E-Paper
Advertisement

Fake iPhone Scam: దేశంలో నకిలీ ఫోన్ల విక్రయాలు.. ఒకేసారి 100కు పైగా ఐఫోన్లు డెడ్..

Fake iPhone Scam: దేశంలో నకిలీ ఫోన్ల విక్రయాలు.. ఒకేసారి 100కు పైగా ఐఫోన్లు డెడ్..
Advertisement

Fake iPhone Scam| దేశంలో నకిలీ స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు సాగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌రాష్ట్రంలోని సహారన్‌పూర్ నగరంలో ఒక భారీ ఐఫోన్ మోసం బయటపడింది. నెహ్రూ మార్కెట్‌లో ఉన్న “గీతాంజలి ఎంటర్‌ప్రైజెస్” అనే షాప్ నుంచి 100 మందికి పైగా కస్టమర్లు ఐఫోన్లు కొనుగోలు చేశారు. కానీ కొన్ని రోజుల తరువాత అన్ని ఫోన్లు ఒకేసారి పనిచేయడం మానేశాయి. ఫోన్ ఆన్ కావడం లేదు, రీస్టార్ట్ అవుతూ ఆగిపోతోందని కస్టమర్లు వాపోతున్నారు. ఫోన్ పేమెంట్ పూర్తిగా చేసినా షాప్ ఓనర్ బాధ్యత తీసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.

మోసం ఎలా జరిగిందంటే..

షాప్ ఓనర్ “ఈజీ EMI” పేరుతో చాలా తక్కువ డౌన్ పేమెంట్‌కే ఐఫోన్ 14, 15 మోడల్స్ ఇస్తామంటూ ఆకర్షణీయ ఆఫర్లు పెట్టారు. కస్టమర్లు ఈ స్పెషల్ ఆఫర్ చూసి తక్కువ ధరకే ఐఫోన్ కొనుగోలు చేశారు. కానీ 3 -4 రోజులకే ఫోన్ ఆటోమాటిక్‌గా రీసెట్ అయి షట్‌డౌన్ అయిపోయింది. మళ్లీ ఆన్ చేసినా పనిచేయడం లేదు. నిజానికి ఈ ఫోన్లన్నీ పాతవి, రిఫర్బిష్డ్ (మళ్లీ రిపేర్ చేసినవి) అని తెలిసింది. కొత్తవిగా చూపించి మోసం చేశారు. అందులోనూ ఈ ఫోన్ లోని భాగాలు నకిలీవి.

Advertisement

కస్టమర్లు కోపంతో షాప్ ముందు గుమిగూడి నిరసన తెలిపారు. అనంతరం అందరూ కలిసి సహారన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఫిర్యాదులో ఏముంది?

బాధితుల ఫిర్యాదు ప్రకారం.. షాప్ ఓనర్ తన బాధ్యత లేదంటూ తప్పించుకుంటున్నాడు. పైగా ఫోన్ రిపేర్ల కోసం రూ.2,000 నుంచి రూ.3,000 అవుతుందని కస్టమర్లు మరింత చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు. అంతేకాకుండా ముందు అందరూ EMI పేమెంట్ చేయాలని అప్పుడే రిపేర్ అవుతాయని బెదిరించాడు. ఈఎంఐలు చెల్లించిన వారికి ఐఫోన్స్ తాత్కాలికంగా రీసెట్ చేసి ఇచ్చాడు – కానీ మళ్లీ కొద్ది రోజుల్లోనే అవి డెడ్ అయిపోయాయి.

ఇలాంటి మోసాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?

  • ఎప్పుడూ ఆపిల్ అధికారిక స్టోర్ లేదా అథరైజ్డ్ రీసెల్లర్ నుంచే కొనండి (ఇండియాలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో ఆపిల్ స్టోర్స్ ఉన్నాయి).
  • apple.com/india వెబ్‌సైట్ నుంచి డైరెక్ట్‌గా ఆర్డర్ చేయొచ్చు. అక్కడ కొనుగోలు చేయడం 100 శాతం సేఫ్.
  • అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో “Sold by Apple” లేదా అథరైజ్డ్ సెల్లర్ నుంచి మాత్రమే కొనాలి.
  • ఎప్పుడూ బిల్లు తీసుకోండి. బిల్లులో IMEI నంబర్, మోడల్ నంబర్ సరిగ్గా ఉన్నాయా? లేదా? అని చెక్ చేయండి.
  • ఫోన్ తీసుకున్న వెంటనే సెట్టింగ్స్ – జెనెరల్ – అబౌట్ లో ఐఎంఇఐ (Settings → General → About లో IMEI) చూసి బిల్లుతో మ్యాచ్ చేయండి.
  • కొత్త ఫోన్ అయితే సెట్టింగ్స్ – బ్యాటరీ – బ్యాటరీ హెల్త్ లో (Settings → Battery → Battery Health లో “Maximum Capacity”) మాగ్జిమమ్ కెపాసిటి 100 శాతం ఉండాలి.
  • apple.com/checkcoverage అనే సైట్‌లో IMEI నెంబర్ ఎంటర్ చేసి వారంటీ, యాక్టివేషన్ డేట్ చెక్ చేయండి.
Advertisement

చవక ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు చూపించి మోసం చేసే లోకల్ షాపుల నుంచి ఫోన్లు కొనుగోలు చేయడం మానండి. మీ కష్టార్జితం డబ్బు సేఫ్‌గా ఉండాలంటే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి.

Also Read: ఐఫోన్ పోగొట్టుకున్నారా? లేదా చోరీ అయిందా? ఆపిల్ కొత్త ఐఫోన్ ఇస్తోంది.. వారికి మాత్రమే

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×