E-Paper
Advertisement

Vizag News: విశాఖలో మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్‌హామ్, పాఠశాల సందర్శన, స్టూడెంట్స్ ఫుల్‌ఎంజాయ్

Vizag News: విశాఖలో మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్‌హామ్,  పాఠశాల సందర్శన, స్టూడెంట్స్ ఫుల్‌ఎంజాయ్
Advertisement

Vizag News: డేవిడ్ బెక్‌హామ్.. ఈ పేరు స్పోర్ట్స్ అభిమానులకు సుపరిచితం. ఆయన్ని ఒక్కసారైనా చూడాలని ఉవ్విల్లూరుతుంటారు. అలాంటి ఏకంగా ఆయన విశాఖపట్నంలో  ఓ పాఠశాలను సందర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. ఇంతకీ ఆయన ఎందుకొచ్చినట్టు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

విశాఖలో మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్‌హామ్

Advertisement

లెజెండరీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ బెక్‌హామ్ రెండోసారి ఇండియా పర్యటనకు వచ్చాడు. విశాఖపట్నం సమీపంలోని కొత్తవలస ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించాడు. ఆయన ఫుట్‌బాల్ గురించి చెప్పిన మెళకువలు విద్యార్థులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.  డేవిడ్ బెక్‌హామ్ ప్రస్తుతం యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌ హోదాలో ఉన్నారు.

ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలను ఆయన సందర్శిస్తున్నాడు. నవంబర్ 26న కొత్తవలసలో మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించాడు. పాఠశాల ఆవరణలో విద్యార్థులతో ఫుట్‌బాల్ ఆడాడు. ఆ తర్వాత వారితో కలిసి ఒక చెట్టును నాటాడు. ఈ విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు డేవిడ్ బెక్‌హామ్.

Advertisement

నాలుగు గంటలపాటు పాఠశాల విద్యార్థులతో

బెక్‌హామ్ పాఠశాల విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించాడు. తరగతి గదులకు వెళ్లి వారితో కలిసి మాట్లాడాడు. ప్లే గ్రౌండ్‌లోకి వెళ్లి వారితో పుట్ బాల్ గురించి మెళుకువలు చేసి చూపించాడు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారితో ఆడిపాడాడు. దాదాపు నాలుగు గంటలపాటు ఆ పాఠశాలలో ఆయన గడిపాడు. ఇది నిజంగా చాలా మంచి రోజని, విద్యార్థులతో చాలా సరదాగా గడిపానని రాసుకొచ్చాడు.

ఎడ్యుకేషన్ ఎబౌవ్ ఆల్ చొరవతో ప్రారంభించబడిన మంత్ర 4 చేంజ్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ పర్యటన చేపట్టాడు. మంత్ర 4 చేంజ్ ఉపాధ్యాయ శిక్షణకు మద్దతు ఇస్తుంది. తరగతి గదులను ఆధునీకరిస్తుంది. విద్యార్థులకు మెరుగైన అభ్యాస వాతావరణాన్ని కల్పిస్తుంది.

ALSO READ: మెగా వేలంలో కలకలం.. గుజరాత్ జట్టులోకి అనుష్క శర్మ

ఈ ఫౌండేషన్.. ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, ఒడిశా, బీహార్‌తో సహా అనేక రాష్ట్రాల్లో తరగతి గదులు, విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.  డేవిడ్ బెక్‌హామ్.. ప్రభుత్వ పాఠశాల సందర్శించిన వీడియో మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు.  బెక్‌హామ్ రాకతో విద్యార్థుల్లో కొత్త స్ఫూర్తిని నింపాయని రాసుకొచ్చారు.

రెండేళ్ల కిందట అంటే 2023, నవంబర్‌లో డేవిడ్ బెక్‌హామ్ఆ భారత్‌కి వచ్చాడు. ఆ సమయంలో UNICEF గుడ్‌విల్ అంబాసిడర్‌గా గుజరాత్‌కు వెళ్లాడు. అక్కడ బాల్య వివాహాలను నిరోధించడం, విద్యను విస్తరించడం, నాయకత్వ అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా చేసుకున్న బాలికలతో మాట్లాడాడు. ఆ సమయంలో ICC ప్రపంచ‌కప్-2023 సెమీఫైనల్‌ మ్యాచ్‌కు హాజరయ్యాడు. మ్యాచ్‌కు ముందు సచిన్, విరాట్ కోహ్లీలతో మాట్లాడాడు కూడా.

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×