవిని చూసిన మీనాక్షి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది.. నిన్ను పల్లవి చూడడం నేను చూశానమ్మా నిన్ను ఏదైనా చేపిస్తుందేమో… నాన్న నేను అరెస్ట్ చేయించావు కదా నీ మీద పగతో రగిలిపోతున్నట్లు ఉంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని మీనాక్షి అంటుంది. ఎన్ని ప్లాన్ వేసినా తన మెడకే చుట్టుకొని అవి రివర్స్ అవుతున్నాయి అమ్మ నువ్వేం కంగారు పడకు అని అంటుంది.. ఇక పల్లవి లోపల టెన్షన్ పడుతూ ఉంటుంది.. పల్లవిని చూసిన భానుమతి ఏంటే టెన్షన్ పడుతూ అలా తిరుగుతున్నావ్ ఏంటి అని అడుగుతుంది.

ఏం లేదు అమ్మమ్మ మా నాన్న అరెస్టయి జైల్లో ఉంటే నేను ఈడ పిండి వంటలు చేసుకుని పండగ చేసుకోమంటావా అని పల్లవి అంటుంది.. మా నాన్న అరెస్టవడానికి కారణం మీనాక్షి, అవనీలు..వాళ్లు అన్యాయంగా మా డాడీ ని ఇరికించారు అని పల్లవి అంటుంది.. నా అల్లుడిని ఇంత మోసం చేసి ఇరికించారా? ఆ మీనాక్షిని ఇప్పుడే వెళ్లి బయటికి గెంటేస్తాను అని భానుమతి అంటుంది.. నువ్వు కూడా నా మొగుడు లాగే ఆవేశ పడతావ్ ఏంటి..? కాస్త ఆలోచించి మనం ప్లాన్ ప్రకారం చేయాలి అని ఒక ప్లాన్ ని భానుమతికి చెప్తుంది. మా డాడీ ని బయటికి తీసుకురావడానికి శ్రీయ సాయం చేస్తుందేమో అని అడగడానికి వెళ్తుంది. కానీ ప్రియ మాత్రం ఈ పల్లవికి సాయం చేసి వాళ్ళ నాన్నని బయట తీసుకొని వస్తే.. మళ్ళీ నా నెత్తి మీద కూర్చుంటుంది అలా జరగకుండా చూడాలి అని అంటుంది.

Advertisement

ఇక ఉదయం పల్లవి నా ఎడమ కన్ను అదురుతుంది అని అనుకుంటుంది.. ఆడవాళ్ళకి ఎడమ కన్ను అదిరితే శుభం జరుగుతుంది అని భానుమతి అంటుంది. అప్పుడే ఇంట్లోకి లాయర్ వస్తారు రాజేంద్రప్రసాద్ అక్షయ్ ని పిలుస్తారు. మీరు పోగొట్టుకున్న ఆస్తులు అన్ని మళ్లీ మీకు వస్తాయి. ఈ కేసు కోర్టులో రుజువైంది. ఆ చక్రధర్ ఫ్రాడ్ చేసి మీ ఆస్తులను కొట్టేసాడని తేలింది. మరికొన్ని రోజుల్లో పోలీసులు మీ ఆస్తులని మీకు దగ్గర ఉండి అప్పగిస్తారు అని అంటాడు. మీరు మంచి శుభవార్త చెప్పారు లాయర్ గారు చాలా థాంక్స్ అని అవని అంటుంది. ఇందులో నాదేముందమ్మ మీరు పోగొట్టుకుని ఆస్తులు ఆ దేవుడి మీకు తిరిగి ఇచ్చారు. ఆయనికి దండం పెట్టుకోండి అనేసి అంటాడు..

Also Read : బాలు ప్లాన్ వర్కౌట్.. మనోజ్ కు షాక్.. ప్రభావతి దొరికిపోతుందా..?

ఆస్తులు మళ్లీ తిరిగి వచ్చాయని అందరూ సంతోషంగా ఉంటారు.. అయితే పల్లవి భానుమతిని తీసుకొని బయటకు వెళ్తుంది.. అసలు తిరిగి వచ్చాయి కదా అమ్మమ్మ.. మా వాటా మాకు ఇవ్వొచ్చు కదా.. లేకపోతే అవని మళ్లీ మావయ్య గారిని మాయ చేసి ఆస్తి మొత్తాన్ని తన పేరు మీద తన మొగుడి పేరు మీద రాయించుకుంటుంది అని అంటుంది.. శ్రియ కూడా శ్రీకర్ తో మనకు ఆస్తి కావాలి అని అడుగుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఆస్తుల కోసం శ్రీయ, పల్లవి గొడవలకు దిగుతారు..ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×