E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని చంపేందుకు చక్రధర్ మాస్టర్ ప్లాన్.. మీనాక్షికి షాకిచ్చిన పార్వతి.. అక్షయ్ కు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని చంపేందుకు చక్రధర్ మాస్టర్ ప్లాన్.. మీనాక్షికి షాకిచ్చిన పార్వతి.. అక్షయ్ కు నిజం తెలుస్తుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode November 21st : నిన్నటి ఎపిసోడ్ లో.. తన సొంతవాళ్లే తనకి మోసం చేశారని రాజేంద్రప్రసాద్ ఆవేశంగా ఉంటాడు.. ఎలాగైనా సరే వాళ్ళతో చూడాలని అనుకుంటాడు.. కానీ ఇంట్లోని వాళ్ళందరూ ఆపడంతో ఆగిపోతాడు. ఆ తర్వాత కమల్ మాత్రం సీరియస్ అవుతాడు. ఆ తర్వాతే అందరు చెప్పడంతో కూల్ అవుతాడు. ఇక పల్లవి ఏం జరుగుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అది చూసిన కమల్ మీ నాన్ననే చేశాడు కచ్చితంగా మీ నాన్నని వదిలిపెట్టను అని వార్నింగ్ ఇస్తాడు. ఇంట్లో జరుగుతున్న విషయాన్ని పల్లవి వాళ్ళ నాన్నతో చెబుతుంది. భానుమతి రాజేశ్వర్ కి ఫోన్ చేసి ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది మీ ఆయన ఇలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. నీ పరిస్థితి ఏమవుతుందోనని భయపడుతున్నాను. అని భానుమతి అంటుంది.. తప్పు జరిగితే ఎవర్ని క్షమించకూడదమ్మా నువ్వు నా గురించి ఏం బాధపడకు అన్నయ్యని టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని చెప్పు అని రాజేశ్వరి అంటుంది. ఆరాధ్య అంటించిన బురదను పార్వతి, రాజేంద్ర ప్రసాద్ కడుగుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి తన తండ్రిని కలిసి మా ఇంట్లో వాళ్ళు ఎలాగైనా సరే మీరే పని చేశారని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వాడిని పట్టుకొని ఇక్కడ లేకుండా చేస్తేనే మన సేఫ్ అవుతాం డాడ్ అని పల్లవి అంటుంది. నేను అదే పనిలో ఉన్నాను అమ్మ పడు నాకు తెలియకుండా ఆ ఇంటిని అడ్రస్ ని మార్చేసాడు. వాడి ఫోన్ నెంబర్ కూడా పనిచేయట్లేదు. వాడి కోసం నా మనుషులు వెతుకుతున్నారు ఎక్కడ కనిపించిన సరే వాడిని ఇక్కడ లేకుండా చేసేస్తాను అని చక్రధర్ పల్లవి తో అంటాడు..వాడు గనక దొరికితే మనం కచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే.. ఒకవేళ నేను దొరికిన సరే ఆ ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డున పడేసి మరి జైలుకు వెళ్తాను అని చక్రధర్ అంటాడు..

Advertisement

పల్లవి ఇక తన ఇంటికి వచ్చేస్తుంది. ఆ వీధిలోని వాళ్ళు మా ఇంట్లో సౌభాగ్యవ్రతం చేసుకుంటున్నాము అని పిలవడానికి పార్వతి ఇంటికి వస్తారు. మేము మా ఇంట్లో సర్వైకల్ అని చేసుకుంటున్నాము మీరు తప్పకుండా రావాలి అని అడుగుతారు. అవని ప్రతి ఆడవాళ్లు కోరుకునేది తమ సౌభాగ్యం గురించే కదా మేము కచ్చితంగా వస్తాము అని అంటుంది.. ఇక పార్వతి ఆడవాళ్ళందరూ సౌభాగ్యం కోసమే కదా పూజలు చేస్తుంటారు మేము రాకుండా ఎలా ఉంటాము మేము వస్తామని అంటుంది. అక్కడే ఉన్న మీనాక్షి ఏం చేస్తున్నావ్ వాళ్లు ఈవిడ ఎవరు అని అడుగుతారు.. అవని వాళ్ళ అమ్మగారు మా వియ్యపురాలు అని పార్వతీ పరిచయం చేస్తుంది.

అయితే మీరు కూడా ఈ పూజకు రావాలి అని వాళ్ళు బొట్టు పెట్టి పిలవబోతుంటే పల్లవి వచ్చి ఆగండి అని అంటుంది. భర్త ఎవరో తెలియని వాళ్ళు సౌభాగ్యవ్రతం ఎలా చేసుకుంటారు మీ పిచ్చి గానీ అని మీనాక్షిని అవమానించేలా మాట్లాడుతుంది. అయితే మీరు ఆవిడ భర్త ఎవరో చెప్పుకోలేకపోతున్నా ఆవిడని మీరు వ్రతానికి పిలిస్తే మీరేం వ్రతం చేసుకుంటారు అని పల్లవి రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.. అవును మీ భర్త ఏం చేస్తుంటారు నిజంగా మీకు తెలియదా లేకపోతే చెప్పలేరా అని వచ్చిన వాళ్ళు కూడా అవమానించేలా మాట్లాడుతారు.

Advertisement

వెంటనే పార్వతి కొంతమందికి భర్తలు చేసిన మోసాలు దారుణాల గురించి తెలుసుకొని వాటిని బయట పెట్టడం ఇష్టం లేక ఉంటారు మీరు ఏం పట్టించుకోకండి మేము వస్తాము అని అంటుంది. అవని మాత్రం మా అమ్మని అనడమే పనిగా పెట్టుకున్నావు అసలు నీకేం అవసరం ఉందని మా అమ్మని అంటున్నావు అని అంటుంది. మా నాన్న ఎవరో చెప్పకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అవేంటో నీకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఇంకొకసారి మా అమ్మ పై ఇలాంటి నిందలు వేస్తే ఊరుకునేది లేదు అని అవని వార్నింగ్ ఇస్తుంది..

పార్వతి చూడండి వదిన గారు పల్లవి అన్న మాటలు పట్టించుకోకండి. కానీ దాంట్లో కూడా నిజాలు ఉన్నాయి అన్న విషయాన్ని మీరు గుర్తించండి. మీ భర్త గురించి మీరు చెప్పకపోతే నలుగురు నానా మాటలు అనుకుంటారు. మీరు ఒకవేళ పూజకు వెళ్లిన సరే అక్కడ మాత్రం ఇలాంటి మాటలు ఎదురవుతాయి. అందుకే మీ భర్త గురించి అందరికీ చెప్పండి అని పార్వతి అంటుంది. మీనాక్షి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. మీనాక్షి బాధపడుతుందని అవని లోపలికి వెళ్తుంది.. తన తల్లి బాధ గురించి తెలుసుకొని నువ్వేం బాధపడకు అమ్మ ఆ రాక్షసుడే నిజం చెప్తే నీ మీద ఎటువంటి నిందలు ఉండవు అని అంటుంది.

Also Read :హమ్మయ్య తప్పించుకున్న మనోజ్.. కామాక్షి నిజం చెప్పేస్తుందా? బాలు దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

అప్పుడే అక్కడికి వచ్చిన అక్షయ్ అత్తయ్య గారు మీరు మీ వారి గురించి చెప్పకపోయినా పర్లేదు నేను మీకు ఎప్పుడూ సపోర్ట్ గానే ఉంటాను. ఆ దుర్మార్గుడు మిమ్మల్ని బాధ పెడుతున్నాడు అంటే చెప్పండి నేను వాడు అంతు చూస్తానని మీనాక్షికి ధైర్యం చెప్తాడు.. ఇక రాత్రి అవ్వగానే కమల్ బిర్యానీ తీసుకొని పల్లవి దగ్గరికి వస్తాడు. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం బావ నాకు కూడా పెట్టవా అని పల్లవి అడుగుతుంది. కమల్ పల్లవికి ఊరించి మరీ మొత్తం తినేస్తాడు అది చూసిన పల్లవి షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×