E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. మీనాక్షికి ఘోర అవమానం.. చక్రధర్ కు షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. మీనాక్షికి ఘోర అవమానం.. చక్రధర్ కు షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode November 23 rd: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని, మీనాక్షి మాట్లాడుకుంటున్న విషయాన్ని అక్షయ్ వినలేదని అవని రిలాక్స్ ఉంది. అక్షయ్ అత్తయ్య గారు మీరు మీ వారి గురించి చెప్పకపోయినా పర్లేదు నేను మీకు ఎప్పుడూ సపోర్ట్ గానే ఉంటాను. ఆ దుర్మార్గుడు మిమ్మల్ని బాధ పెడుతున్నాడు అంటే చెప్పండి నేను వాడు అంతు చూస్తానని మీనాక్షికి ధైర్యం చెప్తాడు.. ఇక రాత్రి అవ్వగానే కమల్ బిర్యానీ తీసుకొని పల్లవి దగ్గరికి వస్తాడు. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం బావ నాకు కూడా పెట్టవా అని పల్లవి అడుగుతుంది. కమల్ పల్లవికి ఊరించి మరీ మొత్తం తినేస్తాడు. అది చూసిన పల్లవి షాక్ అవుతుంది. ఏంటి బావ మొత్తం తినేసావు నాకు లేకుండా అని కమల్ ని పల్లవి అడుగుతుంది. మరీ అంత శాడిస్ట్ ని కాదు అందులో ఇంకొక పార్సల్ ఉంది నువ్వే తినేసేయ్ అని అంటాడు. అయితే పల్లవి ఆదాన్ని ఓపెన్ చేసి ఇది పెరుగన్నం బిర్యానీ కాదు అని అంటుంది..

ఒక బిర్యానీ ఒక పెరుగన్నం తెచ్చుకున్నాను. అయితే బిర్యానీ తినేసాను కడుపు నిండింది ఇంకా పెరుగన్న మిగిలిందిగా నువ్వు తినే అనేసి అంటాడు.. ఇలా చేస్తావని నేను అసలు ఊహించలేదు బావ అని పల్లవి నిరాశపడుతుంది. పల్లవి ఇక బయటికి రాగానే కాలుజారి కింద పడిపోతుంది.. అమ్మ అని అరవగానే మీనాక్షి పరిగెత్తుకుంటూ వెళ్లి పల్లవికి నూనె రాసి కొంచెం నొప్పి తగ్గించేస్తుంది.. పల్లవి మాత్రం మీనాక్షి చేసిందని పక్కన పెట్టేసి కావాలనే మీనాక్షిని బాధ పెట్టేలా చేస్తుంది. అది చూసిన అవని మా అమ్మని ఇలా మాట్లాడతావా అని చెంప పగలగొడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. చక్రధర్ ఇలాంటి పని చేశాడు అంటే బాధగా ఉందని ఆలోచిస్తూ ఉంటాడు..రాజేంద్ర ప్రసాద్ దిగులుగా కూర్చోవడంతో అక్కడికి వచ్చిన అక్షయ్ ఏమైంది నాన్న అలా ఉన్నారు అంటే సొంత వాళ్లే నాకు వెన్నుపోటు పొడిచారంటే నా గుండె రగిలిపోతుంది. మండుతుంది అని అంటాడు. అవని మీరు ఎటువంటివి ఆలోచించకుండా ఉండండి.. మీరు ముందు ఈ మాత్రలు వేసుకోండి అని అవని అంటుంది.. అప్పుడే అక్షయ్ ఫోన్ కి ఒక మెసేజ్ రావడం చూసి అక్షయ్ చాలా సంతోషపడతాడు.. నా ఫ్రెండు ఎస్ఐ గా ఈ ఊరికి బాధ్యతలు తీసుకొని వస్తున్నాడు మన సమస్యలు ఇక తీరిపోతాయి వాడు చాలా నిజాయితీగా ఉంటాడు అని అంటాడు.. అయితే వెళ్లి మనం వాన్ని కలుద్దాము మన సమస్యను చెబుదాము ఇక మన ఇల్లు ఆస్తులను పోగొట్టిన వాళ్ళు ఎవరో తెలుసుకుందామని అక్షయ్ అంటాడు.. పల్లవి ఆ విషయాన్ని చక్రధర్ తో చెప్తుంది..

ఇక అవని కొట్టిన విషయాన్ని భానుమతి దగ్గర చెప్పేస్తుంది పల్లవి. నన్ను ప్రతి చిన్న విషయానికి కొట్టడం ఏంటి అమ్మమ్మ. ఎందుకు నన్ను అవని కొడుతుంది వాళ్ళ అమ్మ గురించి నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా వాళ్ళ నాన్న లేడు అని చెప్పాను కదా.. అసలు భర్తని వాడుంటే ఎవరైనా చెప్పుకోకుండా ఎలా ఉంటారు అని పల్లవి కావాలని భానుమతిని రెచ్చగొడుతుంది. పల్లవి మాట విన్న భానుమతి నువ్వు చెప్పింది నిజమేనే ఆవిడ ఎందుకు నోరు విప్పలేదు అర్థం కావటం లేదు అని అంటుంది.

Advertisement

మొగుడు ఎవరో తెలియదు అలాంటిది అక్రమ సంబంధం పెట్టుకుని పిల్లల కన్నా తల్లి మన ఇంట్లో ఉంది అంటే మన ఇంటికి అవమానం అని పల్లవి కావాలని భానుమతికి లేనిపోనివి చెప్పి మనసు మార్చేస్తుంది. తర్వాత రోజు అక్షయ అవని ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని అనుకుంటారు. దుర్గా మీనాక్షి రావడం చూసి భానుమతి కాస్త ఆగి మంచినీళ్లు తాగి వెళ్లండి అని అంటుంది. నేను మొగుడు లేని దానిని నా కొడుకు ఎప్పుడైనా పని మీద బయటకు వెళ్తుంటే ఎందుకు అని నేను ఎప్పుడూ ఎదురు రాను అని భానుమతి అంటుంది.

ఏంటి అమ్మమ్మ గారు మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు అని అవని అంటుంది. భానుమతికి సపోర్టుగా పల్లవి అమ్మమ్మ అన్నదాంట్లో తప్పేమీ లేదు కదా అని అంటుంది. ఎవరు అలాంటి వాళ్ళో తెలియదు కదా ఏమన్నా జరగరానిది జరిగితే మళ్ళీ ఎవరు మనమే కదా బాధపడాలి అని అంటుంది. నేను నోరు మూసుకో అవని అంటుంది. పల్లవి అన్న దాంట్లో తప్పేముంది అక్క అని శ్రియ మాట్లాడుతుంది. అమ్మమ్మ కూడా నిజమే చెప్పింది కదా ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియకుండా ఎదురుగా వచ్చిన తర్వాత మనం బయటికి వెళ్తే ఏదైనా జరుగుతుందేమో అని అంటుంది.

Also Read : రోహిణికి ఘోర అవమానం.. మనోజ్ పని అవుట్.. బయటపడ్డ మరో నిజం..

వీళ్ళందరి మాట విన్న మీనాక్షి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తల్లి ఎప్పుడూ బిడ్డలా మంచినే కోరుకుంటుంది. చెడును కోరుకోదు కదా నేను అంతే నా తల్లి ఎదురుగా వచ్చింది అంటే నేను మంచిగానే ఫీల్ అవుతాను అని అవని వెళ్ళిపోతుంది. అక్షయ్ అవని బయలుదేరారని తెలుసుకున్న చక్రధర్ వాళ్ళని ఎలాగైనా సరే హాస్పిటల్కి పంపించాలని అనుకుంటారు.. మనుషులని అక్కడికి పంపించి వాళ్ళని కొట్టాలని అంటారు కానీ అక్షయ్ అవని ఇద్దరు కూడా ఆ రౌడీల నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తారు… అక్షయ్ తన కేసు గురించి పూర్తి వివరాలను కనుక్కోమని తన ఫ్రెండ్ కు చెప్తాడు. అప్పుడే కమల్ పోలీస్ స్టేషన్ కి కమల్ అవనిని మోసం చేసిన వ్యక్తిని తీసుకొని వస్తాడు.. అతను ఒక వీడియోను చూపిస్తాడు చక్రధర్ పల్లవి ఇద్దరు కూడా అడ్డంగా దొరికిపోతారు అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×