// // Tirumala laddu Adulterated Ghee: తిరుమల కల్తీ నెయ్యి కేసు.. ఏకంగా 20 కోట్ల లడ్డూల తయారీ, సిట్ విచారణలో కొత్త విషయాలు -->
E-Paper
Advertisement

Tirumala laddu Adulterated Ghee: తిరుమల కల్తీ నెయ్యి కేసు.. ఆ నెయ్యితో 20 కోట్ల లడ్డూల తయారీ

Tirumala laddu Adulterated Ghee: తిరుమల కల్తీ నెయ్యి కేసు.. ఆ నెయ్యితో 20 కోట్ల లడ్డూల తయారీ
Advertisement

Tirumala laddu Adulterated Ghee: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ మునిగిపోయిందా? కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో జరిగిన వాటిపై సిట్ వేస్తే.. సీబీఐతో విచారణ జరిపించాలని పదేపదే డిమాండ్ చేస్తోంది.  మరి తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎందుకు సైలెంట్ అయ్యింది? సీబీఐ సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయా? వైసీపీ హయాంలో ఏకంగా 20 కోట్ల లడ్డూలు కల్తీ అయ్యాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కొత్త విషయాలు

Advertisement

తిరుమల పేరు చెబితేచాలు చాలామంది మనసు పులకరిస్తుంది. ఎప్పుడు ఆ క్షేత్రానికి వెళ్దామా? అనే భావించేవాళ్లు ఎక్కువగా ఉంటారు. స్వామి సన్నిధికి వెళ్తే చేసిన పాపాలు కొంతైనా తొలగుతాయని భావిస్తుంటారు భక్తులు. అలాంటి క్షేత్రంలో పరమ పవిత్రంగా భావించే స్వామి ప్రసాదం లడ్డూ కల్తీ అయితే చెప్పడానికి ఏమీలేదు.  పాలకులపై ప్రజలకు నమ్మకం పోతోంది. ఆ తర్వాత ఎంత చెప్పినా వినరు. ఇప్పుడు అదే జరిగింది. వైసీపీ హయాంలో జరిగిన తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  వైసీపీ హయాంలో దాదాపు 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారైనట్టు సిట్ విచారణలో బయటపడింది.

వైసీపీ హయాంలో 2019-24 మధ్య దాదాపు 20 కోట్ల శ్రీవారి లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేసినట్టు సీబీఐ సిట్ తేల్చింది. ఐదేళ్ల కాలంలో 48.76 కోట్ల లడ్డూలు తయారు చేసింది టీటీడీ. అందులో 40 శాతం పామాయిల్-పామ్‌కెర్నల్‌-ఇతర రసాయనాలు కలిపినట్టు నిర్ధారణ అయ్యింది. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీకి నెయ్యి సరఫరాను నాలుగు డెయిరీలు చేశాయి. అందులో ఉత్తరాఖండ్‌కు చెందిన భోలేబాబా డెయిరీ, తమిళనాడు దిండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీ, తిరుపతి జిల్లా పునబాకలోని వైష్ణవి డెయిరీ, యూపీకి చెందిన మాల్‌గంగ డెయిరీలు ఉన్నాయి.

Advertisement

20 కోట్ల లడ్డూలు కల్తీ అయ్యాయా?

రూ.250 కోట్లు చెల్లించి మరీ నెయ్యిని రప్పించారు అప్పటి పాలకులు. ఆయా డెయిరీల నుంచి దాదాపుగా 1.61 కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేసింది టీటీడీ. అందులో 68 లక్షల కిలోల నెయ్యి కల్తీ అయి నట్టు తేలింది. ఆ లెక్కన దాదాపు 20 కోట్ల లడ్డూలు కల్తీ అయ్యాయి. శ్రీవారి ఆలయంలో ప్రతీ రోజూ 3 నుంచి 4 లక్షల లడ్డూలు తయారవుతాయి. దీనికి 12 నుంచి 13 వేల కిలోల నెయ్యి ఉపయోగిస్తారు. అంటే ఆ లెక్కన లడ్డూల తయారీకి 40 శాతం కల్తీ నెయ్యిని వినియోగించినట్టు తేలింది. తిరుమలలో తయారు చేసిన లడ్డూలు చివరకు అయోధ్య వరకు వెళ్లాయి కూడా.

ALSO READ:  అరటి రైతులకు బిగ్ రిలీఫ్..  సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు రియాక్ట్ అయ్యారు. నెయ్యి కల్తీ విషయంలో టీటీడీ పాలక మండలి-అధికారులు కుమ్మక్కై భారీ అవినీతికి పాల్పడినట్టు వ్యాఖ్యానించారు. కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలు భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఘాటుగా వ్యాఖ్యానించారు. తిరుమలలో జరిగిన మరిన్ని అక్రమాలను త్వరలో బయటకు తెస్తామని చెప్పకనే చెప్పారాయన. మొత్తానికి తిరుమల కేంద్రంగా వైసీపీ చేసిన ఆగడాలు బయటకు వస్తున్నాయి.  ఈ క్షేత్రాన్ని సర్వనాశనం చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×