E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న అవని.. పల్లవి ఫుల్ హ్యాపీ..పుట్టింటికి వెళ్లిపోయిన ప్రణతి..

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న అవని.. పల్లవి ఫుల్ హ్యాపీ..పుట్టింటికి వెళ్లిపోయిన ప్రణతి..
Advertisement

Intinti Ramayanam Today Episode May 1st : రాజేశ్వరి పల్లవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అవును ఇంత త్వరగా పూర్తవుతుందని అస్సలు అనుకోలేదు.. అనుకున్న దాని కంటే భరత్ ఎక్కువగానే రియాక్ట్ అయ్యాడు. దానివల్లే అక్షయ్ భరత్ కాళ్లు పట్టుకున్నాడు.. అవని అక్షయ లకు ఇది ఘోర అవమానమే.. ప్రతిసారి ఇది గుర్తుచేసే అవమానమే అని పల్లవి కూడా సంతోషపడుతుంది. ఇక కమల్ ని అక్షయ అవనీలు ఇంటికి తీసుకొస్తారు. కమల్ ఇంటికి రావడం చూసిన పార్వతి ఎమోషనల్ అయిపోతుంది.. కమల్ అక్షయ్ భరత్ కాల్ పట్టుకున్నాడు అని చెప్పగానే కన్నీళ్లు పెట్టుకుంటుంది పార్వతి. ఇక ప్రణతి నీతో బతకడం వేస్ట్ అని అక్కడినుంచి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది..

అక్షయ్ కాళ్ళు పట్టుకున్న అవని..

పార్వతి పోలీస్ స్టేషన్ వెళ్లిన కమల్ని పోలీసులు కొడుతున్నారు ఏంటో అని కంగారు పడిపోతూ ఉంటుంది. సమస్యలన్నీ మాకే వస్తున్నాయి ఏంటో అని బాధపడిపోతూ ఉంటుంది. పల్లవి రాజేశ్వరిని మాత్రం భారత్ని రెచ్చగొట్టి అవని అక్షయలకు ఇలాగే నిద్ర లేకుండా చేయాలని అనుకుంటారు. కమల్ ఇంట్లోకి రాగానే పార్వతి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. నిన్ను పోలీసులు తీసుకెళ్లారని నేను చాలా టెన్షన్ పడ్డాను రా . ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని పార్వతి అంటుంది.. అసలు నన్ను రిలీజ్ చేయడానికి అన్నయ్య ఏం చేశాడో తెలుసా అమ్మా అని కమలంటాడు. ఏం చేస్తాడు రా ఏమైంది అని అడగగానే ఆ భరత్ కాళ్ళు పట్టుకున్నాడు అని చెప్పగానే పార్వతి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అవని మీరు నా తమ్ముడు కాళ్లు పట్టుకున్నారు నేను మీ కాళ్లు పట్టుకొని క్షమాపణలు అడుగుతున్నాను అని అంటుంది. దానికి అక్షయ్ నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి అవి అని అంటాడు.

పల్లవి పై పార్వతి సీరియస్..

Advertisement

అన్నయ్య చేసిన పని నాకు ఏమీ నచ్చలేదమ్మా.. నన్ను విడిపించడం కోసం ఆ భరత్ కాళ్ళు పట్టుకున్నాడు అని కమలంటాడు. అయితే అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ఇక్కడ ఏదో సెంటిమెంట్ డైలాగులు సీన్ జరుగుతున్నట్లు ఉంది మన ఎంట్రీ ఇచ్చి దాన్ని చెడగొట్టాలని అనుకుంటుంది.. బావా నువ్వు వచ్చేసావా..? నీ మీద పోలీసులు కు ఆ భరత్ మర్డర్ అటెండ్ చేస్తారని కేసు పెట్టాడు అని తెలిసింది. అందుకే నాకు చాలా బాధగా ఉంది బావ ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా చాలా సంతోషంగా ఉంది అని పల్లవి అంటుంది. అసలు నీ భర్తను తీసుకురాడానికి అక్ష ఏం చేసాడో తెలుసా? భర్త ఎక్కడున్నాడో తెలుసా? కనీసం నీ భర్త గురించి ఆలోచించకుండా నువ్వు తిరుగుతూ ఉన్నావా అని పార్వతి సీరియస్ అవుతుంది.

ఇంట్లోంచి వెళ్లిపోయిన ప్రణతి..

తన అన్నయ్య తన భర్త కాళ్లు పట్టుకున్నాడని చాలా బాధపడిపోతూ ఉంటుంది ప్రణతి. ఇక బ్యాగ్ సర్దుకుని ప్రణతి గది నుంచి బయటికి రావడం చూసిన చక్రధర్ షాక్ అవుతాడు. ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావ్ బ్యాగ్ తీసుకొని అని అడుగుతాడు. కానీ ప్రణతి మాత్రం మీనాక్షిని పిలిచి అత్తయ్య నేను ఇక్కడే ఉండలేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని అడుగుతుంది. ఏంటమ్మా ప్రణతి చిన్న చిన్న విషయాలకి ఇలా పుట్టింటికి వెళ్లాలని అనుకుంటున్నావా అని మీనాక్షి ఎంత చెప్పినా సరే ప్రణతి మాత్రం వినదు. అటు భరత్ కూడా ప్రణతి పై కోపంగా ఉంటాడు వెళ్లాలనుకుంటే వెళ్ళు అని చెప్పడంతో ప్రతి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది..

పల్లవికి కమల్ స్ట్రాంగ్ వార్నింగ్..

Advertisement

భరత్ తన అన్నయ్యని కొట్టడం.. నా చెల్లెల్ని కొట్టడం. అలాగే భరత్ కాళ్ళు పట్టుకోవడం ఇవన్నీ ఆలోచిస్తూ కమల్ చాలా కోపంగా ఉంటాడు.. భవ నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది అని పల్లవి లోపలికి వెళ్లి అనగానే కమల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నీ మొగుడు మీద ప్రేమ ఉంటే నువ్వు పోలీస్ స్టేషన్ కి రావాలి కానీ నీకు మొగులు మీద కన్నా ఊర్లో పనిలే ఎక్కువ అయిపోయాయి అని కమల్ పల్లవిని తిడతాడు. భరత్ నీల రెచ్చగొట్టి మీ అమ్మ నువ్వే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని నాకు తెలియదు అనుకుంటున్నావా అని కమల్ అనగానే పల్లవి నా గురించి తెలిసిపోయిందా అని కంగారు పడిపోతూ ఉంటుంది. భరత్ ని అడ్డుపెట్టుకొని మీ అమ్మ ఎలాగైతే ఇది చేస్తుందో.. నేను నిన్ను అడ్డుపెట్టుకొని అలానే మీ అమ్మని ఆడుకుంటాను అని కమల్ పల్లవికి వార్నింగ్ ఇస్తాడు.

పుట్టింటికి వచ్చేసిన ప్రణతి..

ప్రణతి బ్యాగు సద్దుకొని పుట్టింటికి రావడం చూస్తున్న పార్వతీతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటమ్మా ఇలా బ్యాగ్ పట్టుకొని వచ్చేసావు అని పార్వతి అడుగుతుంది. మిమ్మల్ని అంతగా అవమానించిన భరత్ దగ్గర నేను ఉండలేను. అందుకే పుట్టింటికి వచ్చేసాను అని ప్రణతి చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. అత్తింట్లో ఉన్న ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పుట్టింటి వాళ్ళుగా మేము పరిష్కరిస్తాము. భర్తతో ఏదైనా గొడవలు ఉంటే అవి మీ భార్య భర్తలు పరిష్కరించుకోవాలి. ఇలా భర్తను వదిలిపెట్టి పుట్టింటికి రావడం మంచిది కాదు అని అవని ప్రణతికి చెబుతుంది. మొత్తానికి ఎపిసోడ్ చివరి సీను హైలైట్ గా నిలుస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో భరత్ ని రాజేశ్వరి తీసుకొని వెళుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ మూవీ నుంచి వల్లక్క అవుట్.. ఎందుకంటే..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×