E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: శ్రీయ మాటకు శ్రీకర్ షాక్.. చక్రధర్ గుట్టు రట్టు.. మీనాక్షిని అవమానించిన పల్లవి..

Intinti Ramayanam Today Episode: శ్రీయ మాటకు శ్రీకర్ షాక్.. చక్రధర్ గుట్టు రట్టు.. మీనాక్షిని అవమానించిన పల్లవి..
Advertisement

Intinti Ramayanam Today Episode November 20th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇల్లు పోవడానికి కారణం చక్రధర్ అని చెప్పగానే ఇంట్లోని వాళ్లంతా కోపంగా ఉంటారు. కమల్ వాడి అంతు చూడాలి అని అంటాడు. పల్లవి వాళ్ళ నాన్ననే అని అనగానే అందరూ పల్లవి వైపు సీరియస్గా చూస్తారు. పల్లవి మాత్రం అక్షయ్ మాట విని షాక్ అయిపోతుంది. మా నాన్న ఇదంతా చేశాడు అనడానికి మీ దగ్గర ఏంటి సాక్ష్యం ఉంది అని పల్లవి అడుగుతుంది. పలుకుబడి ఉన్నా వ్యక్తి మీద ఇలాంటి నిందలు వేస్తారని పల్లవి అనగానే అన్ని ఆధారాలు దొరికిన తర్వాత అప్పుడు మాట్లాడుతాను అని అక్షయ్ అంటాడు. తర్వాత అవని తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే దొరుకుతారు మనకు ఏదో ఒక దారి ఉంటుంది అని అంటుంది.. అక్షయ్ కు అవని ధైర్యం చెబుతూ ఉంటుంది.. మీరేం బాధపడకండి దొంగ అనేవాడు ఎవడైనా సరే ఖచ్చితంగా దొరుకుతాడు. అవనికి అక్షయ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడు. దాన్ని చూసి అవని మురిసిపోతుంది. ఒకప్పుడు ఆవేశంలో నేను చేసిన తప్పును ఇప్పుడు సరిదిద్దుకుంటున్న అని అక్షయ్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. తన సొంతవాళ్లే తనకి మోసం చేశారని రాజేంద్రప్రసాద్ ఆవేశంగా ఉంటాడు.. ఎలాగైనా సరే వాళ్ళతో చూడాలని అనుకుంటాడు.. కానీ ఇంట్లోని వాళ్ళందరూ ఆపడంతో ఆగిపోతాడు. ఆ తర్వాత కమల్ మాత్రం సీరియస్ అవుతాడు. ఆ తర్వాతే అందరు చెప్పడంతో కూల్ అవుతాడు. ఇక పల్లవి ఏం జరుగుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అది చూసిన కమల్ మీ నాన్ననే చేశాడు కచ్చితంగా మీ నాన్నని వదిలిపెట్టను అని వార్నింగ్ ఇస్తాడు. ఇంట్లో జరుగుతున్న విషయాన్ని పల్లవి వాళ్ళ నాన్నతో చెబుతుంది. భానుమతి రాజేశ్వర్ కి ఫోన్ చేసి ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది మీ ఆయన ఇలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. నీ పరిస్థితి ఏమవుతుందోనని భయపడుతున్నాను. అని భానుమతి అంటుంది.. తప్పు జరిగితే ఎవర్ని క్షమించకూడదమ్మా నువ్వు నా గురించి ఏం బాధపడకు అన్నయ్యని టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని చెప్పు అని రాజేశ్వరి అంటుంది.

Advertisement

ఆరాధ్య బాలు ఆడుకుంటూ ఉంటుంది. అయితే శ్రీకర్ కారుకి ఆ బాలు వెళ్లి తగలడంతో బురద అంటుకుంటుంది.. అది చూసినా శ్రియ కోపంతో రగిలిపోతుంది. కొంచమైనా బుద్ధి లేదా అసలు నువ్వు పిల్లగా పిల్ల పిశాచి అంటూ ఆరాధ్యను దారుణంగా మాట్లాడుతుంది.. అప్పుడే బయట నుంచి వచ్చిన రాజేంద్రప్రసాద్ పార్వతి ఆరాధ్యును శ్రియా తిట్టడం చూసి షాక్ అవుతారు. ఏమైందమ్మా ఎందుకు అలా అంటున్నావు అనేసి పార్వతి అడుగుతుంది.. లక్షలు పెట్టి కారు కొంటే చూడండి ఎలా బురద పూసిందో అనేసి శ్రీయ అంటుంది.. బురద కడిగితే పోతుంది. కానీ నువ్వు చిన్నపిల్లతో ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదా అని తిడతారు.

మీకేం తెలుసు అని వాళ్లను కూడా శ్రీయా దారుణంగా అవమానించేలా మాట్లాడుతుంది.. పార్వతి ఆరాధ్య ఏం జరిగిందమ్మా అనేసి అడుగుతుంది. నేను బాలు ఆడుకుంటున్నాను నానమ్మ అయితే ఆ బాలు వెళ్లి కారుకు తగిలింది దానికున్న బురద అంటుకుంది అనేసి అంటుంది. అది చూసిన పిన్ని సీరియస్ అయ్యే తిడుతుంది. నా తప్పు ఏమి లేదు అని ఎంతగా చెప్పినా శ్రీయా మాట వినదు. ఆ బురదను కడుగు అని శ్రీయ అంటుంది. కానీ పార్వతి చిన్న పిల్లతో పని చేయిస్తావా అని అంటే మీకు అంతగా ఉంటే మీరు ఆ బురదను కడగండి అని దారుణంగా అవమానిస్తుంది.

Advertisement

Also Read: శృతి వల్ల అడ్డంగా దొరికిపోయిన మనోజ్.. ప్రభావతికి టెన్షన్.. సత్యం సీరియస్..

అక్కడకు వచ్చిన శ్రీకర్ ఏం చేస్తున్నావ్ శ్రీయ అని అడుగుతాడు. ఏం చెయ్యట్లేదు కారకు బురదను ఆరాధ్య అంటిస్తే కడిగారు అని శ్రీయా అంటుంది. నువ్వు చేసేది ఏం బాగోలేదు పెద్దవాళ్లని కూడా చూడకుండా ఇలాంటి చేస్తామని అస్సలు అనుకోలేదు అని శ్రీకర్ అంటాడు. కానీ శ్రీకర్ మాటను శ్రేయ వినదు వాళ్లే చేస్తానన్నారు అందుకే నేనేం అనలేదు అని అంటుంది. ఇప్పటికే మనం వెళ్ళాలనుకున్న ప్రోగ్రాం టైం అయిపోయింది వెళ్ళిపోదాం పద అనేసి శ్రీయ అంటుంది. అమ్మ నాన్న నన్ను క్షమించండి అని అడుగుతాడు శ్రీకర్.. ఇక అక్షయ్ అవని ఇళ్లు తీసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్లాలని అనుకుంటారు.. అక్కడ ఇంటికి తాళం వేసి ఉండడం చూసి షాక్ అవుతారు. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్లారని ఆరా తీసుకుంటారు. వాడు అడ్రస్ చేంజ్ చేశాడని చెప్పగానే ఒకసారిగా షాక్ అయిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×