E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: వీడియోను చూసి అంతా షాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్.. అవని స్ట్రాంగ్ వార్నింగ్..

Intinti Ramayanam Today Episode: వీడియోను చూసి అంతా షాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్.. అవని స్ట్రాంగ్ వార్నింగ్..
Advertisement

Intinti Ramayanam Today Episode November 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ అవని బయలుదేరారని తెలుసుకున్న చక్రధర్ వాళ్ళని ఎలాగైనా సరే హాస్పిటల్కి పంపించాలని అనుకుంటారు.. మనుషులని అక్కడికి పంపించి వాళ్ళని కొట్టాలని అంటారు కానీ అక్షయ్ అవని ఇద్దరు కూడా ఆ రౌడీల నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తారు… అక్షయ్ తన కేసు గురించి పూర్తి వివరాలను కనుక్కోమని తన ఫ్రెండ్ కు చెప్తాడు. అప్పుడే కమల్ పోలీస్ స్టేషన్ కి కమల్ అవనిని మోసం చేసిన వ్యక్తిని తీసుకొని వస్తాడు.. వీడు ఎక్కడ దొరికాడు అని కమల్ ను అడుగుతాడు అక్షయ్.. వీడు మారిన కొత్త ఇంటికి ఎలక్ట్రిషన్ గా నన్ను బుక్ చేసుకున్నారు వీన్ని గుర్తుపట్టి తీసుకొచ్చాను అని కమల్ నిజం చెప్తాడు.

ఆ వ్యక్తి భయపడి నిజం చెప్తానని అంటాడు.. అతను ఒక వీడియోను చూపిస్తాడు చక్రధర్ పల్లవి ఇద్దరు కూడా అడ్డంగా దొరికిపోతారు… పల్లవి తన తండ్రి కి సపోర్ట్ చేసిందని తెలుసుకున్న కమల్ ఆవేశంగా పల్లవిని బ్రతకనిచ్చేది లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కమల్ ఆవేశం చూసినా అక్షయ్ అవని ఇద్దరు కూడా ఏదో ఒకటి చేస్తాడని బయలుదేరుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. కమల్ పల్లవి తన తండ్రికి సపోర్ట్ చేసిందని తెలుసుకుని ఇవాళ దాని సంగతి చెప్తాను అని ఆవేశంగా ఇంటికి బయలుదేరుతాడు. కమల్ ఆవేశంగా వెళుతున్నాడు పల్లవిని ఏదో ఒకటి చేస్తాడు మనం వెళ్దాం పదండి అనేసి అవని అంటుంది. అయితే మధ్యలో అవనివల్ల స్కూటీకి పెట్రోల్ అయిపోవడంతో కాసేపు ఆగుతారు. అప్పుడే కమల్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. పల్లవి అని కేకలు పెట్టి అరుస్తాడు. ఏమైందిరా ఎందుకలా అరుస్తున్నావ్ పిచ్చి పట్టిందా ఏంటి అని అక్కడున్న అందరూ అడుగుతారు.

నాకు పిచ్చి పట్టదు ఇప్పుడు నేను చెప్పింది కనుక మీరు వింటే మీకు పిచ్చి పడుతుంది అని కమల్ ఆవేశంగా మాట్లాడుతాడు. పల్లవి రాగానే ఏంటి బావ ఎందుకు అరుస్తున్నావ్ అని అడుగుతుంది. పల్లవిని కొట్టబోతాడు. ఏమైందో చెప్పరా ఎందుకురా అనేసి పార్వతి అడుగుతుంది.. పోలీస్ స్టేషన్లో చూపించిన వీడియోని కమల్ అందరికీ చూపిస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ తలా ఒక మాట పల్లవిని అంటారు. క్రిమినల్ బ్రెయిన్ ఉన్నదానివని అస్సలు ఊహించలేదు అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు..

Advertisement

ఇలా నెమ్మదిగా మాట్లాడితే అది మాట వినదు నాన్న దీని అంత చూస్తాను ఇవాళ అనేసి కమల్ పల్లవిని చంపేందుకు అక్కడున్న వస్తువుని తీసుకుంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన అవని అక్షయ్ ఇద్దరు కూడా కమల్ ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ కమల్ మాత్రం ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినకుండా పల్లవి అంతు చూడాల్సిందే అని ఆవేశపడుతూ ఉంటాడు. అవని ఏంటి కన్నయ్య నీకు పిచ్చి ఏమైనా పట్టిందా అని చెంప పగలగొడుతుంది. చేసింది తప్పే కానీ నువ్వు చంపాలని చూస్తావా ఏంటి అని అడుగుతుంది.

ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచకూడదు బయటికి పంపించాలి అని పల్లవిని బయటికి లాక్కొని వెళ్తాడు కమల్.. ఆగు బావ నేను చేసిన తప్పేంటి అని కమల్ అడుగుతుంది. వీడియోని చూసి మీరు నన్ను తప్పు అనుకుంటే.. ఒక వీడియోను చూపిస్తాను అది చూసి మీరు ఏమంటారు చూస్తానని ఇంకొక వీడియోని పల్లవి చూపిస్తుంది.. అది చూసిన వాళ్ళందరూ షాక్ అవుతారు.. పల్లవి ఎడిటింగ్ చేసిన వీడియో ని చూపిస్తుంది. దాంతో పల్లవి తప్పేమీ లేదని అందరూ కూల్ అవుతారు.

Also Read : హీరో విశాల్ కు షాకిచ్చిన హైకోర్టు.. వడ్డీతో సహా కట్టాల్సిందే..

పల్లవి లోపలికి వెళ్ళగానే అవని వస్తుంది. ఏంటి నన్ను ఏదో చేసేస్తాడని నువ్వు చాలా సంతోష పడినట్టు ఉన్నావు. అక్కడ జరిగింది చూసి షాక్ అయినట్లు ఉన్నావే అని అంటుంది. ఇప్పుడు నువ్వు తప్పించుకోవచ్చు కానీ ఇకముందు తప్పించుకోవడం కుదరదు అని అవని అంటుంది. మా నాన్నని అదే మీ నాన్నని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్తున్నారు అని అంటుంది.. అక్షయ్ కి అభి ఫోన్ చేసి అన్ని చేసింది చక్రధరని రుజువైంది మేము అతని అరెస్ట్ చేసేందుకు అతని ఇంటికి వెళ్తున్నాము అని అంటాడు. అక్షయ్ ఇంట్లోని వాళ్ళందరిని తీసుకొని అక్కడికి బయలుదేరుతారు.. చక్రధర్ ని అరెస్ట్ చేసేందుకు అభి అన్ని సిద్ధం చేస్తాడు.. నువ్వు ఇంకా తప్పించుకోవడం కుదరదు అని చక్రధర్ ని అరెస్ట్ చేస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×