E-Paper
Advertisement

Warangal Politics: హీటెక్కిన ఓరుగల్లు రాజకీయం ఎమ్మెల్యే నాయినికి సవాల్.. పత్తాలేని మాజీ ఎమ్మెల్యే

Warangal Politics: హీటెక్కిన ఓరుగల్లు రాజకీయం ఎమ్మెల్యే నాయినికి సవాల్.. పత్తాలేని మాజీ ఎమ్మెల్యే
Advertisement

Warangal Politics: ఓరుగల్లు రాజకీయం ఒక్కసారి హీటెక్కింది. అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే- మాజీ ఎమ్మెల్యేల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రమైంది. దమ్ముందా అంటూ బీఆర్ఎస్ నేతలు విసిరిన చాంలెం‌జ్‌‌కు అంతే ఘాటుగా స్పందించారు ఆ ఎమ్మెల్యే. ఇంతకీ ఓరుగల్లు పాలిటిక్స్‌లో ఏం జరుగుతోంది?

హీటెక్కిన ఓరుగల్లు రాజకీయం

Advertisement

ఎమ్మెల్యే ఎక్కడికైనా వెళ్ళినా చుట్టూ అనుచరుగణం, గన్‌మెన్లు, భారీ కాన్వాయ్ ఉంటుంది. ప్రత్యర్థుల విసిరిన సవాల్‌ని స్వీకరించారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి. చివరకు ఆయన వచ్చేసరికి పత్తా లేకుండా పోయారు. గురువారం మధ్యాహ్నం బైక్‌పై హనుమకొండ బస్టాండ్ కు వచ్చారు ఎమ్మెల్యే నాయిని. అయితే ఎమ్మెల్యే ఒక్కరే రావడంతో అక్కడి స్థానిక వ్యాపారులు ఒక్కసారిగా షాకయ్యారు.

అసలేం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు.అవేమీ పట్టించుకోని సదరు ఎమ్మెల్యే స్థానిక వ్యాపారులతో ముచ్చటించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ విసిరిన ఛాలెంజ్‌ని దాదాపు రెండు గంటలపాటు ఎమ్మెల్యే నాయిని ఒంటరిగా బస్టాండ్‌లో ఉన్నారు. ప్రత్యర్థులు మాత్రం కనిపించకుండా పోయారు.

Advertisement

ఎమ్మెల్యే నాయినికి సవాల్.. పత్తాలేని మాజీ ఎమ్మెల్యే

పత్తి కొనుగోళ్లు వ్యవహారంపై ఇటీవల మాజీమంత్రి హరీష్‌రావు వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్‌ని సందర్శించారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే నాయినిపై విమర్శలు గుప్పించారు. ఆ స్థాయిలోనే ఎమ్మెల్యే నాయిని కౌంటరిచ్చారు. ఇదే క్రమంలో వరంగల్ జిల్లా బీఆర్ఎస్ కీలక నేతలు.. మానేతను అంతలా విమర్శిస్తే ఊరుకుంటారా అంటూ ఫైర్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్.

పొలిటికల్ విమర్శలకు కౌంటర్ ఇవ్వాల్సింది పోయి, అధిష్టానం చురకల అంటిన ఫ్రస్ట్రేషన్ లో వ్యక్తిగత విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి దమ్ముంటే గన్‌మెన్లు లేకుండా హన్మకొండ బస్ స్టాండ్ కు వెళ్ళాలని సవాల్ విసిరారు. ఆ మరసటి రోజు క్షణాల్లో బస్‌స్టాండ్ వద్ద ఒంటరిగా ప్రత్యక్షమయ్యారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.

ALSO READ: సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం..  డేట్ కూడా ఫిక్స్

సుమారు రెండు గంటల పాటు బస్టాండ్ ప్రాంగణంలోని వ్యాపారులతో ముచ్చటించారు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. తాను ఒంటరిగా వచ్చానని, ఇప్పుడు చూసుకుందామంటూ వినయ్ భాస్కర్ కు ప్రతి సవాల్ విసిరారు. వ్యక్తిగత విమర్శలను సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో మీ పార్టీ నేతల అవినీతి బాగోతాలు బయటపెట్టి బజార్లో నిలబెడతానని మండిపడ్డారు. దీంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో రాజకీయ వేడి తారాస్థాయికి చేరినట్లు అయింది.

మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చేసిన సవాల్ కు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి స్పందిస్తారని ఎవరూ ఊహించలేదు. ఆయన ఇగోను వినయ్ భాస్కర్ రెచ్చగొట్టారని అంటున్నారు. అంతేగాటుగా ప్రతిస్పందన ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయట. దీంతో వరంగల్ పశ్చిమ పాలిటిక్స్ లో ఏం జరగబోతుందోననే చర్చ జోరుగా సాగుతోంది.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×